News


మళ్లీ రూ. 1 లక్ష కోట్లు దాటిన జీఎస్‌టీ వసూళ్లు

Thursday 2nd January 2020
news_main1577935006.png-30598

  • డిసెంబర్‌లో రూ. 1.03 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: వినియోగం పుంజుకుంటోందనడానికి నిదర్శనంగా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో నెలలో రూ. 1 లక్ష కోట్ల మైలురాయిని దాటాయి. డిసెంబర్‌లో రూ. 1,03,184 కోట్ల మేర జీఎస్‌టీ వసూళ్లు నమోదయ్యాయి. అంతక్రితం నవంబర్ నెలలో ఈ వసూళ్లు రూ. 1,03,492 కోట్లు. గతేడాది జూలైలో రూ. 1.02 లక్షల కోట్లు నమోదు కాగా, 2018 డిసెంబర్‌లో రూ. 94,726 కోట్లు వసూలయ్యాయి.  నిబంధనలను పాటించే విధానం, వినియోగం మెరుగుపడుతున్నాయనడానికి తాజా గణాంకాలు నిదర్శనమని అధికార వర్గాలు తెలిపాయి. 2018 డిసెంబర్‌తో పోలిస్తే గతేడాది డిసెంబర్‌లో దేశీయంగా లావాదేవీలపై జీఎస్‌టీ వసూళ్లు 16 శాతం వృద్ధి నమోదు చేశాయి. డిసెంబర్‌లో వసూలైన రూ. 1,03,184 కోట్లలో .. సీజీఎస్‌టీ భాగం రూ. 19,962 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ. 26,792 కోట్లు, ఐజీఎస్‌టీ రూ. 48,099 కోట్లు, సెస్సు రూ. 8,331 కోట్లుగా ఉన్నాయి. ద్రవ్య లోటు కట్టడిలో ఉండాలంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగతా నెలల్లో కూడా ఇదే తరహాలో వసూళ్లు కొనసాగాల్సి ఉంటుందని డెలాయిట్ ఇండియా పార్ట్‌నర్ ఎంఎస్ మణి అభిప్రాయపడ్డారు. వార్షిక లక్ష్యం స్థాయిని అందుకోలేకపోయినా.. ఇక నుంచి వసూళ్లు స్థిరంగా మెరుగుపడవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగతా కాలంలో ప్రతి నెలా రూ. 1 లక్ష కోట్ల జీఎస్‌టీ వసూళ్ల లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది.



You may be interested

వచ్చేసింది .. జియోమార్ట్‌..

Thursday 2nd January 2020

ఆన్‌లైన్‌ కిరాణా వ్యాపారంలోకి రిలయన్స్ ప్రాథమికంగా ముంబైలో కార్యకలాపాలు షురూ త్వరలో దేశవ్యాప్తంగా విస్తరణ ఈ-కామర్స్ దిగ్గజాలతో ఢీ .. ముంబై: చమురు నుంచి టెలికం దాకా వివిధ వ్యాపార విభాగాల్లోకి విస్తరించిన దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్‌) తాజాగా ఆన్‌లైన్ కిరాణా వ్యాపార విభాగంలోకి కూడా ప్రవేశించింది. జియోమార్ట్ పేరిట ఈ-కామర్స్ వెంచర్‌ను ప్రారంభించింది. ప్రాథమికంగా ముంబైలోని నవీ-ముంబై, థానే, కల్యాణ్‌ ప్రాంతాల్లో ప్రారంభించిన కార్యకలాపాలను త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనుంది. ఆఫ్‌లైన్‌-టు-ఆన్‌లైన్ వ్యాపారం

ఇవి దృష్టిలో పెట్టుకోండి..

Wednesday 1st January 2020

నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారు ఎంతో అవగాహన కలిగి, రిస్క్‌ నిర్వహణ విధానాలను అనుసరిస్తూ, జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారానే లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్నేహితులతో, బంధువులో సూచించారని, షేరు ధర బాగా పెరుగుతుందన్న ఆకర్షణతో లేదా షేరు ధర గరిష్ట స్థాయి నుంచి బాగా పడిపోయింది కదా చౌకగా లభిస్తుందనో.. ఈ తరహా అంచనాల ఆధారంగా ఇన్వెస్ట్‌ చేయడం మంచి విధానమేమీ కాదు. ముఖ్యంగా రిటైల్‌ ఇన్వెస్టర్లు

Most from this category