News


ఎలక్ట్రిక్‌ వాహనాలపై కస్టమ్స్‌ డ్యూటీ పెంపు

Sunday 2nd February 2020
news_main1580627834.png-31446

దేశీయంగా విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే చర్యలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. దేశీయంగానే వీటి తయారీకి ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది. దేశీయంగా తయారీని ప్రోత్సహించే విధానంలో భాగంగా దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్‌ వాహనాలపై కస్టమ్స్‌ డ్యూటీ పెంపును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. మొబైల్‌ విడిభాగాలపైనా కస్టమ్స్‌ సుంకాన్ని సవరిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. పూర్తిగా నిర్మితమై (సీబీయూ) దేశంలోకి దిగుమతి అయ్యే వాణిజ్య విద్యుత్‌ వాహనాలపై 2020 ఏప్రిల్‌ 1 నుంచి కస్టమ్స్‌ డ్యూటీ ప్రస్తుతమున్న 25 శాతం స్థానంలో 40 శాతం అమలవుతుందని మంత్రి తెలిపారు. విదేశాల్లోనే కొంత వరకు నిర్మాణం పూర్తి చేసుకుని (ఎస్‌కేడీ) దిగుమతి అయ్యే ప్యాసింజర్‌ విద్యుత్‌ వాహనాలపై సుంకం 15 నుంచి 30 శాతానికి పెరుగుతుందని ప్రకటించారు. అలాగే, ఎస్‌కేడీ రూపంలోని ఎలక్ట్రిక్‌ బస్సులు, ద్విచక్ర వాహనాల దిగుమతులపై సుంకం 15 శాతం నుంచి 25 శాతానికి పెరుగుతుందని తెలిపారు. ఎస్‌కేడీ తరహా ఎలక్ట్రిక్‌ బస్సులు, ట్రక్కులు, ద్విచక్ర వాహనాలపై సుంకం 15 శాతం నుంచి 25 శాతానికి చేరుతుందని మంత్రి వెల్లడించారు. సీకేడీ తరహా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలు, త్రిచక్ర వాహనాలు, ద్విచక్ర వాహనాలు, బస్సులు, ట్రక్కులపైనా దిగుమతి సుంకం 10 శాతం నుంచి 15 శాతానికి చేరుతుంది. సంప్రదాయ వాణిజ్య వాహనాలను సీబీయూ రూపంలో దిగుమతి చేసుకుంటే సుంకం 30 శాతానికి బదులు 40 శాతం చెల్లించాల్సి వస్తుంది. 



You may be interested

రుణం తీసుకుని ట్రేడ్‌ చేస్తున్నారా..?

Sunday 2nd February 2020

మన చుట్టూ ఉన్న ఇన్వెస్టర్లలో రుణం తీసుకుని ట్రేడ్‌ చేసే వారూ (లెవరేజ్‌) ఉన్నారు. రుణం తీసుకుని స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. మరి రుణం తీసుకుని ఇలా ట్రేడ్‌ చేయడం ఎంతో రిస్క్‌ అన్న మాటలు వినిపిస్తుంటాయి. రుణం తీసుకుని ట్రేడ్‌ చేయడంలో ఉండే రిస్క్‌? ఇందుకు ఏ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలన్నది ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ అడ్వైజర్స్‌ చైర్మన్‌, ఎండీ డీకే అగర్వాల్‌ తెలియజేశారు.   ‘‘లెవరేజ్‌

సంక్షేమ సీతమ్మ!

Sunday 2nd February 2020

స్త్రీ శిశు సంక్షేమాలకు 14 శాతం నిధుల పెంపు గర్భధారణ సగటు వయసు సమీక్షకు టాస్క్‌ఫోర్స్‌ గ్రామీణాభివృద్ధి నిధుల్లో కోత న్యూఢిల్లీ: కేంద్రంలో పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి అవుతున్న వేళ మోదీ ప్రభుత్వం సమాజ సంక్షేమానికి బడ్జెట్లో పెద్ద పీట వేసింది. ఇందులో భాగంగా స్త్రీశిశు సంక్షేమానికి, షెడ్యూల్‌ తెగలు, కులాలు, మైనార్టీల శాఖలకు నిధుల కేటాయింపులు పెరిగాయి. సామాజిక సంక్షేమాన్ని మూడు విభాగాలుగా విభజిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌

Most from this category