News


ఉల్లి ఎగుమతుల ప్రోత్సాహకాలు రద్దు

Wednesday 12th June 2019
news_main1560316814.png-26237

  • దేశియ మార్కెట్‌లో ఉల్లి ధరను తగ్గించేందుకు ప్రభుత్వ చర్యలు
  • మందగించిన ఉల్లి ఉత్పత్తి..
  • ఉల్లిని ప్రధానంగా సాగు చేసే రాష్ట్రాలలో కరువు పరిస్థితులే కారణం

సాక్షి: దేశియ మార్కెట్‌లో పెరుగుతున్న ఉల్లి ధరలను తగ్గించేందుకు కేంద్రం చర్యలను చేపట్టింది. ఉల్లి ఎగుమతులకు ఇస్తున్నా ప్రోత్సాహకాలను  ఉపసంహరించుకుంది. మెయిస్‌(మర్చండీస్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రమ్‌ ఇండియా) కింద ఎగుమతులను ప్రోత్సహించేందుకు 10 శాతం వరకు ప్రోత్సహకాలను ప్రభుత్వం ఇచ్చేది. ఉల్లి ఎగుమతులకు ఇస్తున్నా ప్రయోజనాలను ఉపసంహరించుకుంటున్నామని వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ది డైరక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ ఫారిన్‌ ట్రేడ్‌(డీజీఎఫ్‌టీ) తెలిపింది. ‘ ఉల్లి ఎగుమతులకు మెయిస్‌ అందిస్తున్నా ప్రయోజనాలను 10శాతం నుంచి 0 శాతానికి తగ్గిస్తున్నాం. ఇది వెంటనే అమలులోకి వచ్చేందుకు చర్యలు చేపట్టాం’ అని వివరించింది.  రైతులకు లాభాలను అందించేందుక గత ఏడాది డిసెంబర్‌లో ఉల్లి పై ఉన్న ఎగుమతుల పోత్సాహకాలను ప్రభుత్వం 5 నుంచి 10 శాతానికి పెంచింది. జూన్‌ 30 తర్వాత ఈ కొత్త విధానం అమలవుతుంది. ప్రభుత్వం మెయిస్‌ ద్వారా ఉత్పత్తులు, ఎగుమతి చేసే దేశాలు ఆధారంగా పోత్సాహకాలను అందిస్తుంది. 
బఫర్‌ స్టాక్‌ ఏర్పాటు కోసమే..
ఈ ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం 50,000 టన్నుల బఫర్‌ స్టాక్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఉల్లిని ప్రధానంగా ఉత్పత్తి చేస్తున్నా రాష్ట్రాలలో కరువు పరిస్థితులను అంచనా వేసి రాబోయే నెలలో ఉల్లి ధరను కంట్రోల్‌లో పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్‌ అయిన మహారాష్ట్రాలోని లసల్‌గాన్‌లో కేజీ ఉల్లి ధర కిందటి నెల రూ.9 తో పోల్చుకుంటే 48శాతం పెరిగి నేడు రూ.13.30 వద్ద లభ్యమవుతోంది. వీటి ధర ఢిల్లిలో రూ.2025 గా ఉంది. మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ వంటి ఉల్లిని ప్రధానంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో కరువు పరిస్థితుల వలన ఉత్పత్తి మందగించింది. 201718 సంవత్సరంలో 23.26మిలియన్‌ టన్నుల ఉత్పత్తి జరగగా, 201819 జూన్‌ వరకు 23.62 మిలియన్‌ టన్నులుగా అంచనా ఉంది. భారత ఎగుమతలలో ఉల్లి వాటా ఈ ఏడాది తగ్గింది. 201617లో 511.52 మిలియన్‌ల యూఎస్‌ డాలర్లున్న ఈ ఎగుమతుల విలువ 201819 నాటికి 496.76 మిలియన్‌ల యూఎస్‌ డాలర్లకు తగ్గింది.    



You may be interested

ధరలో సగం సుంకాలే.. ఇది దారుణం !

Wednesday 12th June 2019

భారత్‌పై మరోసారి విరుచుకపడ్డ ట్రంప్‌  సుంకాలను పూర్తిగా తొలగించాల్సిందే  ఇక భారత్‌తో వాణిజ్య యుద్ధం !  వాషింగ్టన్‌: అమెరికా నుంచి భారత్‌కు దిగుమతవుతున్న హార్లే డేవిడ్సన్‌ బైక్‌లపై భారత్‌ భారీగా సుంకాలు విధిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ మరోసారి విరుచుకుపడ్డారు. గతంలో ఈ సుంకం వంద శాతంగా ఉండగా, నరేంద్ర మోదీ దీనిని 50 శాతానికి తగ్గించారు. అయినా సంతృప్తి చెందని ట్రంప్‌ బైక్‌ ధరలో దాదాపు సగం సుంకాలే ఉన్నాయని, ఇది

పన్ను విధానాల్ని సరళం చేయాలి

Wednesday 12th June 2019

ఆర్థికమంత్రికి పారిశ్రామికుల ‘బడ్జెట్‌’ సూచనలు కార్పొరేట్‌ పన్నులు తగ్గించాలని అభ్యర్థన మౌలిక రంగంలో పెట్టుబడులు పెంపునకు వినతి న్యూఢిల్లీ:  కేంద్రంలో కొత్తగా కొలువుతీరిన నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) పూర్తి స్థాయి బడ్జెట్‌ను జూలై 5వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో మంగళవారం పారిశ్రామిక రంగం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు కీలక బడ్జెట్‌ సూచనలు చేసింది. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, పన్ను విధానాలను మరింత సరళతరం చేయడం, మౌలిక రంగంలో

Most from this category