News


మార్చి చివరికి పీఎస్‌యూ బీమా కంపెనీల విలీనం

Thursday 6th February 2020
news_main1580962771.png-31549

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని సాధారణ బీమా సంస్థలు.. నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల విలీనాన్ని మార్చి చివరికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖా కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ వెల్లడించారు. ఈ మూడు కంపెనీల బోర్డులు విలీనానికి ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలియజేసినట్టు తెలిపారు. ‘‘విలీనం పురోగతి దశలో ఉంది. త్వరలోనే ఇది సాకారం కావడాన్ని చూస్తాం. ఇప్పటికే ఇది కేబినెట్‌ ముందుకు వెళ్లింది’’ అని రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. విలీనానంతర సంస్థ లిస్టింగ్‌ విషయమై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. విలీనాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు గాను ప్రభుత్వం మూడు సాధారణ బీమా సంస్థలకు రూ.6,950 కోట్ల నిధులను బడ్జెట్లో కేటాయించడం గమనార్హం. దీంతో ఈ సంస్థలు కనీన సాల్వెన్సీ రేషియో సాధించడం వీలవుతుంది. 



You may be interested

స్వల్పంగా తగ్గిన పసిడి

Thursday 6th February 2020

అధిక ధరల నేపథ్యంలో దేశీ జువెలర్లు, కొనుగోలు దారుల నుంచి డిమాండ్‌ తగ్గుతుండడంతో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. గురువారం ఎంసీఎక్స్‌లో నిన్నటి ధరలతో పోలిస్తే రూ.40 తగ్గి 10 గ్రాముల పసిడి ధర 40,098.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది, రూపాయి రికవరీ బలపడడం, చైనా వడ్డీ రేట్ల తగ్గింపు ప్రభావం పసిడిపై పడడంతో అంతర్జాతీయ మార్కెట్‌లోను బంగారం ధర తగ్గింది. నిన్నటితో పోలిస్తే 6 డాలర్లు తగ్గి 1,558

పెట్టుబడుల ఉపసంహరణకు ముందే ఆస్తుల విక్రయం

Thursday 6th February 2020

న్యూఢిల్లీ: పెట్టుబడుల ఉపసంహరణకు ముందే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించి మిగులు భూములు ఏవైనా ఉంటే మార్కెట్‌ రేటుకు ఆయా రాష్ట్రాలు లేదా ప్రయివేటు పార్టీలకు విక్రయించనున్నట్టు కేంద్రం బుధవారం స్పష్టం చేసింది. పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని పారదర్శకంగా నిర్వహిస్తామని రాజ్యసభలో ఓ సభ్యుని ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. హెచ్‌పీసీఎల్‌, ఆర్‌ఈసీ సహా 28 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర

Most from this category