News


ఆర్థిక రంగ పరిస్థితులపై మంత్రి సీతారామన్‌ సమీక్ష

Friday 8th November 2019
news_main1573185316.png-29432

  • ఆర్‌బీఐ గవర్నర్‌ సహా ప్రముఖుల హాజరు

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగ పరిస్థితి, ఈ రంగంలో ఉన్న ఒత్తిళ్లు తదితర అంశాలపై ‘ఆర్థిక రంగ స్థిరత్వం, అభివృద్ధి కౌన్సిల్‌’ (ఎఫ్‌ఎస్‌డీసీ) 21వ సమావేశంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమీక్ష చేశారు. గురువారం ఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ తదితర కీలక ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎఫ్‌ఎస్‌డీసీ అనేది ఆర్థిక రంగానికి సంబంధించి నియంత్రణ సంస్థల అత్యున్నత మండలి. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షత వహిస్తారు. దేశ జీడీపీ వృద్ధి జూన్‌ త్రైమాసికంలో 5 శాతానికి క్షీణించడం, సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు ఆశావహంగా లేకపోవడంతో ఈ సమీక్షకు ప్రాధాన్యం నెలకొంది. ‘‘స్థూల ఆర్థిక అంశాలతోపాటు ఆర్థిక రంగ పరిస్థితులపై వివరంగా చర్చించడం జరిగింది. నియంత్రణ పరంగా అంతర్గత అంశాలతోపాటు, సైబర్‌ భదత్రపైనా సమీక్ష జరిగింది’’అని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులకు తెలిపారు.  ‘‘అధిక శాతం ఎన్‌బీఎఫ్‌సీలు చక్కగా పనిచేస్తున్నాయి. బ్యాంకుల నుంచి రుణాలను సమీకరించుకోగలుగుతున్నాయి. కొన్ని అయితే విదేశాల నుంచి నిధులు తెచ్చుకుంటున్నాయి’’ అని శక్తికాంతదాస్‌ తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీ ఆస్తుల్లో 75 శాతం వాటా కలిగిన అగ్ర స్థాయి 50 ఎన్‌బీఎఫ్‌సీలను ఆర్‌బీఐ సునిశితంగా పర్యవేక్షిస్తోందని, యాజమాన్యాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని చెప్పారు. ఎన్‌బీఎఫ్‌సీలకు సీఆర్‌ఏఆర్‌ (క్యాపిటల్‌ అడెక్వసీ రేషియో) 15 శాతం అవసరం కాగా, మొత్తం మీద ఈ రంగంలో సగటు సీఆర్‌ఏఆర్‌ 19.3 శాతంగా ఉన్నట్టు తెలిపారు. సెబీ చైర్మన్‌ అజయ్‌త్యాగి, ఐఆర్‌డీఏఐ చైర్మన్‌ సుభాష్‌చంద్ర కుంతియా తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు. 



You may be interested

మార్కెట్లోకి మెర్సిడెజ్‌ బెంజ్‌ వీ-క్లాస్‌ ఎలైట్‌

Friday 8th November 2019

ధర రూ. 1.10 కోట్లు  11 సెకన్లలో సున్నా నుంచి 100కి.మీ వేగం చెన్నై: జర్మనీకి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ మెర్సిడెస్‌ బెంజ్‌.. కొత్త మల్టీ-పర్పస్‌ వెహికిల్‌ ‘వీ–క్లాస్ ఎలైట్’ను గురువారం భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీ–క్లాస్ ఎక్స్‌ప్రెషన్, వీ–క్లాస్ ఎక్స్‌క్లూజివ్‌ కార్లకు అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌గా విడుదలైన ఈ విలాసవంతమైన కారు ధర రూ. 1.10 కోట్లు. భారత్‌ స్టేజ్‌–6 నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఈ కారులో 2.0-లీటర్‌ డీజిల్‌

ఐటీలో మధ్యస్థాయి ఉద్యోగులకు గండం

Friday 8th November 2019

-5-10 శాతం మేర తొలగింపు  -ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌వో బాలకృష్ణన్‌ అంచనాలు బెంగళూరు: ఐటీ రంగంలో మధ్య స్థాయి ఉద్యోగుల్లో 5 నుంచి 10 శాతం మందిని తొలగించడం మినహా కంపెనీలకు మరో ప్రత్యామ్నాయం లేదని ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌వో వి.బాలకృష్ణన్‌ అన్నారు. ఐటీ కంపెనీల్లో సుమారు 20-30 శాతం వరకు మధ్య ‍స్థాయి ఉద్యోగులు ఉంటుంటారు. ఐటీ కంపెనీలు మధ్య స్థాయిలో అధిక భారాన్ని మోస్తున్నాయని, దీన్ని తగ్గించుకోవడం ద్వారా మరింత

Most from this category