News


5600 కోట్ల డాలర్ల దిగుమతులపై సుంకాల పెంపు?!

Saturday 25th January 2020
news_main1579949207.png-31208

బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉందంటున్న నిపుణులు
చైనాతో పాటు ఇతర దేశాలకు చెందిన ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రిక్‌ గూడ్స్‌, కెమికల్స్‌, హస్తకళల రంగాల దాదాపు 50 రకాల ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు పెంచాలని భారత్‌ యోచిస్తోంది. చైనాతో పాటు మరికొన్ని దేశాలకు చెందిన దాదాపు 5600 కోట్ల డాలర్ల దిగుమతులపై సుంకాలు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బడ్జెట్లో ఈ మేరకు ప్రకటన ఉండొచ్చని సమాచారం. తాజా సుంకాల పెంపు మొబైల్‌ చార్జర్లు, పారిశ్రామిక రసాయనాలు, దీపాలు, చెక్క ఫర్నిచర్‌, కొవొత్తులు, జువెలరీ తదితరాలపై ఉండొచ్చని అంచనా. ఈ పెంపు నిజమైతే దేశీయంగా మొబైల్‌ ఫోన్లు ఉత్పత్తి చేస్తూ చార్జర్లు దిగుమతి చేసుకునే కంపెనీలకు, ఐకియా లాంటి ఫర్నిచర్‌ కంపెనీలకు నెగిటివ్‌ ప్రభావం ఉంటుందని మార్కెట్‌వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఇండియాలో సుంకాలు ఎక్కువని ఐకియా ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే! అయితే ఇప్పటికే 5-10 శాతం సుంకాలు పెంచాల్సిన ఐటమ్స్‌ను వాణిజ్య మంత్రిత్వ శాఖ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం గుర్తించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అనవసర వస్తువుల దిగుమతులను కట్టడి చేయడమే ఈ సుంకాల లక్ష్యమని మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. దీనికితోడు ఈ వస్తువుల విషయంలో దేశీయ కంపెనీలకు మేలు చేయడం కూడా ప్రభుత్వ ఉద్దేశమన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు రంగాల్లో దేశీయ ఉత్పత్తిని పెంచే క్రమంలో వాటిపై దిగుమతి సుంకాలను కట్టడి చేస్తూ వస్తోంది. బడ్జెట్లో చౌక దిగుమతుల కట్టడికి అవసరమైన చర్యలుంటాయని బీజేపీ ప్రతినిధి ఒకరు రాయిటర్స్‌కు చెప్పారు. మరోవైపు తమకు సంబంధించిన దాదాపు ఐదారువందల కోట్ల డాలర్ల వ్యవసాయోత్పత్తులను ఇండియా కొనుగోలు చేస్తేనే తిరిగి వాణిజ్య బంధం సుధృఢం చేసే చర్యలు చేపడతామని అమెరికా ఇటీవల ప్రకటించింది. భారత్‌ను జీఎస్‌పీపీ నుంచి గతేడాది అమెరికా తొలగించింది. దీంతో యూఎస్‌కు చెందిన రెండు డజన్ల వస్తూత్పత్తులపై ఇండియా అధిక సుంకాలు విధించింది. You may be interested

ఎల్‌అండ్‌టీ షేరుపై బ్రోకరేజ్‌ సంస్థల అభిప్రాయమిదే..!

Saturday 25th January 2020

ఎల్‌ అండ్‌ టీ త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో శుక్రవారం మార్కెట్‌ ముగిసే సరికి 2.03శాతం పెరిగి రూ.1359.80 వద్ద స్థిరపడింది. మూడో క్వార్టర్‌ ఫలితాలను ఒక పరిశీలిస్తే... పన్ను వ్యయం తగ్గడంతో పాటు నిర్వహణ ఆదాయం కలిసిరావడంతో నికరలాభం గతేడాదితో పోలిస్తే 15 శాతం వృద్ధిని సాధించి రూ.రూ.2,560 కోట్లను ఆర్జించింది.  మొత్తం ఆదాయం రూ.34,823 కోట్ల నుంచి రూ.36,718 కోట్లకు పెరిగిందని పేర్కొంది. వ్యవస్థలో ఆర్థిక

ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం జూమ్‌

Saturday 25th January 2020

క్యూ3లో 158 శాతం అప్‌ తగ్గిన ప్రొవిజన్లు, పెరిగిన ఇతర ఆదాయం నీరసించిన మొండిబకాయిలు ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో నికర లాభం 158 శాతం దూసుకెళ్లి రూ. 4,146 కోట్లను తాకింది. ఇందుకు ప్రొవిజన్లు తగ్గడం, ఇతర ఆదాయం, రుణ నాణ్యత మెరుగుపడటం వంటి అంశాలు సహకరించాయి. గతేడాది(2018-19) క్యూ3లో రూ. 1605 కోట్ల లాభం మాత్రమే ఆర్జించింది.

Most from this category