STOCKS

News


ఆర్థిక చర్యలుంటాయి.. కానీ జీఎస్టీ రేటు తగ్గదు

Sunday 11th August 2019
news_main1565533772.png-27690

వ్యవస్థలో ఉత్పాదక రంగాలకు, నిధుల లభ్యతను సులభతరం చేయడానికి ఉన్న అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కానీ జీఎస్‌టీ రేట్లను మాత్రం తగ్గించే అవకాశం లేదని పరిశీలకులు తెలిపారు. గతంతో పోల్చుకుంటే పన్నులు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం భావించడమే దీనికి కారణమని అన్నారు. ‘ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వివిధ బ్యాంకర్లు, విదేశీ, దేశీయ ఇన్వెస్టర్లతో పాటు, వివిధ వాటాదారులతో పరస్పర చర్చలు జరిపి  ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా బ్యాంకింగ్, ఎంఎస్‌ఎంఈ(మైక్రో,స్మాల్‌, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌), వాహన రంగాలతో పాటు వివిధ రంగాల ప్రతినిధులతో జరుగుతున్న సమావేశాలలో, వ్యవస్థలో కొనసాగుతున్న కొన్ని సమస్యలపై ఆమె దృష్ఠిసారించారు’ అని వివరించారు. 

జీఎస్టీ వసూళ్లు పెరిగాయి..
  ‘వృద్ధి వేగాన్ని పెంచే ఉద్దేశ్యంతో పరిశ్రమల సాధారణ సమస్యలను తొలగించేందుకు త్వరలో చర్యలు తీసుకుంటాం’ అని అని ఒక సీనియర్‌ అధికారి తెలిపారు. రుణ లభ్యత, రుణాలు తీసుకోడానికి తక్కువ వ్యయం, వృద్ధిని పెంచే కొన్ని విధానాలను సులభతరం చేయడం వంటి అంశాలపై పరిశ్రమ వర్గాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాయని ఆయన వివరించారు. ‘ప్రభుత్వం  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను 7 శాతంగా నిర్దేశించింది. దీనికి అనుగుణంగానే మొదటి త్రైమాసికంలో డేటా పాయింట్లు ఉన్నాయి’ అని తెలిపారు. కాగా ఎన్నికల సమయం అయినప్పటికి ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీఎస్టీ సేకరణ 9 శాతం వృద్ధి చెందింది. పత్యక్ష పన్నులు 12.9 శాతం పెరిగాయి. ఈ త్రైమాసికంలో కార్పొరేట్ పన్ను వసూళ్లు 13.3 శాతం వృద్ధితో స్థిరంగా ఉన్నాయి. పారిశ్రామిక కార్యకలాపాలు మందగించినప్పటికీ, ఈ త్రైమాసికంలో జీఎస్టీ ఆదాయ సేకరణ సగటు మోప్-అప్ రూ .1 లక్ష కోట్లకు పైగా ఉంది. జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్ నెలలో రూ .1.13 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది జూలై 1, 2017 తర్వాత అత్యధిక పరోక్ష పన్నుల సేకరణ కావడం గమనర్హం. జులై నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ .1.02 లక్షల కోట్లుగా ఉన్నాయి. కాగా ఇది గత ఏడాది ఇదే త్రైమాసికం కంటే స్వల్పంగా వృద్ధి చెందింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకో ఆరు నెలలకు పైగా సమయం ఉన్నందున జీఎస్టీ వసూళ్ల మెరుగుదలకు ఇంకా చాలా అవకాశం ఉందని పరిశీలకులు తెలిపారు.

   పన్ను ప్రక్రియను సులభతరంగా చేయడంతో పాటు అంచనా వేసే విధంగా మార్చడంతో పన్ను సేకరణ సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చని విశ్లేషకులు తెలిపారు. ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతుండటంతో బడ్జెట్‌లో నిర్దేశించిన వృద్ధి లక్ష్యాలను సాధించడం కష్టమేమీ కాదని వివరించారు. ఈ జూన్‌ త్రైమాసికంలో జీఎస్టీ సేకరణ కొంచెం తగ్గినప్పటికీ, అంతగా ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితియార్థంలో, ఏప్రిల్-జూన్ కాలంలో కనిపించిన మందగమనం కంటే ఆర్థిక వ్యవస్థ మెరుగు పడుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కాగా ఆటో రంగంపై ఉన్న జీఎస్టీ రేటును తగ్గించాలని ఈ రంగం ప్రతినిధులు కోరినప్పటికి గతం కంటే తక్కువ పన్నులే ఉన్నాయని ప్రభుత్వం అభిప్రాయపడింది. సోషల్‌ సెక్టార్‌ అవసరాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉండడంతో పన్ను రేటును మరింత తగ్గించడానికి ఎటువంటి అవకాశాలు లేవని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆటో రంగంలో అమ్మకాలు తగ్గడానికి ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత జీఎస్టీ రేటు కంటే ఆటో రంగ కంపెనీలు అనుసరిస్తున్న విధానాలే కారణమని  వివరించారు.You may be interested

మార్కెట్‌ విలువను పెంచిన 7 కంపెనీలు

Sunday 11th August 2019

అత్యంత విలువైన 10 భారతీయ కంపెనీలలో,  ఏడు కంపెనీలు కలిపి గత వారం మార్కెట్ వాల్యుయేషన్‌కు రూ .87,965.88 కోట్లును జోడించాయి. మార్కెట్‌ విలువను పెంచిన టాప్‌ కంపెనీలలో హెచ్‌యుఎల్(హిందుస్థాన్‌ యూనిలీవర్‌), హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్‌ అగ్రస్థానంలో ఉండగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్‌), హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాతి స్థానాలలో ఉన్నాయి. కానీ ఆర్‌ఐఎల్‌(రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌), ఐటీసీ, ఎస్‌బీఐ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌

ఇంకా అమ్మకాల మోడ్‌లో ఎఫ్‌పీఐలు?

Sunday 11th August 2019

దేశియ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశి పోర్టుపోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) ఔట్‌ ఫ్లో అగష్టు నెలలో కూడా భారీగా కొనసాగుతోంది. ఈ ఏడాది అగష్టు 1 నుంచి 9 వ తేదిల మధ్య, నికరంగా రూ.9,197 కోట్ల విదేశి పెట్టుబడుల ఉపసంహరణ జరిగిందని డిపాజిటరీలు విడుదల చేసిన సమాచారం తెలుపుతోంది. కాగా విదేశి ఫోర్టుపోలియో ఇన్వెస్టర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తే ఈ ధోరణి మారవచ్చని విశ్లేషకులు తెలిపారు. దేశియ అంతర్జాతీయ కారణాల

Most from this category