News


ఆరోగ్యానికి ఆయుష్షు

Saturday 6th July 2019
news_main1562395783.png-26852

బడ్జెట్‌లో ఆయుష్‌మాన్‌ భారత్‌కు రూ. 6,400 కోట్లు 
హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటుకు నిధులు
జాతీయ ఆరోగ్య మిషన్‌కు గణనీయంగా నిధులు పెంపు
వైద్య విద్యను బలోపేతం చేసే దిశగా కేటాయింపులు
సంప్రదాయ వైద్యానికి 15 శాతం అధిక నిధులు

న్యూఢిల్లీ: గత రెండు బడ్జెట్‌లతో పోల్చితే ఈసారి ఆరోగ్య రంగానికి కేంద్రం నిధులు గణనీయంగా పెంచింది. వైద్య విద్యను బలోపేతం చేసే దిశగా మెడికల్‌ కాలేజీలను నవీకరించేందులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నిధులు కేటాయించారు. ఆరోగ్య రంగానికి కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో రూ. 62,659.12 కోట్లు ప్రతిపాదించారు. 2018-19 బడ్జెట్‌ (సవరించిన అంచనాలతో రూ. 54,302 కోట్లు)తో  పోల్చితే 15.38 శాతం పెంచారు. కేంద్రం కీలకంగా భావిస్తున్న బీమా పథకమైన ఆయుష్‌మాన్‌ భారత్‌-ప్రధాన మంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై)కు రూ. 6,400 కోట్లు కేటాయించారు. జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్‌ కార్యక్రమం కింద పట్టణ ప్రాంతాల్లో ఆయుష్‌మాన్‌ భారత్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్స్‌ నెలకొల్పడానికి రూ. 249.96 కోట్లను కేటాయించారు. ఇక జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ కింద ఆ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రూ. 1,349.97 కోట్లు ప్రతిపాదించారు. ఈ పథకం కింద 2022కల్లా 1.5 లక్షల సబ్‌ సెంటర్లు, పీహెచ్‌సీలను హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రాలుగా మార్చనున్నారు. బీపీ, షుగర్‌, కేన్సర్‌, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులకు వైద్యం అందించే లక్ష్యంతో ఈ కేంద్రాలను నెలకొల్పాలని సంకల్పించారు.  ఇక జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం)కు ఈ బడ్జెట్‌లో రూ. 32,995 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే సుమారు రూ. 2,855 కోట్లు అధికంగా ఇచ్చారు. అయితే ఎన్‌హెచ్‌ఎం కార్యక్రమమైన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్‌ఎస్‌బీవై) పథకానికి భారీగా కోత పెట్టారు. గత ఆర్థిక సంవత్సరం ఇచ్చిన దానిలో ఈ సారి రూ. 1,844 తగ్గించి రూ. 156 కోట్లు మాత్రమే కేటాయించారు. జాతీయ ఎయిడ్స్‌, ఎస్‌టీడీ నియంత్రణ కార్యక్రమానికి గతేడాది కంటే రూ. 400 కోట్లు పెంచి రూ. 2,500 కేటాయించారు. ఇక ఎయిమ్స్‌కు కూడా ఈసారి నిధులు పెంచారు. గత బడ్జెట్‌లో రూ. 3,018 కోట్లు కేటాయిస్తే దానిని ఈ ఏడాది రూ. 3,599.65 కోట్లకు పెంచారు. జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమానికి రూ. 40 కోట్లు, కేన్సర్‌, డయాబెటిస్‌, గుండె జబ్బుల నియంత్రణ కార్యక్రమానికి రూ. 175 కోట్లు కేటాయించారు. కార్పొరేట్‌ ఆస్పత్రులు, పెద్ద ఆస్పత్రుల్లో వైద్యానికి సంబంధించిన టెర్షియరీ కేర్‌ పోగ్రామ్‌లో రూ. 200 కోట్లు కోత పెట్టి రూ. 550 కోట్లు ప్రతిపాదించారు. నర్సింగ్‌ సర్వీసులకు రూ. 64 కోట్లు, ఫార్మసీ స్కూళ్లు, కాలేజీకు రూ. 5 కోట్లు కేటాయించారు. జిల్లా ఆస్పత్రులు, రాష్ట్ర ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు (పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సీట్స్‌) అప్‌గ్రేడ్‌ చేయడానికి రూ. 800 కోట్లు, అలాగే జిల్లా ఆస్పత్రులను కొత్త మెడికల్‌ కాలేజీలుగా మార్చడానికి రూ. 2,000 కోట్లు, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను (అండర్‌ గ్రాడ్యుయేట్‌), కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంస్థలను బలోపేతం చేయడానికి రూ. 1,361 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్రాల్లో పారామెడికల్‌ సైన్సెస్‌ సంస్థలను, కాలేజీలను నెలకొల్పడానికి రూ. 20 కోట్లు ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి కేటాయించారు.  

సం‍ప్రదాయ వైద్యానికి రూ. 1,939.76 కోట్లు...
సంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించే దిశగా మోదీ ప్రభుత్వం ఆయుష్‌ మంత్రిత్వ శాఖకు సుమారు 15 శాతం అధికంగా నిధులిచ్చింది. ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి (ఆయుష్‌) వైద్యానికి సంబంధించి రూ. 1,939.76 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. ఆయుష్‌ నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రూ. 92.31 కోట్లు ప్రతిపాదించారు. ఇక అటానమస్‌ సంస్థలైన సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేద, సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ హోమియోపతి, సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ యునాని వైద్యానికి సంబంధించి వరుసగా.. రూ. 292.31 కోట్లు, రూ. 118.53 కోట్లు, రూ. 152.65 కోట్లు కేటాయించారు. 

 



You may be interested

బడ్జెట్‌పై కంపెనీల రియాక్షన్లు!

Saturday 6th July 2019

ఫార్మాను నిరాశ పరిచింది.. ఆరోగ్య సేవలు, ఔషధ రంగం వృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం నిరాశ పరిచింది. పరిశోధన, అభివృద్ధికి ఊతమిచ్చేలా పన్ను రాయితీలు ఉంటాయని భావించిన పరిశ్రమకు మొండి చేయి ఇచ్చారు. పరిశ్రమ ఆశించినట్టు జరిగితే ఔషధ రంగంలో పరిశోధన, అభివృద్ధితోపాటు ఆవిష్కరణలు మరింత వృద్ధి చెంది ఉండేవి.  - సతీష్‌ రెడ్డి, చైర్మన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌. పన్ను సరళీకరించారు.. స్టార్టప్స్‌కు సరళీకరించిన పన్ను విధానం ప్రోత్సాహకరంగా ఉంది. 25 శాతం కార్పొరేట్‌ ట్యాక్స్‌ పరిధిని

అందరికీ ఇళ్లు అందుబాటే!

Saturday 6th July 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అందరికీ ఇళ్లు దిశగా నరేంద్ర మోదీ 2.ఓ ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. అందుబాటు గృహాలను (అఫడబుల్‌ హౌజింగ్‌) దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌ను రూపొందించారు. అఫడబుల్‌ హౌజింగ్‌లకు అదనపు వడ్డీ రాయితీలు, ప్రభుత్వ స్థలాల కేటాయింపులు, నిర్మాణ గడువు కుదింపు వంటివన్నీ ఈ విభాగాన్ని బలోపేతం చేయనున్నాయి. ఆర్ధికాభివృద్ధిలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి అత్యంత కీలకం. మౌలిక సదుపాయాల అభివృద్ధే ప్రభుత్వ ఎజెండా. దీన్నే ఫోకస్‌ చేస్తూ నిర్మలా

Most from this category