News


కరోనా నుంచి ఊహించని రక్షణ కవచం

Friday 28th February 2020
news_main1582829475.png-32148

కరోనా వైరస్‌ చైనా సహా ఆసియాలోని పలు దేశాలకు నిద్ర లేకుండా చేస్తున్న పరిస్థితులను చూస్తున్నాం. కానీ, మన ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ ప్రభావం పెద్దగా ఉండదని... ఇందుకు ఊహించని రక్షణ కవచమే కారణమని నోమురా ముఖ్య ఆర్థికవేత్త రాబర్ట్‌ సుబ్బురామన్‌ అంటున్నారు. కరోనా వైరస్‌కు ఆసియా ప్రాంతం ఎక్కువగా గురయ్యే అవకాశాలున్నాయన్న ఆయన.. ఆసియాలో అతి తక్కువ ప్రభావిత దేశం భారత్‌ అని స్పష్టం చేశారు. దీనికి కారణం.. ఆసియా దేశాల మధ్యనున్న ఉత్పత్తికి సంబంధించి అధునాతన సరఫరా వ్యవస్థలో భారత్‌ పెద్దగా భాగస్వామ్యం కాకపోవడమేనని రామన్‌ తెలిపారు. ఆసియా దేశాల మధ్యనున్న అతిపెద్ద సరఫరా చైన్‌కు ప్రధాన కేంద్రం చైనాయే.

 

చైనా సరఫరా వ్యవస్థపై ఎక్కువగా ఆధారపడిన దేశాల్లో ఇప్పుడు ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ‘‘చైనాతో సందర్శన పరంగా భారత్‌కు బలమైన రాకపోకలు లేవు. దీంతో ఈ ప్రాంతంలోని ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే ఆర్థిక ప్రతికూలతలు భారత్‌పై ఏమంత తీవ్రంగా ఉండబోవు’’ అని సుబ్బురామన్‌ వివరించారు. అయితే, చైనాలో వైరస్‌ ప్రభావం మన దేశానికి చెందిన కొన్ని రంగాలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. చైనాతో వార్షికంగా మన దేశానికి 30 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య బంధం ఉంది. ఆటోమొబైల్‌ విడిభాగాలు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, కెమికల్స్‌, ఔషధ ముడి సరుకుల కోసం చైనాపై ఆధారపడి ఉన్నాం. అక్కడ ఫ్యాక్టరీలను మూసివేసి ఇప్పటికే నెల రోజులు కావస్తోంది. ఇంకో 15 రోజులకు మించి ఇదే పరిస్థితి కొనసాగితే మన పరిశ్రమలకు కష్టం కాలం మొదలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే భిన్న రంగాలకు చెందిన 200 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమై వారి ఆందోళలను తెలుసుకున్నారు. అవసరమైతే ప్రభుత్వం పరంగా చర్యలను ప్రకటిస్తామని కూడా భరోసా కల్పించారు. అంటే ప్రత్యామ్నాయ సరఫరా మార్గాల దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక రకంగా మన దేశానికి భవిష్యత్తులో చైనాపై మరింత ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించే అవకాశాలను ఇచ్చినట్టయింది.You may be interested

డెట్‌ ఫండ్స్‌లోనూ ఈక్విటీల మాదిరి రిస్క్‌

Friday 28th February 2020

డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న వారు ఇక మీదట అయినా ఎంతో జాగ్రత్తగా అడుగులు వేయాలని ఇటీవలి పరిణామాలు సూచిస్తున్నాయి. ఇటీవలి క్రెడిట్‌ సంక్షోభం మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు, ఇన్వెస్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు లేదా క్రెడిట్‌ ఏజెన్సీలకు ఒక పాఠం వంటిదని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.   ‘‘గడిచిన 18 నెలల్లో చాలా వరకు రుణ ఎగవేతలు వ్యాపారణ కారణాల వల్ల కాకుండా పాలనా నిర్వహణ కారణాలతో జరగడాన్ని చూశాం. మ్యూచువల్‌ ఫండ్స్‌ వీటిని

స్వల్పకాలంలో రాబడులకు ఈ షేర్లు చూడండి !

Thursday 27th February 2020

ప్రపంచ ఈక్వీటీ మార్కెట్లలో కరోనా వైరస్‌ వ్యాధి భయాలకు,  ఫిబ్రవరి ఎఫ్‌అండ్‌ఓ డెరివేటివ్స్‌ కాంటాక్టు ముగింపు నేప‌థ్యంలో ఇన్వెస్టర్ల అప్రమ‌త్తత తోడవ్వడంతో గురువారం బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు ఈ 2020 ఏడాది కనిష్టం దిగువకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సెక్యూరిటీస్‌ సాంకేతిక నిపుణుడు షితిజ్ గాంధీ 3 షేర్లను సిఫార్సు చేస్తున్నారు.  షేరు పేరు: మిండా కార్పోరేషన్‌ రేటింగ్‌: కొనవచ్చు టార్గెట్‌ ధర: రూ.126 స్టాప్‌ లాస్‌: రూ.105 అప్‌సైడ్‌: 9శాతం విశ్లేషణ: ఈ

Most from this category