News


పరిశ్రమల పురోగతి - ధరల తగ్గుదల

Thursday 13th September 2018
news_main1536814313.png-20225

న్యూఢిల్లీ: జూలై, ఆగస్టులో సానుకూలమైన స్థూల ఆర్థిక గణాంకాలు నమోదయ్యాయి. జూలైలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి 6.6 శాతంగా నమోదయ్యింది. ఇక ఆగస్టులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.69 శాతంగా నమోదయ్యింది. 11 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. పారిశ్రామికోత్పత్తి, రిటైల్‌ ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న నేపథ్యంలో ఇప్పట్లో ఆర్‌బీఐ రెపో రేటును పెంచకపోవచ్చన్న అంచనాలున్నాయి. అక్టోబర్‌ 5న పాలసీ సమీక్ష జరగనుంది కూడా. గతేడాది జూలైలో ఐఐపీ వృద్ధి రేటు కేవలం ఒక శాతమే. అయితే నెలవారీగా చూస్తే ఐఐపీ వృద్ధి రేటు 6.8 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గింది. 
మెరిసిన తయారీ, క్యాపిటల్‌ గూడ్స్‌...
 తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం వృద్ధి రేటు జూలైలో భారీగా 7 శాతంగా నమోదైంది. తయారీ రంగంలోని మొత్తం 23 గ్రూపుల్లో 22 సానుకూల ఫలితాలను అందించాయి. కాగా గత ఏడాది ఇదే నెలలో అసలు వృద్ధిలేకపోగా -0.1 శాత క్షీణత నమోదయింది.
 కన్సూమర్‌ డ్యూరబుల్స్‌: వృద్ధి రేటు భారీగా 14.4 శాతంగా నమోదయింది. గత ఏడాది జూలైలో -2.4 శాతం క్షీణత నమోదయింది. 
 ‍క్యాపిటల్‌ గూడ్స్‌: డిమాండ్‌కు, భారీ యంత్రపరికరాల ఉత్పత్తికి సూచిక అయిన ఈ రంగం 3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. 2017 జూలైలో ఈ విభాగం -1.1 శాతం క్షీణత కనిపించింది.
 విద్యుత్‌: జూలైలో స్వల్పంగా 6.6 శాతం నుంచి 6.7 శాతానికి పెరిగింది. 
నాలుగు నెలల్లో...
ఏప్రిల్‌-జూలై మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి రేటు 1.7 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. తయారీ రంగం వృద్ధి ఈ నెలల్లో 1.2 శాతం నుంచి 5.6 శాతానికి పెరిగింది. విద్యుత్‌ రంగంలో వృద్ధి మాత్రం 5.6 శాతం నుంచి 5.3 శాతానికి తగ్గింది. 
-------------
7 శాతం తగ్గిన కూరగాయల ధరలు...
మొత్తం రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.69 శాతంగా నమోదైంది. కూరగాయల ధరలు భారీగా 7 శాతం తగ్గాయి. మొత్తం ఆరు విభాగాల్లో ఒకటిగా ఉన్న ఆహారం- పానీయాల విభాగంలో కూరగాయల ధరలతో పాటు పప్పులు (-7.76 శాతం), చక్కెర, తీపి ఉత్పత్తుల (-5.45 శాతం) తగ్గాయి. గుడ్ల ధరలు భారీగా 6.96 శాతం పెరిగాయి. మాంసం, చేపలు (3.21 శాతం), పాలు, పాల ఉత్పత్తులు (2.66 శాతం), చమురు, ఫ్యాట్స్‌ (3.47 శాతం), పండ్లు (3.57 శాతం), ఆల్కాహాలేతర పానీయాలు (1.86 శాతం) ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రెపేర్డ్‌ మీల్స్‌ ధర 4.16 శాతం పెరిగింది. 
 పాన్‌, పొగాకు, ఇతర హానికారక ఉత్పత్తుల ధరలు 5.34 శాతం పెరిగాయి.
 దుస్తులు, పాదరక్షల విభాగంలో రేటు 4.88 శాతంగా ఉంది. 
 హౌసింగ్‌ విషయంలో ధరల పెరుగుదల రేటు 7.59.
 ఇంధనం లైట్‌: ద్రవ్యోల్బణం రేటు 8.47 శాతంగా ఉంది. 
 You may be interested

బ్యాంకింగ్‌ రుణ వృద్ధి 13.49 శాతం అప్‌!

Thursday 13th September 2018

ముంబై: బ్యాంకింగ్‌ రుణ వృద్ధి  2018 ఆగస్టు 31వ తేదీతో ముగిసిన పక్షంలో వార్షికంగా 13.49 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. విలువ రూపంలో చూస్తే ఈ మొత్తం రూ.87,89,259 కోట్లు. గత ఏడాది ఇదే పక్షం రోజులకు బ్యాంకింగ్‌ రుణం రూ.77,44,237 కోట్లు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బుధవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ♦ ఆగస్టు 17తో ముగిసిన పక్షం రోజుల్లో వార్షికంగా రుణ

రూపాయి @ 100!!

Thursday 13th September 2018

న్యూఢిల్లీ: రూపాయి విలువ పతనం మరింతగా కొనసాగుతుందని, వచ్చే పదేళ్లలో ఏకంగా 100కి కూడా పడిపోయే అవకాశం ఉందని ప్రముఖ ఇన్వెస్టరు మార్క్‌ ఫేబర్‌ అంచనా వేశారు. డాలర్‌తో పోలిస్తే ప్రస్తుత రూపాయి పతనానికి ఇతర ఆసియా కరెన్సీల క్షీణతతో పాటు భారత ద్రవ్య పరపతి విధానం కూడా కారణమని ఆయన చెప్పారు. భారత్‌లో కఠినతర పరపతి విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో చాలా మంది..

Most from this category