News


ఈ-పాన్‌ ఇక సులభం

Tuesday 5th November 2019
news_main1572947268.png-29368

ఆధార్‌ కార్డు డేటా బేస్‌లోని సమాచారాన్ని వినియోగించుకోని, ఆన్‌లైన్‌లో పాన్‌ కార్డును జారీ చేసేందుకు ఆదాయపన్ను శాఖ సిద్ధమవుతుందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. వచ్చే కొన్ని వారాలలో  ఎలక్ట్రానిక్‌ పాన్‌(ఈ-పాన్‌) సౌకర్యాన్ని ప్రారంభించాలని ఆదాయ శాఖ ప్రణాళికలు వేస్తోందని, ఇప్పటికే గత ఎనిమిది రోజులలో 62,000 ఈ-పాన్‌లను పైలేట్‌ ప్రాజెక్ట్‌గా జారీ చేసిందని ఈ పత్రిక తెలిపింది. ‘రియల్‌ టైంకు చేరువలో’ భాగంగా ఈ సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావలని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది. డిజిటల్‌ సంతకం కలిగి ఉన్న ఈ-పాన్‌, క్యూఆర్‌ కోడ్‌ను కలిగివుంటుందని, ఇందులో వ్యక్తి ప్రాథమిక సమాచారం, ఫోటో ఉంటాయని, వ్యక్తిగత వివరాలను సురక్షితంగా ఉంచేందుకు ఈ క్యూఆర్‌ కోడ్‌ ఎన్‌క్రిప్ట్‌ అయివుంటుందని అధికారులను కోట్‌ చేస్తూ ఈ వార్త పత్రిక పేర్కొంది. పాన్‌ కార్డుకు ధరఖాస్తు చేసుకోవాలనుకునేవారి ఆధార్‌ కార్డు సమాచారాన్ని వన్‌ టైం పాస్‌వార్డ్‌ ఆదారంగా ధ్రువీకరించుకోవాలి. ఆధార్‌కార్డు డేటా బేస్‌ నుంచి సమాచారాన్ని వినియోగించుకోనుండడంతో, వివరాలను అందించేందుకు డాక్యుమెంట్లును అప్‌లోడ్‌ చేయవలసిన అవసరం లేదు. ‘ఆదాయపన్ను సేవలను డిజిటలైజ్‌ చేయడం, ఏ ఆఫిస్‌ చుట్టు తిరగకుండా ఆదాయ పన్ను సేవలను పొందడంలో భాగంగా ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది’ అని అధికారులను కోట్‌ చేస్తు ఈ వార్త పత్రిక పేర్కొంది.



You may be interested

పీఎన్‌బీ లాభం రూ. 507 కోట్లు..షేరు 5 శాతం డౌన్‌

Tuesday 5th November 2019

ప్రభుత్వరంగానికి చెందిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు నిరాశపరిచాయి. ఈ క్యూ2లో బ్యాంక్‌ రూ.507.05 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం 11శాతం వృద్ధితో రూ.15,556.61 కోట్లను నమోదు చేసింది. గతేడాది క్యూ2లో మొత్తం ఆదాయం రూ.14,035.88 కోట్లుగా ఉంది. ఇదే త్రైమాసికంలో రూ.4,262 నికర వడ్డీ ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ2లో సాధించిన రూ.3,974 కోట్ల పోలిస్తే ఇది 7.2శాతం

ఆటోమొబైల్‌ షేర్లపై పాజిటివ్‌

Tuesday 5th November 2019

‘టాటా మోటర్స్‌, అశోక్‌ లేలాండ్‌, మారుతి సుజుకీ, ఐషర్‌ మోటర్స్‌ స్టాకులపై బై కాల్‌ ను కలిగివున్నాం. అదేవిధంగా ద్విచక్ర వాహనాలకు సంబంధించి హీరో, బజాజ్‌ ఆటోపై సానుకూలంగా ఉన్నాం’ అని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యురిటీస్‌, డైరక్టర​ సంజయ్‌ భాసిన్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు.  ప్ర: మార్కెట్లు గరిష్ఠ స్థాయిలకు చేరుతున్నాయి, సంస్థాగత ఇన్వెస్టర్లు మాత్రం అమ్మకాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఏం జరుగుతుంది? సంజయ్‌ భాసిన్‌: 10,700

Most from this category