News


లాభాల కోసం ‘ప్రైవేటు’ పనిచేయడం తప్పేంటి?

Friday 23rd August 2019
news_main1566539865.png-27965

‘లాభాలు ప్రైవేట్‌, నష్టాలు పబ్లిక్‌ ’ వంటి విధానం ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని ప్రకటించిన ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ వ్యాఖ్యలతో పూర్తిగా నిరాకరిస్తున్నానని హీరో గ్రూప్ వ్యవస్థాపక ప్రమోటర్ సునీల్ కాంత్ ముంజాల్ ఓ ఇంటర్యూలో అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో గొప్ప ఆర్థిక వ్యవస్థలను గమనిస్తే అవి ఏ విధంగా అభివృద్ధి చెందాయో తెలుస్తుందని తెలిపారు. ‘ఉద్దీపన ప్యాకేజిని ప్రకటించే ఆర్థిక వ్యవస్థలలో మనది మొదటి ఆర్థికవ్యవస్థ కాదు. చాలా దేశాలు వీటిని అనుసరించాయి. ఫలితంగా ఎటువంటి విధానాలు ఆర్థిక వ్యవస్థకు మంచివో, ఏవి కావో అంచనావేయడం మనకి సులభతరం అయ్యింది’ అని వివరించారు.

  ప్రభుత్వం, విధాన రూపకర్తలు సులభంగా అమలు చేయగలిగే, పరిశ్రమలకు స్వేచ్ఛనిచ్చే సులువైన పాలసీలను ఆర్థిక వ్యవస్థకు అందించాలని, ఈ అంశాలే మంచి ఆర్థిక వ్యవస్థకు అవసరమని అన్నారు. ‘సంక్షోభాలను ఎదుర్కోడానికి పరిశ్రమలకు భద్రతా అవసరం. పరిశ్రమలు పనిచేయడానికి ఏకైక మార్గం ఇదే. పరిశ్రమలకు భద్రత కల్పించడంలో కొన్ని దేశాల ప్రభుత్వాలు చురుకైన పాత్రను పోషిస్తాయి. మరికొన్ని దేశాలు తక్కువ పాత్రను పోషిస్తాయి. ఏమైనప్పటికి ప్రభుత్వం ఒక భద్రతా వలయంగా పనిచేయాలి. లాభాల కోసమే ప్రైవేట్‌ సెక్టార్‌ పనిచేస్తుంది, అందులో ఎటువంటి తప్పు నాకు కనిపించడం లేదు’ అని వివరించారు. ప్రభుత్వానికి పరిశ్రమలు, వ్యాపారాలను నడిపించడంలో చొరవ తగ్గిపోతుందని, ఓవర్‌ టైంలో ఆర్థిక వ్యవస్థను నడిపించడానికి ఒక పెద్ద ఇంజన్‌ అవసరమని, ఆ పాత్రను ప్రైవేట్‌ సెక్టార్‌ పోషిస్తుందని అన్నారు.



You may be interested

ఎయిర్‌ ఇండియాకు ఇంధన సరఫరా నిలిపివేత

Friday 23rd August 2019

బకాయిలు చెల్లించకపోవడం వల్లే  న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియాకు ఇంధన సరఫరాలను ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు నిలిపివేశాయి. విశాఖపట్టణం, కొచ్చిన్‌, మోహాలీ, రాంచి, పుణే, పాట్నా... ఈ ఆరు విమానాశ్రయాల్లో ఎయిర్‌ ఇండియా విమానాలకు ఇంధన సరఫరాలను గురువారం సాయంత్రం గం. 4 ల నుంచి ఆపేశామని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఎయిర్‌ ఇండియా సంస్థ బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే ఈ ఇంధన సరఫరాల

నష్టాల్లోంచి లాభాల్లోకి సూచీలు

Friday 23rd August 2019

నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు అన్యూహంగా లాభాల్లోకి మళ్లాయి. ఎఫ్‌పీఐలపై బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఎఫ్‌పీఐలపై సర్‌ఛార్జీలను విధింపును కేంద్రం ఎత్తివేస్తుందనే వార్తలు వెలుగులోకి రావడం ఇందుకు కారణమైంది. ప్యాకేజీ ఉద్దీపన చర్యలు ఉండవని కేంద్రం స్పష్టం చేయడంతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలు, రూపాయి ఎనిమిది నెలల కనిష్టానికి పతనం తదితర కారణాలతో సూచీలు నిన్న 6నెలల కనిష్టం వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. నిన్నటి నష్టాల ముగింపును

Most from this category