మీ దగ్గర ఎంత బంగారం వుందో చెప్పాల్సిందే!
By Sakshi

త్వరలో కేంద్రం హుకుం మీ దగ్గర బంగారం ఎంతవుందో తెలుసుకోవడానికి, లెక్కల్లో ప్రకటించని బంగారాన్ని చట్టబద్ధం చేయడానికి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ పథకానికి రూపకల్పన చేస్తోందని, ఈ పథకానికి సంబంధించి విధివిదానాలను ప్రభుత్వం తొందరలో ప్రకటించనుందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. పరిమితికి మించిన బంగారం కలిగివుంటే ఈ పథకం ద్వారా వెల్లడించి, దానిపై పన్నులను చెల్లిస్తే సరిపోతుందని అన్నారు. ‘ఈ పథకంలో ఎంత బంగారం కలిగివుండాలనేదానిపై ప్రభుత్వం పరిమితిని విధిస్తుంది. ఒకవేళ పరిమితికి మించి లెక్కల్లో చూపని బంగారం కలిగి వుంటే అధిక జరిమానాలను ఎదుర్కోవలసి ఉంటుంది’ అని ఈ అధికారులు తెలిపారు. లెక్కల్లో చూపని పరిమితికి మించిన బంగారంపై ఎంత ట్యాక్స్ రేటును విధించాలనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదని, కానీ ప్రభుత్వం 2014-16 మధ్య కాలంలో నల్లధనం వెల్లడిపై ప్రకటించిన ‘క్షమాబిక్ష’ పథకాల మాదిరిగానే ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు అన్నారు. ప్రభుత్వ అనుమతి పొందిన బంగారాన్ని విలువ కట్టే నిపుణులు (వాల్యూయర్స్), ఈ బంగారం విలువను నిర్ధారిస్తారని అన్నారు. కాగా కొంత మొత్తంలోపు వివాహిత మహిళల బంగారు ఆభరణాలను, ఈ పథకం నుంచి మినహాయించనున్నట్లు ఈ అధికారులు తెలిపారు. ఈ పరిమితులు ఎంతమేరకు వుంటాయన్న అంశం ఇంకా స్పష్టంకాలేదు.
బంగారం బోర్డు...
ఇండియా ప్రతి ఏడాది 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీనికోసం ఏకంగా రూ. 2.5 లక్షల కోట్ల విదేశి మారకద్రవ్యాన్ని ఖర్చుపెట్టవలసి వస్తోంది. బంగారం దిగుమతుల కోసం అధిక మొత్తంలో ఖర్చుపెడుతున్నప్పటికి, ఈ బంగారం లాకర్లలో, ఇళ్లలో ఉత్పాదకత అందించని ఆస్తిగా మిగిలిపోతుంది. ఈ పథకం ద్వారా పరిమితికి మించిన బంగారంపై పన్నును వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకాన్ని కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర రెవెన్యూ శాఖ కలిసి రుపొందించనున్నారని పరిశీలకులు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన ప్రతినిధులతో ఒక ‘గోల్డ్ బోర్డు’ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, బంగారం కొనుగోలుదారులను ఆకర్షించే విధంగా, గోల్డ్ హోల్డింగ్స్‌ను ఆర్థిక ఆస్తులుగా మార్చే విధంగా ఈ పథకానికి కొన్ని సర్దుపాటు ప్రతిపాదనలను ఈ బోర్డు చేయనుందని అధికారులు తెలిపారు. కాగా ఇండియాలో హిందుదేవాలయాలలో అధిక మొత్తంలో బంగారం నిల్వలు ఉన్న విషయం తెలిసిందే.
You may be interested
40000పైన ముగిసిన సెన్సెక్స్
Wednesday 30th October 201957 పాయింట్లు పెరిగిన నిఫ్టీ నాలుగోరోజూ లాభాలే రాణించిన ప్రభుత్వరంగ బ్యాంక్, ఐటీ షేర్లు పన్ను తగ్గింపు అశావహ అంచనాలతో మార్కెట్లో మరోసారి బుల్స్ సందడి చేశాయి. ఫలితంగా సూచీలు వరుసగా రోజూ లాభాలతో ముగిశాయి. ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు, ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్ల ర్యాలీతో సెన్సెక్స్ 220.03పాయింట్లు లాభపడి 4నెలల అనంతరం మొదటిసారిగా 40000 మార్కుపైన 40,051 స్థిరపడింది. నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 11850 సమీపంలో 11,844 వద్ద ముగిసింది. సూచీల్లో అధిక
వెలుగులో టెలికాం షేర్లు
Wednesday 30th October 2019టెలికాంకు బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్రం కమిటీని వేసేందుకు దృష్టి సారిస్తుందన్న వార్తలు వెలుగులోకి రావడంతో బుధవారం ట్రేడింగ్‌లో టెలికాం షేర్లు రివకరీ బాట పట్టాయి. గతవారంలో టెల్కోల నుంచి రూ.92,000 కోట్ల వసూలు చేసుకునేందుకు సుప్రీంకోర్టు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్‌కు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్ర, మంగళవారాల సెషన్స్ టెలికాం రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. సర్వీస్ ప్రోవైడర్లు ఎదుర్కోంటున్న ఆర్థిక ఒత్తిళ్లను అన్ని కోణాల్లో