News


జూన్‌లో తగ్గిన జీఎస్‌టీ వసూళ్లు

Tuesday 2nd July 2019
news_main1562053086.png-26738

  • రూ.99,939 కోట్లకు పరిమితం
  • అంతక్రితం మాసంలో రూ.లక్ష కోట్లు

న్యూఢిల్లీ: జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల మార్కుపైన స్థిరంగా కొనసాగడం లేదు. మే నెలలో స్థూల జీఎస్‌టీ వసూళ్లు రూ.1,00,289 కోట్లు వసూలు కాగా, జూన్‌లో రూ.99,939 కోట్లకు తగ్గాయి. దీంతో అంతకుముందు మూడు నెలల పాటు నమోదైన రూ.లక్ష కోట్ల మార్క్‌కు బ్రేక్‌ పడింది. అయితే, 2018 జూన్‌ నెలలో ఉన్న రూ.95,610 కోట్లతో పోలిస్తే 4.5 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ‘‘జూన్‌లో రూ.99,939 కోట్ల వసూళ్లలో... సెంట్రల్‌ జీఎస్‌టీ (సీజీఎస్‌టీ) రూ.18,336 కోట్లు, స్టేట్‌ జీఎస్‌టీ (ఎస్‌జీఎస్‌టీ) రూ.25,343 కోట్లు, ఇంటెగ్రేటెడ్‌ జీఎస్‌టీ (ఐజీఎస్‌టీ) రూ.47,772 కోట్లు, సెస్సు రూ.8,457 కోట్లు’’గా ఉన్నట్టు ప్రభుత్వ ప్రకటన తెలియజేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీఎస్‌టీ వసూళ్ల లక్ష్యాన్ని చేరుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు తెలిపారు. ఏదైనా ఒక నెలలో వసూళ్లు తగ్గినప్పటికీ, పూర్తి ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి నిర్ణీత లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సీజీఎస్‌టీ రూపంలో రూ.6.10 లక్షల కోట్లు, కాంపెన్సేషన్‌ సెస్సు రూ.1.01 లక్షల కోట్ల మేర వసూలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. 
నకిలీ ఇన్‌వాయిస్‌లపై కఠిన చర్యలు
జీఎస్‌టీ ఎగవేసేందుకు నకిలీ ఇన్‌వాయిస్‌లు జారీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వం వసూళ్లను నష్టపోకుండా, నిజాయతీ పరుమలైన పన్ను చెల్లింపుదారులు ఇబ్బంది  పడకుండా చూడడం కోసం నకిలీ ఇన్‌వాయిస్‌లకు చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు.



You may be interested

చార్టర్డ్‌ అకౌంటెంట్లు, వైద్యులకు ప్రధాని ప్రశంసలు

Tuesday 2nd July 2019

న్యూఢిల్లీ: సమాజంలో నిజాయితీ సంస్కృతికి పాటుపడుతున్న చార్టర్డ్‌ అకౌంటెంట్ల సేవలను ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. చార్టర్డ్‌ అకౌంటెంట్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ‘‘చార్టర్డ్‌ అకౌంటెంట్ల కష్టపడి పనిచేసే స్వభావం సమాజంలో నిజాయితీ సంస్కృతి, మెగురైన కార్పొరేట్‌ గవర్నెన్స్‌ను ముందుకు తీసుకెళుతుంది’’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆర్థిక సౌభాగ్యం ఫరిడవిల్లే విషయంలోనూ చార్టర్డ్‌ అకౌంటెంట్ల పాత్రను ఆయన మెచ్చుకున్నారు. ఇక వైద్యుల దినోత్సవం సందర్భంగా  సమాజాన్ని

గూగుల్‌పై విచారణకు సీసీఐ ఆదేశం

Tuesday 2nd July 2019

న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ మొబైల్ ప్లాట్‌ఫాంపై పోటీ సంస్థలను అణగదొక్కేసే విధానాలకు పాల్పడుతోందంటూ టెక్ దిగ్గజం గూగుల్‌ మీద ఆరోపణలపై విచారణకు కాంపిటీషన్‌ కమిషన్ (సీసీఐ)ఆదేశించింది. 150 రోజుల్లోగా నివేదిక సమర్పించాలంటూ డైరెక్టర్ జనరల్ (డీజీ)కి సూచించింది. ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లలో తన సొంత యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకునేలా తయారీ సంస్థలతో గూగుల్ ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. దీనివల్ల వాటికి పోటీ యాప్స్‌కు మార్కెట్లో స్థానం దొరకడం లేదంటూ వాటి తయారీ

Most from this category