News


డిసెంబర్‌లో తగ్గిన జీఎస్టీ వసూళ్లు

Wednesday 2nd January 2019
news_main1546411217.png-23365

- రూ. 94,726 కోట్లకు పరిమితం
- నవంబర్‌లో రూ. 97,637 కోట్లు

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) వసూళ్లు 2018 డిసెంబర్‌లో రూ.94,726 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం నెల నవంబర్‌లో నమోదైన రూ. 97,637 కోట్లతో పోలిస్తే వసూళ్లు కొంత తగ్గాయి. 2018 డిసెంబర్ 30 నాటి దాకా మొత్తం 72.44 లక్షల సేల్స్ రిటర్న్‌లు (జీఎస్‌టీఆర్‌-3బీ) దాఖలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు- సెప్టెంబర్ మధ్యకాలంలో రాష్ట్రాలకు రూ.11,922 కోట్లు విడుదల చేసినట్లు వివరించింది. డిసెంబర్‌లో వసూలైన రూ.94,726 కోట్లలో సెంట్రల్ జీఎస్‌టీ (సీజీఎస్‌టీ) పరిమా౾ణం రూ.16,442 కోట్లు కాగా, స్టేట్ జీఎస్‌టీ (ఎస్‌జీఎస్‌టీ) రూ.22,459 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ (ఐజీఎస్‌టీ) రూ.47,936 కోట్లు, సెస్సు రూ. 7,888 కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. డిసెంబర్‌లో వసూళ్లు తగ్గిన నేపథ్యంలో 28 శాతం కేటగిరీలో ఉన్న సిమెంటు, ఆటో విడిభాగాలు మొదలైన ఉత్పత్తులపై పన్ను రేటును తగ్గించాలన్న నిర్ణయాన్ని కేంద్రం స్వల్పకాలికంగా పక్కన పెట్టొచ్చని కన్సల్టెన్సీ సంస్థ ఈవై ట్యాక్స్ పార్ట్‌నర్ అభిషేక్ జైన్ అభిప్రాయపడ్డారు.
9 నెలల్లో రూ.8.71 లక్షల కోట్లు..
2018-19 బడ్జెట్లో కేంద్రం వార్షికంగా జీఎస్‌టీ వసూళ్లు రూ.13.48 లక్షల కోట్లు ఉండవచ్చని అంచనా వేసింది. అంటే.. నెలకు సుమారు రూ. 1.12 లక్షల కోట్లు నిర్దేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో (2017 జూలై-2018 మార్చి మధ్య కాలంలో) సగటు నెలవారీ జీఎస్‌టీ వసూళ్లు రూ.89,885 కోట్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో (ఏప్రిల్‌-డిసెంబర్‌) పరిశీలిస్తే..  జీఎస్‌టీ వసూళ్లు రూ.8.71 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్‌, అక్టోబర్‌లో మాత్రమే ఇవి రూ.1 లక్ష కోట్లు దాటాయి. ఏప్రిల్‌లో రూ.1.03 లక్షల కోట్లు కాగా, మే లో రూ.94,016 కోట్లు, జూన్‌లో రూ.95,610 కోట్లు, జూలైలో రూ.96,483 కోట్లు, ఆగస్టులో రూ.93,960 కోట్లు, సెప్టెంబర్‌లో రూ. 94,442 కోట్లు, అక్టోబర్‌లో రూ.1,00,710 కోట్లు, నవంబర్‌లో రూ.97,637 కోట్లు వసూలయ్యాయి.
ఆదాయంలో కోత..
జనవరి 1 నుంచి 23 ఉత్పత్తులపై పన్ను రేటు తగ్గించాలని జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయించిన నేపథ్యంలో రాబోయే నెలల్లో జీఎస్‌టీ ఆదాయాల్లో కోత పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తాజా రేట్ల కోతతో.. గరిష్ట శ్లాబ్‌ అయిన 28 శాతం కేటగిరీలో 28 ఉత్పత్తులు మాత్రమే మిగిలాయి. రేట్ల కోత కారణంగా వార్షికంగా రూ.5,500 కోట్ల మేర ఆదాయానికి గండిపడనుంది. ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన వ్యవధిలో (జనవరి-మార్చి) ఆదాయ నష్టం దాదాపు రూ.1,375 కోట్లు ఉండొచ్చని అంచనా.



You may be interested

వాహన విక్రయాలు తగ్గాయి!

Wednesday 2nd January 2019

 డిసెంబరు అమ్మకాల్లో నెమ్మదించిన వృద్ధి - ఆకట్టుకోలేకపోయిన భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు - లిక్విడిటీ కొరత వంటి అంశాలే ప్రధాన కారణం! న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ వాహన విక్రయాలు 2018 డిసెంబర్లో నెమ్మదించాయి. సంవత్సరాంతపు ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు ఎన్ని ప్రకటించినా... వాహనాల విక్రయాలు మాత్రం అనుకున్న స్థాయిలో వృద్ధి చెందలేదు. జనవరిలో ధరలు కూడా పెరుగుతుండటం ఇక్కడ గమనార్హం. కాగా లిక్విడిటీ (నగదు లభ్యత) కొరత వంటి ప్రతికూల స్థూల ఆర్థిక పరిస్థితుల వల్ల

దోమ కుట్టకుండా.. రూ.6వేల కోట్లు!!

Wednesday 2nd January 2019

- మార్కెట్లోకి కొత్త నివారణ ఉత్పత్తులు - ఐదు కంపెనీల పోటాపోటీ - 80 శాతం వాటా ఈ సంస్థలదే హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఇళ్లలో దోమల నివారణకు ఏటా దేశవ్యాప్తంగా జనం పెడుతున్న ఖర్చెంతో తెలుసా? అక్షరాలా ఆరువేల కోట్ల రూపాయలు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. జనాన్ని దోమలు ఎంతలా భయపెడుతున్నాయో చెప్పటానికి ఈ అంకెలు చూస్తే చాలు. అయితే ఇదంతా ఇళ్లలో దోమల నివారణ ఉత్పత్తుల కోసం జనం

Most from this category