News


6.1 నుంచి 7 శాతానికి వృద్ధిరేటు

Thursday 24th October 2019
news_main1571888346.png-29098

  • భారత్‌పై ఐఎంఎఫ్‌ అంచనా

సింగపూర్‌: భారత్‌ ఆర్థిక వృద్ధిరేటు 2020-2021లో కొంత మెరుగుపడుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఆసియా పసిఫిక్‌ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ జోనథన్‌ ఆస్రా‍్టయ్‌ విశ్లేషించారు. ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 2019-20లో భారత్‌ వృద్ధి రేటు కేవలం 6.1 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు. 2020-21లో ఇది 7 శాతానికి మెరుగుపడుతుందన్నది ఐఎంఎఫ్‌ అంచనా అని తెలిపారు. ఒకపక్క కేంద్రం తీసుకున్న కార్పొరేట్‌ పన్ను కోత నిర్ణయం, మరోవైపు  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుసరిస్తున్న సరళతర ద్రవ్య పరపతి విధానాలు ఫలితాలు ఇవ్వనుండడం 2020-21లో వృద్ధి పురోగతికి దోహదపడే అంశంగా  పేర్కొన్నారు. 



You may be interested

అసెంబ్లీ ఫలితాల ఎఫెక్ట్‌...గ్యాప్‌అప్‌ ప్రారంభం

Thursday 24th October 2019

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించబోతున్నట్లు తొలి ట్రెండ్స్‌ ద్వారా వెల్లడికావడంతో గురువారం మార్కెట్‌ గ్యాప్‌అప్‌తో మొదలయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 164 పాయింట్ల లాభంతో 39,223 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 58  పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,662 పాయింట్ల వద్ద ఆరంభమయ్యాయి. క్రితం రోజు ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో పాటు బోనస్‌ ఇష్యూను ప్రకటించిన హెచ్‌సీఎల్‌ టెక్‌ 5 శాతం లాభంతో రూ. 1,155 వద్ద మొదలయ్యింది. అలాగే

బజాజ్‌ ఆటో లాభం రూ.1,523 కోట్లు

Thursday 24th October 2019

21 శాతం వృద్ధి  4 శాతం తగ్గిన మొత్తం ఆదాయం  అమ్మకాలు 12 శాతం డౌన్‌  న్యూఢిల్లీ: బజాజ్‌ ఆటో కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.1,523 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం (రూ.1,257 కోట్లు)తో పోల్చితే 21 శాతం వృద్ధి సాధించామని బజాజ్‌ ఆటో తెలిపింది. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు ప్రయోజనం కారణంగా రూ.182 కోట్ల పన్ను

Most from this category