News


వాహనాలపై జీఎస్‌టీ తగ్గింపునకు ప్రయత్నిస్తా: గడ్కరీ

Thursday 5th September 2019
news_main1567674474.png-28217

ప్రస్తుతం దేశియ వాహన రంగం మందగమనాన్ని ఎదుర్కొం‍టుందని, మందగమనం నుంచి బయటపడడానికి సహాయం కోసం ఎదురుచూస్తోందని సియామ్‌(సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చురర్స్‌) ఎన్‌క్లేవ్‌లో కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు.  అంతేకాకుండా సియామ్‌ ఎప్పటి నుంచో కొరుతున్న పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలపై జీఎస్‌టీ రేటు తగ్గింపు విషయాన్ని గురించి ఆర్థిక శాఖతో మాట్లాడతానని హామి ఇచ్చారు. కాగా వాహనాల విక్రయాలు తగ్గిపోవడంతో ఆటో రంగం కంపెనీల అమ్మకాలు అగష్టులో 30 శాతం పడిపోవడం గమనార్హం. 
   వాహన విక్రయాలు తిరిగి పుంజుకునేందుకు ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలపై జీఎస్‌టీ రేటును తగ్గించాలని, స్క్రాపేజి పాలసీని ప్రారంభించాలని సియామ్‌ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కొరుతున్న విషయం తెలిసిందే.  గత నెలలో ఆటో రంగానికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌ అనేక చర్యలను ప్రకటించినప్పటికి అవి అమలులోకి రాకపోవడంతో వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు నెగిటివ్‌లో ఉన్నాయని సియామ్‌ తెలిపింది. ‘వాహనాల డిమాండ్‌ను తిరిగి పెంచేందుకు ఆటో రంగ కంపెనీలు ఆఫర్‌లు, డిస్కౌంట్లను విరామం లేకుండా అందిస్తున్నప్పటికి అధికంగా డిస్కౌంట్లను అందించే సామర్ధ్యం ఆటోపరిశ్రమకు పరిమితంగా ఉంది. ప్రభుత్వం వాహనాలపై విధించే జీఎస్‌టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తే, వాహానాల ఖర్చు తగ్గుతుంది. ఫలితంగా డిమాండ్‌ పెరుగుతుంది’ అని సియామ్‌ ప్రెసిడెంట్‌ రాజన్‌ వాధేరా ఓ నివేదికలో అన్నారు. ఆర్థిక మంత్రి ప్రకటించిన అన్ని వాహనాలను కవర్‌చేసే స్ర్కాపేజ్‌ పాలసీతో ప్రభుత్వం తక్షణమే ముందుకు రావడం చాలా అవసరమని అన్నారు. ‘పండుగ సీజన్‌ దగ్గర్లో ఉంది. ఇలాంటి సమయంలో  ఆర్థిక మంత్రి ప్రకటించిన ఆటోరంగ పోత్సాహకాలను వెంటనే అమలుచేయడం మంచిది. అప్పుడే ఈ పండుగ సీజన్‌ ఆటోరంగానికి లాభాన్నిస్తుంది. ఫలితంగా ఆటోరంగ కంపెనీలు మందగమనం నుంచి బయటపడతాయి’ అని అన్నారు. వినియోగదారుల సెంటిమెంట్‌ తగ్గుతుందని, డీలర్లకు రుణాలు అందుబాటులో ఉండడం లేదని తెలిపారు.
    కాగా మారుతి సుజుకి ఇండియా, హ్యుందాయ్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్, హోండా వంటి పెద్ద కంపెనీల విక్రయాలు ఆగస్టులో తగ్గాయి. మారుతి ఆగస్టు అమ్మకాలు 33 శాతం క్షీణించి 1,06,413 యూనిట్లుగా నమోదుకాగా, టాటా మోటార్స్ ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 58 శాతం పడిపోయాయి. అదేవిధంగా హోండా కార్స్ ఇండియా విక్రయాలు 51 శాతం, టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) అమ్మకాలు 21 శాతం తగ్గాయి. మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) దేశీయ అమ్మకాలు గత నెలలో 26 శాతం తగ్గి 33,564 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది గత ఏడాది ఆగస్టులో 45,373 యూనిట్లతో పోలిస్తే చాలా తక్కువ కావడం గమనార్హం.You may be interested

టాటామోటర్స్‌ రయ్‌

Thursday 5th September 2019

రెండు రోజుల వరుస పతనం అనంతరం టాటామోటర్స్‌ షేర్లు లాభాల పట్టాలెక్కాయి. ఆగస్ట్‌లో అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ విక్రయాలు క్షీణించినప్పటికీ.., షేర్లు ర్యాలీ చేయడం విశేషం. నేడు బీస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ. 110.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో ఒకదశలో 7శాతం లాభపడి రూ.117.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. కంపెనీ జేఎల్‌ఆర్‌ అమ్మకాలు

లాభాల్లో ‍ప్రభుత్వరంగ షేర్లు

Thursday 5th September 2019

 ప్రభుత్వరంగ షేర్లైన ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, ఐఓసీ షేర్లు దాదాపు 7శాతం ర్యాలీ చేశాయి. వాటితో పాటు హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, గెయిల్‌, నాల్కో షేర్లు సైతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షే,ర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌ఈ ఇండెక్స్‌ దాదాపు 4శాతం ర్యాలీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వం తన వాటాను కొంతమేర రానున్న రోజుల్లో ఈటీఎఫ్‌ల ద్వారా విక్రయించి, వాటాను 49 శాతం మేర

Most from this category