News


ఎన్‌బీఎఫ్‌సీ మొండి ఆస్తుల కొనుగోలు భాద్యత ఆర్‌బీఐకి?!

Thursday 28th November 2019
news_main1574934089.png-29931

ప్రభుత్వ యోచన
ఎన్‌బీఎఫ్‌సీల వద్ద పేరుకుపోయిన మొండిపద్దులకు సంబంధించిన ఆస్తులను ఆర్‌బీఐ కొనుగోలు చేయాలని ప్రభుత్వం కోరుతున్నట్లు తెలిసింది. దేశంలో టాప్‌ 25 షాడో బ్యాంకులు(ఎన్‌బీఎఫ్‌సీలు) వద్ద ఉన్న ఒత్తిడిలో ఉన్న ఆస్తులు కొనేందుకు ఆర్‌బీఐ ఒక ఫండ్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో పాటు బ్యాంకులు కొన్ని రియల్టీ లోన్లను మొండిపద్దులుగా పరిగణించి వన్‌టైమ్‌ మాఫీ చేసేందుకు అనుమతించాలని కూడా ప్రభుత్వం కోరినట్లు తెలిపారు. అయితే ఇలాంటి ఒత్తిడితో కూడిన ఆస్తులను కొనేందుకు తాను నిధులు వెచ్చించలేనని ఆర్‌బీఐ గట్టిగా చెప్పినట్లు తెలిసింది. ఎన్‌బీఎఫ్‌సీల గుదిబండలను తాను తగిలించుకోలేనంటూ ప్రభుత్వ ప్రతిపాదనను ఆర్‌బీఐ వ్యతిరేకించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ప్రభుత్వం తన ప్రయత్నం మానుకోలేదని, ఆర్‌బీఐకి నచ్చజెప్పే యత్నాలు చేస్తోందని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. 

యూఎస్‌లో జరిగినట్లే..
2008 సంక్షోభ సమయంలో యూఎస్‌ ప్రభుత్వం ఇలాగే ట్రబుల్‌ అసెట్‌ రిలీఫ్‌ ప్రోగ్రామ్‌ చేపట్టింది. దీన్ని టీఏఆర్‌పీ అంటారు. ఇందులో ఆర్థిక సంస్థలకు లేమాన్‌ సంక్షోభంతో ఎదురైన  ఒత్తిళ్లను తొలగించారు. ప్రస్తుత ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభ సమయంలో ఇలాంటిచర్యలు ఎకానమీని ఆదుకుంటాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఒక ఎస్‌పీవీ ఏర్పాటుచేసి ఒత్తిడిలో ఉన్న ఆస్తులను ఆర్‌బీఐ నిధులతో కొనుగోలు చేయించాలని భావిస్తోంది. ఈ ప్రక్రియ ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో నెలకొన్న ఒత్తిడిని తొలగిస్తుందని ప్రభుత్వం నమ్ముతోంది. ఈ వార్తల నేపథ్యంలో గురువారం ఎన్‌బీఎఫ్‌సీల షేర్లు ర్యాలీ జరిపాయి. రియల్టీ, విత్తరంగాలు పునరుజ్జీవం సాధించకుండా ఎకానమీలో పునరుజ్జీవం రాదని నీతి ఆయోగ్‌ సైతం అభిప్రాయపడింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎలాగైనా ఆర్‌బీఐని ఒప్పించేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే పీఎస్‌బీలతో ఎన్‌బీఎఫ్‌సీ అసెట్స్‌ కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ప్రభుత్వ ఆలోచనపై ఎకనమిస్టులు నెగిటివ్‌గా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆర్‌బీఐ నిధులను బడ్జెటరీ అవసరాలకు వాడుకుందని, ఇంకా మరిన్ని నిధులు వాడుకోవడం ఇబ్బందులు తెస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వమో, బ్యాంకులో ఎన్‌బీఎఫ్‌సీ ఇబ్బందులు తీర్చాలి కానీ నేరుగా ఆర్‌బీఐని ఇరికించడం మంచిది కాదని అశ్విన్‌ పరేఖ్‌ అడ్వైజరీ అభిప్రాయపడింది. 


RBI

You may be interested

రికార్డు ర్యాలీతో నవంబర్‌ సిరీస్‌ ముగింపు

Thursday 28th November 2019

  ఇంట్రాడేలో కొత్త గరిష్టాలను నమోదు చేసిన సూచీలు 12150 పైన ముగిసిన నిఫ్టీ సూచీలు నవంబర్‌ డెరివేటివ్‌ సీరీస్‌ను గురువారం రికార్డు ర్యాలీతో ముగించాయి. ప్రతీనెలా చివరి గురువారం ఆ నెల డెరివేటివ్‌ కాంట్రాక్టులకు ముగింపు రోజు. కాగా ఈ రోజు బ్యాంకింగ్‌, మెటల్‌, ఐటీ షేర్ల ర్యాలీతో వరుసగా రెండోరోజూ లాభాలతో ముగిశాయి. ఇంట్రాడేలో కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేయడంతో పాటు రెండోరోజూ కొత్త రికార్డుస్థాయిలోనే ముగియడం విశేషం.సెన్సెక్స్‌ 109 పాయింట్లు

ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ 18శాతం అప్‌

Thursday 28th November 2019

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు గురువారం మిడ్‌సెషన్‌ సమయానికి 18శాతం వరకు లాభపడింది. నేడు ఈ కంపెనీ షేరు రూ.274.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభమైంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ షేరు కొనుగోలుకు ఇన్వెసర్లు ఆసక్తి కనబరచడంతో మిడ్‌సెషన్‌ కల్లా 18శాతం లాభపడి రూ.316.40 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్న గం.2:20నిల.కు షేరు క్రితం ముగింపు(రూ.268.10)తో పోలిస్తే 12.50శాతం లాభంతో రూ.301.65 వద్ద ట్రేడింగ్‌ వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Most from this category