News


‘ఇ’ వాహనాలపై పన్ను..12% నుంచి 5% నికి

Saturday 27th July 2019
Markets_main1564213976.png-27359

  • జీఎస్టీ రేటును తగ్గించిన జీఎస్టీ మండలీ 

ఎలక్ట్రిక్‌ వాహనాల(ఈవీ)పై జీఎస్‌టీ రేటును  12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని జీఎస్‌టీ కౌన్సిల్‌ శనివారం నిర్ణయించింది. అంతేకాకుండా ఎలక్ట్రిక్‌ల వాహనాల చార్జర్లపై ఉన్న 18 శాతం జీఎస్‌టీ రేటు 5 శాతానికి తగ్గించింది. ఇవి 2019 అగష్టు 01 నుంచి అమలులోకి రానున్నాయి. స్థానిక ప్రభుత్వాలు ఎలక్ట్రిక్‌ బస్సులను నియమించుకుంటే వాటిని జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇవ్వడానికి జీఎస్‌టీ కౌన్సిల్‌ ఒప్పుకుంది.  జూలై 5, 2019 న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన బడ్జెట్లో ఎలక్ట్రిక్‌ వాహన పరిశ్రమపై పన్ను మినహాయింపులను, ప్రోత్సాహకాలను స్వాగతించిన విషయం తెలిసిందే. ఆర్థిక మంత్రి అధ్యక్షతన  వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ సమావేశం జరిగింది. ఈవీపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తామని, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు తీసుకున్న రుణాల వడ్డీపై ప్రభుత్వం రూ.1.5 లక్షల అదనపు ఆదాయపు పన్ను మినహాయింపును ఇస్తామని ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రకటించారు. ఈ మార్పులు వలన  ఎలక్ట్రిక్‌ వాహన రంగం పుంజుకుంటుందని, డిమాండ్‌ పెరుగుతుందని మహీంద్రా అండ్‌ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ కె గోయెంకా ఓ ఆంగ్ల చానెల్‌కు చెప్పారు. ఈ ప్రతిపాదనల ప్రభావం వలన ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.60 కోట్లు మాత్రమే నష్టపోనుంది.

 



You may be interested

స్వల్ప నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 27th July 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం స్వల్ప నష్టంతో ముగిసింది. రాత్రి సింగపూర్‌ మార్కెట్లో 11,314.00 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ ఫ్యూచర్‌ ముగింపు(11327)తో పోలిస్తే 13 పాయింట్ల నష్టంతో ఉందనే విషయాన్ని గమనించాలి. జాతీయ, అం‍తర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం ఫ్లాట్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ వాతావారణం నెలకొంది. వారాంతాన్ని ఆసియా మార్కెట్లు నష్టాలతో యూరప్‌, అమెరికా

టాప్‌ కంపెనీల క్యూ1 ఫలితాల విశ్లేషణ

Saturday 27th July 2019

త్రైమాసిక ఫలితాల సీజన్‌లో ఉన్నాం. కొన్ని కంపెనీల ఫలితాలు మార్కెట్లను ఆశ్చర్య పరచగా, మరికొన్ని నిరాశపరిచాయి. ఇప్పటి వరకు వెలువడిన టాప్‌ కంపెనీల ఫలితాలు...  హిందూస్తాన్ యూనిలీవర్: మెరుగైన వాల్యూమ్ వృద్ధి, క్యూ 1లో 14.8 శాతం పెరిగిన లాభం.  ఎఫ్‌ఎంసిజి సెక్టార్‌లో హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యుఎల్) మెరుగైన వాల్యూమ్ వృద్ధిని నమోదుచేసింది. ఫలితంగా తన స్టాండ్‌ఎలోన్‌ లాభం 14.8 శాతం పెరిగి రూ.1,755 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలానికి ఈ లాభం

Most from this category