News


ఏప్రిల్‌లో మరోమారు రేట్‌కట్‌!

Friday 8th February 2019
news_main1549620432.png-24093

గ్లోబల్‌ బ్రోకరేజ్‌ల అంచనా
అనూహ్యంగా ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఈ దఫా సమావేశంలో రేట్‌కట్‌ నిర్ణయం ప్రకటించింది. అందరూ కేవలం ఆర్బీఐ ధృక్పథంలో మాత్రమే మార్పు ఉంటుందని భావిస్తున్న సమయాన అనుకోని విధంగా 25 బీపీఎస్‌ రేట్‌ కట్‌ను ప్రకటించింది. ఈ నిర్ణయం మానిటరీ పాలసీ సైకిల్‌లో రివర్సల్‌కు ఆరంభమని ప్రస్తుతం గ్లోబల్‌ బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. వచ్చే ఏప్రిల్‌ సమావేశంలో ఆర్‌బీఐ మరోమారు రేట్లను తగ్గించవచ్చని అంచనా వేశాయి. అయితే తాజా రేట్‌ కట్‌ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని, విత్తసంస్థలు రేట్ల తగ్గింపును అమల్లోకి తీసుకురావడం లేదని తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొన్నాయి. ఆర్‌బీఐ తాజాగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలకు మేలు చేస్తాయని మోర్గాన్‌స్టాన్లీ తెలిపింది. బజాజ్‌ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, శ్రీరామ్‌ట్రాన్స్‌పోర్ట్‌ షేర్లపై పాజిటివ్‌గా ఉన్నట్లు పేర్కొంది. ఇక్రా సైతం ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎన్‌బీఎఫ్‌సీ బారోయింగ్‌కు సంబంధించి ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో పలు విత్త సంస్థలకు మేలని తెలిపింది. గతేడాది ఆర్‌బీఐ తీసుకున్న కాలిబ్రేటెడ్‌ టైటెనింగ్‌ ధృక్పథం అంత పనికివచ్చేదికాదని, అసలెందుకు అలా నిర్ణయించుకుందో అర్ధం కాలేదని ఎడెల్‌వీజ్‌ తెలిపింది. తాజా నిర్ణయానంతరం ఈ ఏడాది మరో 50 బీపీఎస్‌ మేర రేట్ల తగ్గింపు ఉండొచ్చని అంచనా వేసింది. అయితే ఆర్‌బీఐ ఇచ్చిన అవకాశాన్ని విత్తసంస్థలు కస్టమర్లకు అందించకపోవడమే పెద్ద సమస్యని దాదాపు అన్ని బ్రోకరేజ్‌లు అభిప్రాయపడ్డాయి. ఏప్రిల్‌లో రేట్‌కట్‌ అనంతరమైనా కస్టమర్లకు వడ్డీరేట్లు తగ్గవచ్చని అంచనా వేస్తున్నాయి. ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నంతవరకు ఆర్‌బీఐ న్యూట్రల్‌గా ఉంటూనే రెపోను 6 శాతం వద్ద మెయిన్‌టెయిన్‌ చేయవచ్చని హెచ్‌ఎస్‌బీసీ సహా పలు సంస్థలు భావిస్తున్నాయి. 


RBI

You may be interested

నాలుగు షేర్లపై సంస్థాగత ఇన్వెస్టర్లకు తగ్గిన మోజు

Friday 8th February 2019

డిసెంబర్‌ త్రైమాసికంలో ఎఫ్‌ఐఐ, డీఐఐలు నాలుగు షేర్లలో వాటాలను తగ్గించుకున్నాయని ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ నివేదిక తెలిపింది. యస్‌ బ్యాంక్‌, కేపీఐటీ టెక్‌, దీపక్‌ ఫెర్టిలైజర్స్‌, ఇన్ఫీబీమ్‌ ఎవెన్యూ షేర్లలో ఎఫ్‌ఐఐ, డీఐఐలు క్యు2తో పోలిస్తే వాటాలు తగ్గించుకున్నాయి. మరోవైపు ఐసీఐసీఐ లంబార్డ్‌, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎస్‌హెచ్‌ కేల్కర్‌లో సంస్థాగత ఇన్వెస్టర్లు వాటాలను పెంచుకున్నాయని నివేదిక వెల్లడించింది. లార్జ్‌ క్యాప్స్‌లో యస్‌బ్యాంక్‌, యాక్సిస్‌బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

మెటల్‌ షేర్లలో అమ్మకాలు

Friday 8th February 2019

మార్కెట్లో మిడ్‌సెషన్‌ అనంతరం మెటల్‌ షేర్ల పతనం కొనసాగింది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 3శాతం నష్టపోయింది. ఇండెక్స్‌లో మొత్తం 15షేర్లకు గానూ 14 షేర్లు నష్టపోగా, ఒక్క నాల్కో షేరు మాత్రం 1.50శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. క్యూ3 ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ.., సెయిల్‌ షేరు మాత్రం నేటి ట్రేడింగ్‌లో దాదాపు 7శాతం నష్టపోయింది. వేదాంత 5శాతం, వెల్‌స్పాన్‌కార్పోరేషన్‌ 4శాతం, జిందాల్‌ స్టీల్‌,

Most from this category