News


వృద్ధి 9 శాతం సాధించాలి..

Monday 5th August 2019
Markets_main1564992339.png-27548

  • అప్పుడే 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యం
  • ఈవై నివేదిక

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించుకున్నట్లుగా భారత్ 5 లక్షల కోట్ల (ట్రిలియన్‌) డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే వరుసగా అయిదేళ్ల పాటు ఏటా 9 శాతం మేర వృద్ధి చెందాల్సి ఉంటుందని కన్సల్టెన్సీ సంస్థ ఈవై పేర్కొంది. అలాగే, మొత్తం పెట్టుబడుల రేటు కూడా స్థూల దేశీయోత్పత్తిలో 38 శాతానికి పెరగాల్సి ఉంటుందని ఎకానమీ వాచ్ పేరిట రూపొందించిన ఒక నివేదికలో వివరించింది. ఒకవేళ భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2019-20) 7 శాతం వృద్ధి రేటు సాధించిన పక్షంలో క్రితం సంవత్సరంలో ఉన్న 2.7 ట్రిలియన్ డాలర్ల స్థాయి నుంచి ఎకానమీ 3 ట్రిలియన్ డాలర్లకు చేరొచ్చని వివరించింది. అదే 9 శాతం మేర వృద్ధి కొనసాగిన పక్షంలో 2021 (ఆర్థిక సంవత్సరం)లో 3.3 ట్రిలియన్ డాలర్లు, 2023లో 4.1 ట్రిలియన్ డాలర్లు, 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు చేరగలదని ఈవై పేర్కొంది. ఈ క్రమంలో ప్రస్తుతం 31.3  శాతంగా ఉన్న స్థూల పెట్టుబడి రేటును 38 శాతానికి పెంచుకోవాల్సి ఉంటుందని తెలిపింది. "ఒకవేళ ద్రవ్యోల్బణం రేటు సగటున 4 శాతం కన్నా తక్కువే ఉండి, రూపాయి మారకం విలువ క్షీణత ఏటా రెండు శాతం కన్నా ఎక్కువే ఉంటే 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించడానికి మరింత సమయం పడుతుంది" అని వివరించింది. 

1-2 ఏళ్లలో పుంజుకోనున్న వృద్ధి: బిమల్ జలాన్
ఎకానమీలో ప్రస్తుత మందగమనం చక్రీయమైనదేనని, ఏడాది రెండేళ్లలో వృద్ధి మళ్లీ పుంజుకోగలదని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ తెలిపారు. కేంద్రం ఇప్పటికే పలు సంస్కరణలు ప్రకటించిందని ఆయన చెప్పారు. అయితే, అవి ఎంత వరకూ అమలవుతాయి.. ముఖ్యంగా పెట్టుబడులపరంగా ఎంత వరకూ సాకారం కాగలవన్నదే ప్రశ్నార్థకమైనదని జలాన్ పేర్కొన్నారు. 1991లో ఎదురైన చెల్లింపుల సంక్షోభ పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి పూర్తిగా భిన్నమైనదని ఆయన చెప్పారు. "1991 నాటితో పోలిస్తే భారత్ ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉంది. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉంది. అటు విదేశీ మారక నిల్వలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక, ప్రైవేట్ రంగ పెట్టుబడులు ఇంకా పూర్తి స్థాయిలో రాకపోవడానికి అటు డీమోనిటైజేషన్ ప్రభావం ‍అయినా అయ్యి ఉండొచ్చు. లేదా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు చూసే దాకా ఆగాలని ఇన్వెస్టర్లు భావిస్తూ ఉండైనా ఉండొచ్చు. అటు విదేశాల నుంచి కేంద్ర ప్రభుత్వం సార్వభౌమ రుణ సమీకరణ విషయానికొస్తే.. ఇది స్వల్పకాలానికి కాకుండా దీర్ఘకాలికమైనదైతేనే శ్రేయస్కరం. ప్రభుత్వం కూడా ఈ రుణాల కాలావధి 5-20 ఏళ్లు ఉంటుందని చెబుతోంది" అని జలాన్ పేర్కొన్నారు. You may be interested

అమ్మకాల ఒత్తిడిలో రియల్టీ షేర్లు

Monday 5th August 2019

మార్కెట్‌ పతనంతో భాగంగా రియల్టీ రంగ షేర్లు సోమవారం ట్రేడింగ్ కుప్పకూలాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ నేడు బీఎస్‌ఈఓలో 3శాతం క్షీణించింది. నేడు ఇండెక్స్‌లో 258.35 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ఒక దశలో 3శాతం పతనమైన 253.80 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం గం.2:00లకు ఇండెక్స్‌

ఇంటి వద్దకే బైక్‌, స్కూటర్‌ డెలివరీ

Monday 5th August 2019

హీరో మోటోకార్ప్‌ ప్రణాళికలు న్యూఢిల్లీ: దేశ ద్విచక్ర వాహన మార్కెట్లో అగ్రగామిగా ఉన్న హీరో మోటోకార్ప్‌ బైక్‌, స్కూటర్లను కస్టమర్ల ఇంటి వద్దకే డెలివరీ చేసే ప్రణాళికలతో ఉంది. ఇప్పటికే ముంబై, బెంగళూరు, నోయిడాలో ఈ సేవలను ఆరంభించగా, రానున్న కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా మరో 25 పట్టణాలకు విస్తరించాలనుకుంటోంది. ‘‘వినూత్న విధానాల అబివృద్ధికి, కస్టమర్లకు మెరుగైన అనుభవాన్నిచ్చే వ్యాపార నమూనాల కోసం పెట్టుబడులు పెడుతూనే ఉన్నాం. మా నూతన విధానం

Most from this category