News


పావు శాతం దిగొచ్చిన రుణ రేట్లు

Friday 11th October 2019
news_main1570766765.png-28818

-ఆర్‌బీఐ తాజా రేట్ల తగ్గింపుతో సానుకూలత
న్యూఢిల్లీ: గత నెలలో ఆర్‌బీఐ కీలక రేట్లకు మరో విడత కోత పెట్టిన తర్వాత నుంచి సుమారు అరడజను ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రుణాలపై రేట్లను పావు శాతం వరకు తగ్గించాయి. దీంతో గృహ, ఆటో, ఇతర రుణాలు చౌకగా మారాయి. ఆర్‌బీఐ పాలసీ రేట్లకు అనుగుణంగానే .. రిటైల్‌ విభాగం, ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చే రుణాలపై రేట్లను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్టు, రెపో ఆధారిత రుణ రేటు నవంబర్‌ 1 నుంచి 8 శాతంగా ఉంటుందని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు ప్రకటించింది. బ్యాంకు ఆఫ్‌ ఇండియా సైతం ఓవర్‌నైట్‌ ఎంసీఎల్‌ఆర్‌ను 15 బేసిస్‌ పాయింట్లు(0.15శాతం), ఏడాది కాల ఎంసీఎల్‌ఆర్‌ను 5 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 10 నుంచే వీటిని అమల్లోకి తీసుకొచ్చింది. బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర అయితే వివిధ కాల పరిమితుల రుణాలపై రేట్లను 10 బేసిస్‌ పాయింట్ల వరకు తగ్గించింది. దీంతో ఏడాది కాల ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.40 శాతానికి దిగొచ్చింది. రెపో ఆధారిత రుణ రేటును పావు శాతం తగ్గించి 8.45 శాతం నుంచి 8.20 శాతానికి తగ్గించింది. సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా రేపో ఆధారిత రుణ రేటును పావు శాతం తగ్గిస్తున్నట్టు, అక్టోబర్‌ 10 నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దీంతో సెంట్రల్‌ బ్యాంకు గృహ రుణాలపై వడ్డీ రేటు 8 శాతానికి తగ్గగా, ఎంఎస్‌ఈ రుణ రేట్లు 8.95-9.50 శాతానికి తగ్గాయి. ఓరియంటల్‌ బ్యాంకు ఆఫ్‌ కామర్స్‌ సైతం ఏడాది కాల ఎంసీఎల్‌ఆర్‌ రేటును 8.4 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గించింది. You may be interested

కియా తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ ప్రారంభం

Friday 11th October 2019

- బీట్ 360 పేరుతో గురుగ్రామ్‌లో ఏర్పాటు - సెప్టెంబర్‌ దేశీ అమ్మకాలు 7,554 యూనిట్లు గురుగ్రామ్‌: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌.. తాజాగా తన తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. ‘బీట్ 360’ పేరుతో 5,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ, సీఈఓ కూక్‌ హున్‌ షిమ్‌ మాట్లాడుతూ.. ‘కియా భవిష్యత్‌ వ్యూహాలను ఈ సెంటర్‌ వివరిస్తుంది. భారత్‌లో

లాభాల్లో మెటల్‌ షేర్లు

Friday 11th October 2019

చైనా, అమెరికా మధ్య ట్రేడ్‌వార్‌ పాజిటివ్‌గా ముగుస్తుందన్న అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా మెటల్‌ షేర్లు పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో దేశీయ మెటల్‌ షేర్లు కూడా లాభాల్లో ఆరంభమయ్యాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ దాదాపు ఒక్క శాతం లాభంతో 2300 పాయింట్ల వద్ద ఆరంభమై 2320 పాయింట్లను చేరి క్రమంగా 2 శాతం పైగా లాభపడి 2336 పాయింట్లను తాకింది. 9.30 నిమిషాలు దాటేసరికి దాదాపు 3 శాతం లాభంతో

Most from this category