News


మౌలికానికి రూ. 100 లక్షల కోట్ల పెట్టుబడులు: ప్రధాని

Thursday 15th August 2019
news_main1565850785.png-27771

 వచ్చే ఐదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని 5 లక్షల కోట్ల డాలర్లకు పెంచడానికి సహాయపడే ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం రూ. 100 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గురువారం ప్రసంగంలో అన్నారు. 73 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ఢిల్లీలోని ఎర్రకోట ప్రాకారాల నుంచి దేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 'ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ర్యాంకింగ్‌లో,  భారత్ టాప్ 50 దేశాలలో చోటు సంపాదించాడానికి ఉపయోగపడే సంస్కరణలు కొనసాగుతాయని అన్నారు. ‘ఐదేళ్ళలో భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని దాదాపు 5 లక్షల కోట్ల డాలర్లకు పెంచడమంటే కొంతమందికి కష్టంగా అనిపించవచ్చు. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ 70 ఏళ్ల పాలనలో 2 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగానే మారితే, గత ఐదేళ్ళ బీజేపీ పాలనలో లక్ష కోట్ల డాలర్లను అదనంగా జోడించామని, దీనితో పోల్చుకుంటే ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్లకు పెంచడం అసాధ్యం కాదు’ అని అన్నారు.
    స్థిరమైన రాజకీయ వాతవరణంతో పాటు ఊహించదగిన పాలసీలతో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ‘దేశం ఈ అవకాశాన్ని కోల్పోకూడదు’ అని వివరించారు. అంతేకాకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ తమ ప్రభుత్వం అధిక వృద్ధిని సాధించిందని తెలిపారు. వృద్ధి ప్రక్రియకు సహాయపడటానికి, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్‌టీ), దివాలా, దివాలా కోడ్ (ఐబీసీ) వంటి సంస్కరణలను తీసుకొచ్చామని, ఆధునిక ఓడరేవులు, రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఆసుపత్రులు, విద్యా సంస్థల నిర్మాణానికి ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు.  విధానాలలో పక్షవాతం చూపే యుగం ముగిసిందని, తమ ప్రభుత్వం విధాన ఆధారిత పాలనను అందిస్తోందని, అందుకే ప్రపంచ బ్యాంక్‌ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో, 190 దేశాలలో 142 వ స్థానం నుంచి మెరుగు పడిందని అన్నారు. కాగా ప్రపంచ బ్యాంకు 2014 ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్‌లో భారత దేశం 190 దేశాలలో 142 స్థానంలో ఉండగా, ఈ ఏడాది నాటికి 77 వ స్థానానికి మెరుగుపడడం గమనార్హం.
   ‘ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయి, దేశంలో కంపెనీల వ్యాపారాలు సులభతరం చేయడానికి విధానాలు మరింత సులభతరం అవుతాయి. ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని 5 లక్షల కోట్ల డాలర్లకు పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి’ అని అన్నారు. టాప్ 50 దేశాలలోకి ప్రవేశించడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు. 2014 లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు 190 దేశాలలో భారతదేశం 142 వ స్థానంలో ఉంది. నాలుగు సంవత్సరాల సంస్కరణలతో, ప్రపంచ బ్యాంకు ' ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్' 2018 నివేదికలో భారత ర్యాంకు 100 వ స్థానానికి మెరుగుపడింది.  2017 లో ఇండియా ర్యాంక్‌(130వ స్థానం),  ఇరాన్, ఉగాండా కంటే దిగువన ఉండడం గమనార్హం.
   ప్రపంచ బ్యాంక్‌ తన వార్షిక 'ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్' 2019 నివేదికలో భారత్ 77 వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా, సింగపూర్, డెన్మార్క్, హాంకాంగ్ తరువాతి స్థానాలలో ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ 8 వ స్థానంలో, చైనా 46 వ స్థానంలో ఉంది. పొరుగున ఉన్న పాకిస్తాన్ 136 వ స్థానానికి పరిమితమయ్యింది. గత రెండేళ్లలో భారత్‌ ర్యాంకింగ్‌ 53 స్థానాలు, 2014 నుంచి నాలుగేళ్లలో 65 స్థానాలను మెరుగుపరుచుకోవడం గమనార్హం. వ్యాపారాన్ని ప్రారంభించడం, నిర్మాణ అనుమతులు, విద్యుత్తు, రుణాలు పొందడం, పన్నులు చెల్లించడం, సరిహద్దుల్లో వ్యాపారం, ఒప్పందాలను అమలు చేయడం, దివాలా వంటి 10 పారామితుల ఆధారంగా ప్రపంచ బ్యాంకు 190 దేశాలలో ర్యాంకిలను ఇస్తున్న విషయం తెలిసిందే.You may be interested

హైదరాబాద్‌ రియల్టీలోకి 10,100 కోట్ల పెట్టుబడులు

Thursday 15th August 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు హైదరాబాద్‌ అభివృద్ధికి చోదకశక్తిగా మారింది. 2015లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2019 తొలి ఆర్ధ సంవత్సరం వరకూ  హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం 10,100 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. 2008–14 మధ్యకాలంలో ఇది రూ.1,800 కోట్లుగా ఉందని జోన్స్‌ లాంగ్‌ లాసెల్లె (జేఎల్‌ఎల్‌) తెలిపింది. ఇందులోనూ 70 శాతం పెట్టుబడులు కార్యాలయాల విభాగమే ఆకర్షించిందని పేర్కొంది. బుధవారమిక్కడ జేఎల్‌ఎల్‌

నేడు మార్కెట్లకు సెలవు.

Thursday 15th August 2019

స్వాతంత్ర దినోత్సవ సందర్భం‍గా గురువారం మార్కెట్లకు సెలవు దినం. అందుచేత బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయవు. అలాగే ఫారెక్స్‌, కమోడిటీ ఎక్సేంజ్‌లు కూడా నేడు సెలవు. స్టాక్‌ మార్కెట్‌ తిరిగి యథావిధిగా శుక్రవారం (16న) ప్రారంభమవుతుంది. చైనా వస్తువులపై దిగుమతి సుంకాల విధింపును అమెరికా వాయిదా వేయడంతో పాటు దేశీయ ఆర్థిక గణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదు కావడంతో ఆర్‌బీఐ మరోసారి వడ్డీరేట్ల తగ్గింపునుకు మొగ్గుచూపవచ్చనే అంచనాలతో కొనుగోళ్లు పెరగడంతో బుధవారం

Most from this category