News


పన్నులతో అదనంగా రూ. 30వేల కోట్ల ఆదాయం

Monday 8th July 2019
news_main1562562437.png-26884

  • సంపన్నులపై పన్నులు చైనా కన్నా తక్కువే
  • రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్‌ భూషణ్ పాండే వెల్లడి

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో చేసిన తాజా పన్ను ప్రతిపాదనలతో ఖజానాకు అదనంగా రూ. 30,000 కోట్ల మేర ఆదాయం సమకూరనుందని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే తెలిపారు. అత్యంత సంపన్నుల ఆదాయాలపై సర్‌చార్జీల విధింపు, పెట్రోల్‌..డీజిల్‌పై అధిక సుంకాలు వడ్డనతో పాటు బంగారం.. విలువైన లోహాలపై పెంచిన కస్టమ్స్ సుంకాల ద్వారా ఈ ఆదాయం లభించనున్నట్లు ఆయన వివరించారు. అయితే, 25 శాతం కార్పొరేట్ ట్యాక్స్‌ పరిధిని రూ. 400 కోట్ల టర్నోవర్‌ ఉన్న కంపెనీలకు కూడా వర్తింపచేయడంతో కొంత మేర ఆదాయాన్ని కోల్పోనున్నట్లు పాండే వివరించారు. డీజిల్‌, పెట్రోల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సయిజ్ సుంకాల పెంపు వల్ల కేంద్రానికి వార్షికంగా రూ. 30,000 కోట్లు వస్తాయి. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నెలలే మిగిలి ఉ‍న్నందున ఈ కాలానికి రూ. 22,000 కోట్ల మేర ఆదాయం లభించవచ్చు. ఇక సూపర్‌ రిచ్‌ ఆదాయాలపై సర్‌చార్జీ పెంపుతో ఖజానాకు అదనంగా రూ. 12,000-13,000 కోట్లు సమకూరే అవకాశం ఉందని అంచనా. అటు పసిడి, విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకాల పెంపుతో రూ. 3,000-4,000 కోట్లు అదనంగా లభించనున్నప్పటికీ.. ఇతరత్రా పలు ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడంతో అక్కడికక్కడ సర్దుబాటు అవుతుందని పాండే తెలిపారు. 

ఆ దేశాల్లో కన్నా తక్కువే...
సంపన్నులపై భారత్‌లో విధిస్తున్న పన్ను రేటు ప్రపంచంలోనే అత్యధికం అంటూ వస్తున్న విమర్శలను పాండే తోసిపుచ్చారు. చైనా, అమెరికా, దక్షిణాఫ్రికాతో పోలిస్తే భారత్‌లో ఇది తక్కువే ఉందని స్పష్టం చేశారు. చైనా.. దక్షిణాఫ్రికాల్లో గరిష్టంగా 45 శాతం, అమెరికాలో 50.3 శాతం పన్ను రేటు ఉందని వివరించారు. 2019-20 బడ్జెట్‌లో రూ. 2-5 కోట్ల ఆదాయం ఉన్నవారి పన్నులపై సర్‌చార్జీని 15 శాతం నుంచి 25 శాతానికి, రూ. 5 కోట్ల పైబడి ఆదాయం ఉన్న వారిపై 15 శాతం నుంచి 37 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. సర్‌చార్జీల పెంపుతో భారత్‌లో గరిష్ట పన్ను రేటు 42.7 శాతానికి చేరింది. 



You may be interested

పీఎన్‌బీకి మరో షాక్‌!!

Monday 8th July 2019

రూ. 3,805 కోట్లు మోసం చేసిన భూషణ్ పవర్‌ అండ్ స్టీల్‌ న్యూఢిల్లీ: నీరవ్ మోదీ ఫ్రాడ్ నుంచి తేరుకునేందుకు నానా తంటాలు పడుతున్న ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ (పీఎన్‌బీ)కి మరో షాక్ తగిలింది. తాజాగా దివాలా తీసిన భూషణ్ పవర్ అండ్ స్టీల్‌ (బీపీఎస్‌ఎల్‌) సంస్థ దాదాపు రూ. 3,805.15 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు పీఎన్‌బీ వెల్లడించింది. ఖాతాల్లో అంకెల గారడీతో బ్యాంకుల కన్సార్షియం నుంచి

స్టాక్స్‌ వ్యూ

Monday 8th July 2019

నెస్లే ఇండియా    కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌ ప్రస్తుత ధర: రూ.11,920 టార్గెట్‌ ధర: రూ.13,000 ఎందుకంటే: ఈ కంపెనీ ఈ ఏడాది జనవరి-మార్చి క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు బాగున్నాయి. నికర అమ్మకాలు 9 శాతం వృద్ధితో రూ.3,003 కోట్లకు పెరిగాయి. వివిధ కేటగిరీల్లో కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తేవడంతో అమ్మకాలు పెరిగాయి. నిర్వహణ లాభం 6 శాతం వృద్ధితో  రూ.738 కోట్లకు పెరిగింది. మార్జిన్లు మాత్రం 71 బేసిస్‌ పాయింట్లు తగ్గి 24.6

Most from this category