STOCKS

News


దివాలా చట్టం పరిధిలోకి ఎన్‌బీఎఫ్‌సీలు.... బ్యాంకులకు మంచిదే: మూడీస్‌

Monday 25th November 2019
news_main1574678714.png-29843

డీఫాల్ట్‌ను ఎదుర్కొంటున్న ఎన్‌బీఎఫ్‌సీ(నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ కంపెనీలు)లను దివాలా చట్టం పరిధిలోకి తీసుకురావడం బ్యాంకులపై పాజిటివ్‌ ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ బ్రోకరేజి సంస్థ మూడిస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ ఓ నివేదికలో పేర్కొంది. దివాలా చట్టంలోని సెక్షన్‌ 227తో, రూ. 500 కోట్ల ఆస్తి విలువ కలిగిన ఒత్తిడిలోని ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీ(హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు)లను దివాలా కోర్టుకు సిఫార్సు చేసే అధికారాన్ని ప్రభుత్వం తాజాగా ఆర్‌బీఐకి ఇచ్చింది. దీని ఆధారంగా ఒత్తిడిలోని ఎన్‌బీఎఫ్‌సీ కోసం కేవలం లిక్విడైజేషన్‌ మాత్రమే రిజల్యూషన్‌ ఫ్రేమ్‌వర్క్‌గా అందుబాటులో ఉంది. హెచ్‌ఎఫ్‌సీల్లో దివాలా కోర్టుకు వెళ్లిన మొదటి కంపెనీగా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ నిలుస్తుంది. ‘ఎన్‌బీఎఫ్‌సీలను దివాలా చట్టం కిందకు తీసుకురావడం, బ్యాంకులకు రుణాల పరంగా సానుకూల ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఒత్తిడిలోని ఎన్‌బీఎఫ్‌సీలను ఒక క్రమంలో రిజల్యుషన్‌ చేయడానికి దివాలా చట్టం ఉపయోగపడుతుంది’ అని సోమవారం మూడిస్‌ నివేదిక పేర్కొంది. దివాలా చట్టంలోని సెక్షన్‌ 227 ప్రకారం దివాలా, లిక్విడైజేషన్‌ పక్రియ కోసం ఫైనాన్సియల్‌ సెక్టార్‌కు చెందిన నియంత్రణ సంస్థలతో చర్చించి, ఎన్‌బీఎఫ్‌సీ లేదా హెచ్‌ఎఫ్‌సీపై దివాలా పక్రియను ఆర్‌బీఐ ప్రారంభించొచ్చు.  కాగా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ బోర్డును నవంబర్‌ 20వ తేదీన ఆర్‌బీఐ రద్దు చేసి, కొత్త అడ్మినిస్ట్రేటర్‌ను నియమించింది. అంతేకాకుండా రూ. 90,000 కోట్ల రుణ భారాన్ని మోస్తున్న ఈ కంపెనీపై దివాలా పక్రియను ప్రారంభించింది. ఏకంగా కేంద్రబ్యాంకు ఎన్‌బీఎఫ్‌సీ రిజల్యూషన్‌ పక్రియలో పాలుపంచుకోవడం, వ్యవస్థలో ఆర్థిక స్థిరత్వం కోసం ఎన్‌బీఎఫ్‌సీల ప్రాముఖ్యాన్ని తెలుపుతోంది. ఏదైనా ఎన్‌బీఎఫ్‌సీ డిఫాల్ట్‌ నేరుగా బ్యాంక్‌లు, ఇతర రుణ దాతలపై పడుతుంది’ అని మూడిస్‌ నివేదిక పేర్కొంది. ‘తీవ్ర లిక్విడిటీ కొరత లేదా బలహీన కార్పోరేట్‌ పాలన వంటి సమస్యలతో నలుగుతున్న ఎన్‌బీఎఫ్‌సీలను చక్కదిద్దడానికి, వాటి సమస్యల్ని పరిష్కరించేందుకు, ఆర్‌బీఐ నిర్ధిష్ట పద్దతిలో ఐబీసీ(దివాలా చట్టం)ని వాడుతుందని అంచనావేస్తున్నాం’ అని  మూడీస్‌ తెలిపింది. అతేకాకుండా రుణ సమస్యలను పరిష్కారించడంలో బ్యాంకులు, ఆర్‌బీఐ ఐబీసీకి వెళ్లేముందు ఇతర మార్గాలను పరిశీలించాలని కోరింది. You may be interested

నిఫ్టీ-50లో సగానికి పైగా చౌకగానే..!

Tuesday 26th November 2019

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ తన చరిత్రలోనే నూతన గరిష్టాల వద్ద సోమవారం ముగిసింది. నిఫ్టీ కూడా నూతన గరిష్టాలకు దగ్గర్లోనే ఉంది. కానీ, తరచి చూస్తే నిఫ్టీ-50 సూచీలోని 50 కంపెనీల్లో సగానికి పైనే స్టాక్స్‌ తక్కువ వ్యాల్యూషన్ల వద్దే ట్రేడవుతున్నాయి. అంటే కొన్ని స్టాక్స్‌లోనే ర్యాలీ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ సమయంలో ఇన్వెస్టర్లు ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలన్న సంశయాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కాకపోయినా, ఆర్థిక రంగం రికవరీ

షార్ట్‌టర్మ్‌కు డజన్‌ సిఫార్సులు

Monday 25th November 2019

వచ్చే కొన్ని వారాల్లో మంచి రాబడినిచ్చే 12 స్టాకులను వివిధ అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు. రెలిగేర్‌ బ్రోకింగ్‌ అజిత్‌ మిశ్రా సిఫార్సులు 1. లుపిన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 820. స్టాప్‌లాస్‌ రూ. 750. డైలీ చార్టుల్లో రివర్సల్‌ ప్యాట్రన్‌ ఏర్పరిచి బ్రేకవుట్‌కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం 200 రోజుల డీఎంఏపైన కొనసాగుతూ పాజిటివ్‌గా కనిపిస్తోంది. 2. పీవీఆర్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1920. స్టాప్‌లాస్‌ రూ. 1700. రికార్డు హైని తాకి రిట్రేసైన

Most from this category