News


పెరిగిన ద్రవ్యలోటు లక్ష్యం

Sunday 2nd February 2020
news_main1580618141.png-31428

  • 3.3 శాతం నుంచి 3.8 శాతానికి పెంపు
  • ఆదాయలేమి నేపథ్యం

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- ద్రవ్యలోటు లక్ష్యం పెరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ద్రవ్యలోటు 3.3 శాతంగా ఉండాలన్నది గత బడ్జెట్‌ లక్ష్యం. అయితే ఈ లక్ష్యాన్ని తాజా బడ్జెట్‌ (2020-21) 3.8 శాతానికి పెంచింది. ఆదాయాలు లేకపోవడం దీనికి ప్రధాన కారణం.  2020 మార్చి నాటికి ద్రవ్యలోటు రూ. 7,03,760 కోట్లు ఉండాలన్నది 2019-20 బడ్జెట్‌ లక్ష్యం. . అయితే 2019 డిసెంబర్‌ ముగిసే నాటికే రూ.9,31,725 కోట్లుగా నమోదయ్యింది.  2019 సెప్టెంబర్‌లో కార్పొరేట్‌ పన్ను భారీ తగ్గింపు కేం‍ద్ర ఖజానాపై భారీ ప్రభావం చూపింది. ఆదాయానికి రూ.1.45 లక్షల కోట్ల గండి పడిందని అంచనా.

ఆర్థిక సర్వే చెప్పిందీ ఇదే...
2019-20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటు 3.3 శాతానికి పరిమితం చేస్తామని గత బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి సీతారామన్‌ పేర్కొన్నారు. కానీ, కార్పొరేట్‌ పన్ను కోత, ఇతర పన్నుల వసూళ్లు తక్కువగా ఉండడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ద్రవ్యలోటు లక్ష్యాలను సవరించక తప్పదని నిపుణులు అంచనావేశారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో వృద్ధి రేటు పుంజుకోవడమే లక్ష్యమని శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ఇందుకోసం ద్రవ్యలోటు లక్ష్య సవరణను పరిశీలించొచ్చని సూచించింది. ఒక్క సారి ఆర్థిక వ్యవస్థ వేగాన్ని అందుకున్న తర్వాత ప్రభుత్వం తన ఖర్చులను ‍స్థీరకరించుకోవచ్చని, పలు ఆర్థిక వ్యవస్థలు గతంలో ఇదే మార్గాన్ని అనుసరించారని ప్రస్తావించింది. దీనికి అనుగుణంగానే ద్రవ్యలోటు లక్ష్యం 3.8 శాతానికి పెంచుతూ తాజా బడ్జెట్‌ ప్రతిపాదన ఉండడం గమనార్హం. ఈ విషయంలో ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ (ఎఫ్‌ఆర్‌బీఎం) యాక్ట్‌లోని ‘ఎస్కేప్‌ క్లాజ్’ను ప్రభుత్వం వినియోగించుకుంది.  క్లిష్ట పరిస్థితుల్లో ద్రవ్యలోటు లక్ష్యానికి 0.5 శాతం మేర వెసులుబాటు కల్పించుకోవచ్చని ఈ క్లాజ్‌ సూచిస్తోంది.  అయితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 3.5 శాతానికి తగ్గుతుందని తాజా బడ్జెట్‌ అంచనావేసింది. You may be interested

బడ్జెట్‌ రియల్టీ : అందుబాటు తప్ప.. అందినదేమీ లేదు!

Sunday 2nd February 2020

– రూ.1.5 లక్షల వడ్డీ రాయితీ గడువు మరొక ఏడాది పొడిగింపు – అఫడబుల్‌ డెవలపర్లకు లాభాల మీద పన్నుకు కూడా.. – కొత్త ఎయిర్‌పోర్ట్స్, లాజిస్టిక్‌ పాలసీలతో కమర్షియల్‌ రియల్టీకి డిమాండ్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మళ్లీ పాత పాటే పడింది. జీఎస్‌టీ తగ్గింపు, మౌలిక రంగ హోదా, ఇన్వెంటరీ గృహాలకు పన్ను మినహాయింపు, డెవలపర్స్‌ సబ్‌వెన్షన్, కొనుగోలుదారుల ఫిర్యాదు కోసం రెరా సింగిల్‌ బాడీ ఏర్పాటు వంటి

‘మౌలికం’ కీలకం!   

Sunday 2nd February 2020

- రవాణా రంగంలో మౌలిక సదుపాయాలు, హైవేల అభివృద్ధికి రూ.1.70 లక్షల కోట్లు - పురోగతిలో 6,500 ప్రాజెక్టులు - పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మరిన్ని తేజాస్‌ రైళ్లు - ‘ఉడాన్‌’ ద్వారా 2024 నాటికి వంద ఎయిర్‌పోర్టుల అభివృద్ధి  న్యూఢిల్లీ: దేశ ఆర్థిక అభివృద్ధికి చోదకశక్తి లాంటి మౌలిక వసతుల రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటికే రూ.103 లక్షల కోట్లతో పలు ప్రాజెక్టులను ప్రారంభించిందని, తాజాగా రవాణా రంగంలో మౌలిక వసతులు,

Most from this category