News


పర్యటనకు ఛలో హైదరాబాద్‌

Tuesday 24th December 2019
news_main1577160491.png-30399

  • ఈ నగరానికి పెరుగుతున్న దేశీ పర్యాటకులు 
  • బుకింగ్‌డాట్‌కామ్‌ సర్వే వెల్లడి 


ముంబై: దేశీయ పర్యాటకులు ఈ ఏడాది హైదరాబాద్‌కు జై కొట్టారు. దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో హైదరాబాద్‌కే అగ్రతాంబూలం దక్కిందని బుకింగ్‌డాట్‌కామ్‌  సర్వేలో వెల్లడైంది. ఇక దేశీయ పర్యాటకుల అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాల్లో దుబాయ్‌ అగ్రస్థానంలో నిలిచిందని ఈ సర్వే పేర్కొంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్‌ 30 వరకూ పర్యాటక, వసతి పరంగా జరిగిన బుకింగ్స్‌ ఆధారంగా ఈ వివరాలను బుకింగ్‌డాట్‌కామ్‌ వెల్లడించింది. మరిన్ని వివరాలు....

  • ఈ ఏడాది దేశీయ పర్యాటకులు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన పర్యాటక నగరంగా హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఈ నగరంతో పాటు పుణే, జైపూర్‌, కోచి, మైసూర్‌ ప్రాంతాలను కూడా దేశీయ పర్యాటకులు అత్యధికంగా సందర్శించారు. 
  • భారత పర్యాటకులు ప్రాధాన్యత ఇచ్చిన అంతర్జాతీయ సందర్శన నగరాలుగా దుబాయ్‌, బ్యాంకాక్‌, సింగపూర్‌, లండన్‌, కౌలాలంపూర్‌లు నిలిచాయి. 
  • దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న పర్యాటక ప్రాంతాలుగా షిల్లాంగ్‌, మంగళూరు, రిషికేశ్‌, గౌహతి, పుణేలు నిలిచాయి. 
  • దేశీయ పర్యాటకుల బుకింగ్స్‌ పరంగా చూస్తే, అంతర్జాతీయంగా వేగంగా వృద్ధి చెందుతున్న పర్యాటక నగరాలుగా ఇస్తాంబుల్‌(టర్కీ), పుకెట్‌(పటాంగ్‌ బీచ్‌), హనోయ్‌, హొచిమిన్‌ సిటీ(వియత్నామ్‌), ఉబద్‌(ఇండోనేషియా), టోక్యో(జపాన్‌) అవతరించాయి. 
  • ఈ ఏడాది భారత్‌కు అత్యధికంగా ఇజ్రాయేల్‌, బంగ్లాదేశ్‌, పోలండ్‌, జపాన్‌, సింగపూర్‌ల నుంచి పర్యాటకులు వచ్చారు. 
  • విదేశీ పర్యాటకులు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చిన దేశీయ పర్యాటక ప్రాంతంగా జైపూర్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో హైదరాబాద్‌, పుణే, కోచి, ఆగ్రాలు నిలిచాయి. 



You may be interested

ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌లో జీఐసీ పెట్టుబడులు

Tuesday 24th December 2019

 రూ.434 కోట్లు ఇన్వెస్ట్‌చేసిన సింగపూర్‌ వెల్త్‌ఫండ్‌  న్యూఢిల్లీ: బెంగళూరుకు చెందిన రియల్టీ కంపెనీ ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌లో సింగపూర్‌కు చెందిన సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ జీఐసీ రూ.434 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నది. ఈ పెట్టుబడులకు గాను ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ కంపెనీ 1.34 కోట్ల ఈక్విటీ షేర్లను జీఐసీ అనుబంధ సంస్థ గామ్నాట్‌ పీటీఈ లిమిటెడ్‌కుకి జారీ చేయనున్నది. ఒక్కో షేర్‌ను రూ.323 ధరకు జారీ చేస్తామని, ఈ షేర్ల జారీకి డైరెక్టర్ల బోర్డ్‌

ఏపీ, తెలంగాణలో ఎయిర్‌టెల్‌ వైఫై కాలింగ్‌

Tuesday 24th December 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- టెలికం రంగ సంస్థ ఎయిర్‌టెల్‌ వాయిస్‌ ఓవర్‌ వైఫై సర్వీస్‌ ‘ఎయిర్‌టెల్‌ వైఫై కాలింగ్‌’ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌కు విస్తరించింది. అలాగే ముంబై, కోల్‌కత, కర్నాటక, తమిళనాడులోనూ ఈ సేవలను పరిచయం చేసింది. వైఫై ఆధారంగా ఏదేని నెట్‌వర్క్‌కు టెల్కో గ్రేడ్‌ కాల్స్‌ చేసుకునే వీలుండడం దీని ప్రత్యేకత. వినియోగదార్ల నుంచి అదనంగా ఎటువంటి చార్జీ వసూలు చేయబోమని కంపెనీ ప్రకటించింది. ఇల్లు, కార్యాలయంలో మొబైల్‌

Most from this category