News


ఫిబ్రవరిలో రూ.1.05 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్లు

Monday 2nd March 2020
news_main1583122537.png-32202

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) రూపంలో ఫిబ్రవరి నెలలో రూ.1,05,366 కోట్ల ఆదాయం సమకూరింది. క్రితం ఏడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే 8 శాతం పెరిగింది. అంతేకాదు, ఆర్థిక మందగమన పరిస్థితుల్లో జీఎస్‌టీ ఆదాయం రూ.లక్ష కోట్ల పైనే కొనసాగడం సానుకూలతను తెలియజేస్తోంది. అయితే, ఈ ఏడాది జనవరి నెలలో వసూలైన రూ.1.10 లక్షల కోట్లతో పోలిస్తే మాత్రం స్వల్పంగా తగ్గింది. సెంట్రల్‌ జీఎస్‌టీ రూ.20,569 కోట్లు, స్టేట్‌ జీఎస్‌టీ 27,348 కోట్లు, ఇంటెగ్రేటెడ్‌ జీఎస్‌టీ రూ.48,504 కోట్లు, సెస్సు రూ.8,947 కోట్ల మేర ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది. రెగ్యులర్‌ సెటిల్‌మెంట్‌ అనంతరం ఫిబ్రవరి నెలకు సంబంధించి కేంద్రం రూ43,155 కోట్లు పొందగా, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.43,901 కోట్లు పొందినట్టు తెలిపింది. 



You may be interested

ఎస్కార్ట్స్‌, అఫ్లే ఇండియా హైజంప్‌

Monday 2nd March 2020

ఎస్కార్ట్స్‌ షేరుకి ట్రాక్టర్‌ అమ్మకాల దన్ను అఫ్లేపై మెడిస్మార్ట్‌ మొబైల్‌ కొనుగోలు ఎఫెక్ట్‌ కరోనా వైరస్‌ సునామీలా విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా కుప్పకూలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగడం, ఇన్వెస్టర్లు ఎంపిక చేసిన కౌంటర్లలో కొనుగోళ్లు చేపట్టడం వంటి అంశాలు మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఉదయం 9.45 ప్రాంతంలో సెన్సెక్స్‌ 525 పాయింట్లు జంప్‌చేసి 38,822కు చేరగా.. నిఫ్టీ 156 పాయింట్లు పురోగమించి 11,358

పీఎఫ్‌పై 8.65 శాతం వడ్డీ రేటు కొనసాగింపు!!

Monday 2nd March 2020

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో ప్రావిడెంట్ ఫండ్‌ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ రేటునే కొనసాగించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 5న జరిగే ట్రస్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2018-19లో కూడా ఇదే రేటు ఉంది. ‍అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో దీన్ని 8.5 శాతానికి తగ్గించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. పోస్టాఫీస్ పొదుపు పథకాలు,

Most from this category