News


వృద్ధి కోసం అవసరమైతే మరిన్ని చర్యలు

Saturday 15th February 2020
news_main1581738989.png-31815

కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ న్యూఢిల్లీ: బడ్జెట్‌లో చేసిన ప్రకటనలకు అదనంగా... వృద్ధి కోసం అవసరమనుకుంటే మరిన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ‘బడ్జెట్‌, దానికి వెలుపల’ అనే అంశంపై శుక్రవారం ఢిల్లీలో అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌, వెల్త్‌ అడ్వైజరీ, పన్ను నిపుణులతో జరిగిన చర్చా కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ‘‘బడ్జెట్‌ 2020కు వెలుపల మరింత చేయాల్సి ఉంటే చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’’ అని మంత్రి స్పష్టం చేశారు. దేశ ఆర్థిక రంగ కార్యకలాపాలు పుంజుకునేందుకు గాను తీసుకోవాల్సిన చర్యలపై ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిపుణులు మంత్రికి సూచించారు. వినియోగం పెంచేందుకు వినియోగదారుల చేతికి మరింత నగదు అందేలా చర్యలు తీసుకోవాలని, నగదు లభ్యత పెంచేలా చూడాలని వారు కోరారు. బడ్జెట్‌లో పన్ను వివాదాల పరిష్కారానికి ‘వివద్‌ సే విశ్వాస్‌’ పథకాన్ని ప్రకటించగా, దీనికి సంబంధించి కూడా పలు సూచనలు వచ్చాయి. ఈ బిల్లు ఇంకా పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉందని, ఈ పథకానికి సంబంధించి వివరాలు అందిస్తామని మంత్రి తెలిపారు. పాన్‌ జారీ ప్రక్రియను మరింత సులభతరం చేస్తామని చెప్పారు. ఇదే విధమైన సమావేశాలను ముంబై, చెన్నై, కోల్‌కతాలోనూ కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే నిర్వహించింది. నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌, సీఈవో అమితాబ్‌ కాంత్‌, కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. 



You may be interested

సెయిల్‌ నష్టాలు రూ.344 కోట్లు

Saturday 15th February 2020

తగ్గిన ఉక్కు ధరల ప్రభావం  పెరిగిన అమ్మకాలు  క్యూ4 ఫలితాలపై కంపెనీ ఆశాభావం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు కంపెనీ, సెయిల్‌కు ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో రూ.344 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. వ్యయాలు పెరగడం, ఉక్కు ఉత్పత్తుల ధరలు తగ్గడంతో ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని సెయిల్‌ చైర్మన్‌ అనిల్‌ కుమార్‌ చౌధురి చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం (2019-18) ఇదే క్వార్టర్‌లో రూ.638 కోట్ల నికర లాభం

హైదరాబాద్‌లో అమెరికన్‌ ఐస్‌క్రీమ్‌ ‘కోల్డ్‌ స్టోన్‌’

Saturday 15th February 2020

350 కోట్లతో టేబ్లెజ్‌ విస్తరణ ప్రణాళికలు టేబ్లెజ్‌ ఎండీ అదీబ్‌ అహ్మద్‌ వెల్లడి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అమెరికన్‌ ఐస్‌క్రీమ్‌ బ్రాండ్‌ కోల్డ్‌ స్టోన్‌ క్రీమరీ హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అబుదాబి కేంద్రంగా ఉన్న లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌కు చెందిన రిటైల్‌ విభాగం ‘టేబ్లెజ్‌’ దీన్ని ప్రారంభించింది. శుక్రవారమిక్కడ బంజారాహిల్స్, బేగంపేటలో రెండు ఔట్‌లెట్లను టేబ్లెజ్‌ ఎండీ అదీబ్‌ అహ్మద్‌ ప్రారంభించారు. ఈ ఏడాది మే ముగిసే నాటికి మరో మూడు స్టోర్లను

Most from this category