News


రెండవ దశకు సిద్ధమైన ఐకేపీ

Tuesday 5th November 2019
news_main1572926036.png-29352

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్న ఐకేపీ నాలెడ్జ్‌ పార్క్‌ రెండో దశకు సిద్ధమైంది. సంస్థ 20వ వార్షికోత్సవాల్లో భాగంగా నవంబరు 8న భవిష్యత్‌ ప్రాణాళికను ప్రకటించనుంది. పరిశోధన రంగంలో విజయవంతమయ్యే కంపెనీల రూపకల్పన సంస్థ ప్రధాన ఉద్ధేశమని ఐకేపీ చైర్మన్‌ దీపాన్విత ఛటోపాధ్యాయ తెలిపారు. సీవోవో ప్రసాద్‌ ఎడె, చీఫ్‌ మేనేజర్‌ డి.విశ్వనాథంతో కలిసి సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కంపెనీలు మేధో సంపత్తి హక్కులను దక్కించుకోవడంపై దృష్టిసారిస్తామన్నారు. సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లో లోతైన అధ్యయనం ప్రోత్సహిస్తామని చెప్పారు. ‘ఐకేపీ నాలెడ్జ్‌ పార్క్‌లో ఇప్పటి వరకు 45 కంపెనీలు పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను స్థాపించాయి. రూ.2,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎస్‌ఎంఈ హబ్‌ మార్చికల్లా రెడీ అవుతోంది. అగ్రి ఇన్నోవేషన్‌ ట్రాన్స్‌లేషన్‌ సెంటర్‌ను నవంబరు 8న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించనున్నారు. ఆర్‌అండ్‌డీ కేంద్రాల ఏర్పాటుకు ఇంకా 25 ఎకరాల స్థలం ఉంది.’ అని వివరించారు. You may be interested

బంధన్ బ్యాంకులో ఎఫ్‌ఐఐ పరిమితి పెంపు..

Tuesday 5th November 2019

న్యూఢిల్లీ: ప్రమోటరు షేర్‌హోల్డింగ్‌ను ఆర్‌బీఐ నిర్దేశిత స్థాయికి తగ్గించే క్రమంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 49 శాతానికి పెంచేందుకు బంధన్ బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 24 శాతంగా ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌ఐఐ), విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరిమితిని ప్రత్యేక తీర్మానం ద్వారా 49 శాతానికి పెంచే ప్రతిపాదనకు అక్టోబర్ 24న జరిగిన బోర్డు సమావేశంలో డైరెక్టర్లు ఆమోదం తెలిపినట్లు బ్యాంకు వెల్లడించింది.

వృద్ధి 5.8 శాతానికి పడిపోవచ్చు

Tuesday 5th November 2019

2019-20పై బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్‌లించ్‌ అంచనాల సవరణ ముంబై: ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నా కానీ, పండుగల సమయంలో డిమాండ్‌ పుంజుకోకపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 5.8 శాతానికి తగ్గిపోవచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌ (బోఫాఎంఎల్‌) అంచనా వేసింది. వచ్చే ఫిబ్రవరిలో జరిగే సమీక్షలో ఆర్‌బీఐ ఎంపీసీ కీలక రేట్లను 0.15 శాతం మేర తగ్గిస్తుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మొదటి

Most from this category