News


జీఎస్‌టీ వసూళ్లూ డౌన్‌

Wednesday 2nd October 2019
news_main1569989319.png-28664

  •  సెప్టెంబర్‌లో రూ.91,916 కోట్లు
  • 2018 ఇదే నెల్లో రూ.98,202 కోట్లు

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు సెప్టెంబర్‌లో పెరక్కపోగా క్షీణతను నమోదుచేసుకున్నాయి. ఆగస్టుతో పోల్చితే ఈ మొత్తం రూ.98,202 కోట్ల నుంచి రూ.91,916 కోట్లకు తగ్గినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి.  2018 సెప్టెంబర్‌తో పోల్చి చూసినా, తాజా సమీక్షా నెల్లో వసూళ్లు తగ్గడం గమనార్హం. అప్పట్లో ఆ మొత్తం రూ.94,442 కోట్లు. అంటే వార్షికంగా 2.67 శాతం తగ్గిందన్నమాట. జీఎస్‌టీ వసూళ్లు పెరక్కపోగా క్షీణతలోకి జారడం ఇది వరుసగా రెండవనెల.   మొత్తం వసూళ్లను విభాగాలుగా చూస్తే...
- సీజీఎస్‌టీ ఆదాయం: రూ. 16,630 కోట్లు
- ఎస్‌జీఎస్‌టీ ఆదాయం : రూ.22,598 కోట్లు
- ఐజీఎస్‌టీ ఆదాయం : రూ.45,069 కోట్లు (దిగుమతులపై వసూలయిన రూ.22,097 కోట్లుసహా)
- కాంపన్‌సేషన్‌ సెస్‌ : రూ.7,620 కోట్లు (దిగుమతులపై వసూళ్లయిన రూ.728 కోట్లు సహా)
- సెప్టెంబర్‌ 30వ తేదీ వరకూ చూస్తే, దాఖలైన జీఎస్‌టీఆర్‌ 3బీ రిటర్న్స్‌ (సమ్మరీ ఆఫ్‌ సెల్ఫ్‌ అసిస్డ్‌ రిటర్న్‌) సంఖ్య 75.94 లక్షలు.  
- తాజా పరిస్థితిని పరిశీలిస్తే, 2019-20లో ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- ద్రవ్యలోటు స్థూల దేశీయో‍త్పత్తిలో 3.3 శాతానికి కట్టడి చేయడం కష్టమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం మొత్తంమీద (మార్చి వరకూ) ద్రవ్యలోటు రూ.7.03 లక్షల కోట్లకు ‍కట్టడి చేయాలని 2019-20 బడ్జెట్‌ నిర్దేశించుకుంటే, ఆగస్టు  ముగిసే నాటికే 5,53,840 కోట్లకు (78 శాతానికి) చేరింది. 
- పండుగల సీజన్‌ కావడంతో అక్టోబర్‌లో జీఎస్‌టీ వసూళ్లు పుంజుకుంటాయని కొన్ని వర్గాలు అంచనావేస్తున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపోరేటు కోత, డిమాండ్‌ పుంజుకోడానికి కేంద్రం తీసుకుంటున్న ప్రోత్సాహక చర్యలు ఇందుకు మద్దతునిస్తాయని అంచనా.  ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్య జీఎస్‌టీ వసూళ్లు మాత్రం స్వల్ప వృద్ధితో రూ.5.78 లక్షల కోట్ల నుంచి రూ.6.06 లక్షల కోట్లకు పెరగడం​గమనార్హం. 



You may be interested

రివర్స్‌ గేర్‌లో అటో విక్రయాలు

Wednesday 2nd October 2019

సెప్టెంబర్‌లో భారీ క్షీణత సగానికి తగ్గిన దిగ్గజ కంపెనీల అమ్మకాలు టాటా మోటార్స్‌ అమ్మకాల్లో 50 శాతం తగ్గుదల న్యూఢిల్లీ: వాహన విక్రయాలు ఈసారి భారీ తగ్గుదలను నమోదుచేశాయి. సెప్టెంబర్‌లో రెండంకెల క్షీణత నమోదైంది. టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ వంటి దిగ్గజ కంపెనీల అమ్మకాలు గతనెల్లో ఏకంగా సగానికి పైగా తగ్గిపోయాయి. అమ్మకాల డేటాను చూసి.. ఈ రంగంలోని మార్కెట్‌ లీడర్లు సైతం కంగుతింటోన్న పరిస్థితి నెలకొంది. ప్యాసింజర్‌ వాహన(పీవీ) విక్రయాల్లో దిగ్గజ

సెప్టెంబర్‌లో స్మాల్‌క్యాప్‌ అదరహో!

Tuesday 1st October 2019

గత నెలలో స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ మంచి ర్యాలీ చేశాయనే చెప్పుకోవాలి. స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ భారీగా దిద్దుబాటుకు గురై ఉండడంతో వీటిల్లో వ్యాల్యూ బయింగ్‌కు ఇన్వెస్టర్లు, ఇనిస్టిట్యూషన్స్‌ మొగ్గు చూపడం వాటిల్లో కొంత రికవరీకి తోడ్పడింది. దీనికితోడు ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేట్‌ పన్ను తగ్గింపు కూడా వాటి ర్యాలీకి దోహదం చేసింది. అయితే, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ పట్ల ఇన్వెస్టర్లు ఇప్పటికీ అప్రమత్తంగా ఉండాలని, స్టాక్‌ వారీగా జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు

Most from this category