News


లక్ష కోట్లు దాటిన జీఎస్‌టీ వసూళ్లు

Monday 2nd December 2019
news_main1575256926.png-29989

  • 6 శాతం వృద్ధి 
  • మూడు నెలల తర్వాత లక్ష కోట్లపైకి 


న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు గత నెలలో రూ. లక్ష కోట్లను దాటాయి. జీఎస్‌టీ వసూళ్లు మూడు నెలల తర్వాత లక్ష కోట్ల మార్క్‌ను దాటడం ఇదే. గత ఏడాది నవంబర్‌లో రూ.97,637 కోట్లు, (ఈ ఏడాది అక్టోబర్‌లో రూ.95,380 కోట్లుగా) ఉన్న జీఎస్‌టీ వసూళ్లు ఈ ఏడాది నవంబర్‌లో 6 శాతం వృద్ధితో రూ.1.03 లక్షల కోట్లకు పెరిగాయి. 2017, జూలై నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే మూడో అత్యధిక వసూళ్లు. కాగా ఈ వసూళ్లు లక్ష కోట్ల మార్క్‌ను దాటటం ఇది ఎనిమిదో నెల. అంతకు ముం‍దు రెండు నెలల్లో ప్రతికూల వృద్ధిని నమోదు చేసిన జీఎస్‌టీ వసూళ్లు పండగల డిమాండ్‌ పుణ్యమాని ఈ నవంబర్‌లో పెరిగాయి. వినియోగం పెరగడాన్ని, జీఎస్‌టీ అమలు మెరుగుపడటాన్ని పెరిగిన ఈ వసూళ్లు సూచిస్తున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 

నవంబర్‌లో జీఎస్‌టీ వసూళ్లు ఇలా....
అంశం   వసూళ్లు(రూ.)
సీజీఎస్‌టీ  19,592
ఎస్‌జీఎస్‌టీ 27,144
ఐజీఎస్‌టీ 49,028
సెస్‌ 7,727
మొత్తం 1.03,491

 



You may be interested

కాల్‌ చార్జీలకు రెక్కలు..

Monday 2nd December 2019

50 శాతం దాకా పెంపు  పరిమితి దాటితే ఇతర నెట్‌వర్క్‌లకు  కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చార్జీ 3 నుంచి వొడా-ఐడియా, ఎయిర్‌టెల్‌ ప్లాన్లు అమల్లోకి 6 నుంచి జియో పెంపు అమల్లోకి న్యూఢిల్లీ: చౌక మొబైల్‌ కాల్, డేటా సేవలకిక కాలం చెల్లింది. సుమారు నాలుగేళ్ల తర్వాత.. టెలికం సంస్థలు పోటాపోటీగా రేట్ల పెంపుతో ప్రీ-పెయిడ్‌ వినియోగదారులను బాదేందుకు సిద్ధమయ్యాయి. వొడాఫోన్‌-ఐడియా, ఎయిర్‌టెల్, రిలయన్స్‌ జియో సంస్థలు టారిఫ్‌లను పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించాయి. వొడా-ఐడియా, ఎయిర్‌టెల్‌

మిశ్రమంగా నవంబర్‌ వాహన విక్రయాలు

Monday 2nd December 2019

న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగం మందగమనంలో ప్రయాణిస్తోంది. ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు గతనెల్లో కూడా అంతంత మాత్రంగా నమోదైయ్యాయి. నూతన ఆవిష్కరణలు కొనసాగినా, ఆశించిన స్థాయిలో అమ్మకాలు పుంజుకోలేకపోయాయి. టాటా మోటార్స్‌, హోండా కార్స్‌ విక్రయాల్లో భారీ క్షీణత కొనసాగగా.. మారుతీ సుజుకీ అమ్మకాల్లో స్వల్పంగా 1.6 శాతం తగ్గుదల నమోదైంది. హ్యుందాయ్‌ మాత్రం 2 శాతం వృద్ధిని నమోదుచేసింది. ఈ సారి కూడా క్షీణత ఉన్నప్పటికీ.. అంతక్రితం నెలలతో

Most from this category