News


భారత్‌ వృద్ధి 4.8 శాతమే!: ఐఎంఎఫ్‌

Tuesday 21st January 2020
news_main1579574740.png-31056

దావోస్‌: భారత్‌ ఆర్థికవృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-2020) 4.8 శాతమే నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనావేసింది. ఇంతక్రితం ఈ వృద్ధి అంచనా 6.1 శాతం.  వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ (డబ్ల్యూఈఓ) తాజా అంచనాలను ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ గీతా గోపీనాథ్‌ ఇక్కడ వెలువరిస్తూ, భారత్‌లో గ్రామీణ డిమాండ్‌ వృద్ధి పడిపోయిందని, బ్యాంకింగ్‌ రుణ వృద్ధి మందగించిందనీ పేర్కొన్నారు. ఆయా కారణాలు భారత్‌ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. అయితే 2020-21లో భారత్‌ వృద్ధి 5.8 శాతానికి, 1921-22 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని కూడా ఐఎంఎఫ్‌ అంచనావేసింది. ఇక 2019లో అంతర్జాతీయ వృద్ధి 2.9 శాతంగా ఉంటుందన్నది ఐఎంఎఫ్‌ అంచనా. ఇంతక్రితం ఈ అంచనా 3 శాతం.  అటుపై రెండు సంవత్సరాల్లో ఈ వృద్ధిరేటు వరుసగా 3.3 శాతం, 3.4 శాతానికి పెరుగుతుందని కూడా ఐఎంఎఫ్‌ తన తాజా అంచనాల్లో పేర్కొంది. 



You may be interested

కోటక్‌ బ్యాంక్‌ లాభం రూ.1,596 కోట్లు

Tuesday 21st January 2020

క్యూ3లో 24 శాతం వృద్ధి  పెరిగిన మొండి బకాయిలు (అప్‌డేటెడ్‌...) న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,596 కోట్ల నికర లాభం(స్టాండ్‌అలోన్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సంర ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం, రూ.1,291 కోట్లతో పోల్చితే 24 శాతం వృద్ధి సాధించామని కోటక్‌ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.7,214 కోట్ల నుంచి రూ.8,077 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మరిన్ని

12,216కు దిగువన మరింత బలహీనత

Monday 20th January 2020

లాభాల స్వీకరణ కారణంగా నిఫ్టీ సోమవారం కీలకమైన 12,300 స్థాయి దిగువకు వచ్చేసింది. గత వారం మొత్తం 12,270-12,300 మధ్య ఇండెక్స్‌ మంచి మద్దతు తీసుకుంది. కానీ, అమ్మకాల ఒత్తిడితో ఈ వారం ఆరంభంలో దీన్ని కోల్పోయింది. డైలీ చార్ట్‌లలో పొడవైన బ్లాక్‌ డే ప్యాటర్న్‌ను పోలిన పెద్ద బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసిందని నిపుణుల విశ్లేషణ.   నిఫ్టీ ప్రారంభంలో 12,430.50 వద్ద నూతన గరిష్టాన్ని నమోదు చేసింది. కానీ, కొన్ని

Most from this category