News


అనుకోకుండా .. అలా ఇన్వెస్ట్ చేశా!

Thursday 17th October 2019
news_main1571283974.png-28933

  • స్టార్టప్‌లలో పెట్టుబడులపై రతన్ టాటా

ముంబై: కొన్నాళ్లుగా పలు స్టార్టప్‌లలో పెట్టుబడులతో వార్తల్లో నిలుస్తున్న పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్‌ గౌరవ చైర్మన్ రతన్ టాటా తన ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పెదవి విప్పారు. అనుకోకుండానే తాను స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టినట్లు వెల్లడించారు. "నేను కొంత అనుకోకుండానే స్టార్టప్‌ ఇన్వెస్టరుగా మారానని చెప్పవచ్చు. టాటా గ్రూప్‌లో కీలక హోదాలో ఉన్నప్పుడు స్టార్టప్ సంస్థలు ఆసక్తికరంగానే అనిపించినప్పటికీ.. వాటిని కాస్త అంటరానివిగానే చూసేవాణ్ని. ఎందుకంటే ఏదో ఒకటి, ఎక్కడో ఒక చోట టాటా గ్రూప్‌నకు ప్రయోజనాల వైరుధ్యం ఉండేది. కానీ నేను రిటైరయిన తర్వాత స్వేచ్ఛ లభించడం వల్ల ఆసక్తికరంగా అనిపించిన సంస్థల్లో నా సొంత డబ్బును కాస్త కాస్తగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. అలా అంతకు ముందుతో పోలిస్తే నేను మరికాస్త ఎక్కువ రిస్కులు తీసుకున్నాను. ఇప్పుడు దాదాపు రెండు మూడేళ్లయ్యింది. ఇదో అనుభవం. ఈ రంగంలో చురుకైన సంస్థలు, అద్భుతమైన మేధస్సు గలవారు ఉన్నారు. మరో విషయం.. పెట్టుబడులు పెడుతున్నా కదా అని నా దగ్గర బోలెడంత డబ్బు ఉందని అనుకోవద్దు" అని రతన్ టాటా చెప్పుకొచ్చారు. 
వినూత్న ఐడియాలే ప్రాతిపదిక..
స్టార్టప్స్‌ ప్రమోటర్లలో కసి, వినూత్న ఐడియాలు, అవి అందించే పరిష్కారమార్గాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇన్వెస్ట్ చేస్తానని రతన్ టాటా చెప్పారు. "ఏదైనా సరే ఇప్పుడు ఉన్న దానికంటే మరింత మెరుగ్గా, కొత్తగా చేయాలన్న తాపత్రయం, కసి ప్రమోటర్లలో ఉండాలి. వీటన్నింటితో పాటు అంతిమ ఫలితం మంచో, చెడో.. చివరి దాకా పోరాడగలిగే తత్వం, ఓరిమి ఉండాలి. ఎంట్రప్రెన్యూర్‌లలో నేను ఈ గుణాలే ప్రధానంగా చూస్తాను" అని ఆయన తెలిపారు. వైద్యం, ఈ-కామర్స్, తయారీ తదితర రంగాల్లో స్టార్టప్స్‌ రాకకు, పెట్టుబడులకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని టాటా పేర్కొన్నారు. ట్యాక్సీ సేవల సంస్థ ఓలా, పేమెంట్స్ సంస్థ పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌, క్యూర్‌ఫిట్‌, క్లైమాసెల్‌, కార్‌దేఖో, అర్బన్‌ల్యాడర్‌, లెన్స్‌కార్ట్‌, డాగ్‌స్పాట్ వంటి స్టార్టప్స్‌లో రతన్ టాటా వ్యక్తిగత హోదాలో పెట్టుబడులు పెట్టారు. You may be interested

స్థిరంగా ప్రారంభమైన మార్కెట్‌

Thursday 17th October 2019

రెండు రోజులుగా ర్యాలీ జరుపుతున్న భారత్‌ స్టాక్‌ సూచీలు గురువారం స్థిరంగా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 48 పాయింట్ల స్వల్పలాభంతో 38,647 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో 11,666 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

అంతా వాళ్లే చేశారు..!!

Thursday 17th October 2019

మన్మోహన్‌, రాజన్‌ హయాంలోనే ప్రభుత్వరంగ బ్యాంకులకు దుర్గతి వాటిని బాగుచేయడమే నా ప్రాథమిక కర్తవ్యం కేంద్ర ఆర్థిక మంత్రినిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, మాజీ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ హయాంలోనే ప్రభుత్వరంగ బ్యాంకులు దుర్భర పరిస్థితులను చవిచూశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. దెబ్బతిన్న ప్రభుత్వరంగ బ్యాంకులను బాగు చేయడమే తన ప్రాథమిక కర్తవ్యంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. అమెరికాలోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌

Most from this category