5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు ‘లోకల్’ మంత్ర
By Sakshi

దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని 5 ట్రిలియన్ డాలర్ల స్థాయి (సుమారు రూ.350 లక్షల కోట్లు)కి తీసుకెళ్లాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. ఇందుకు 2024ను లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, తాజాగా జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతానికి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఐదేళ్లలో ఇంత భారీ లక్ష్యాన్ని చేరుకోగలమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక మంత్రాన్ని అచరణలో పెడితే ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చన్న అభిప్రాయం నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. ‘‘బొగ్గు నిల్వలు భారీ స్థాయిలో కలిగిన మూడో అతిపెద్ద దేశం భారత్. కానీ, మనం బొగ్గును దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే, మన దేశీయులు విదేశీ పర్యటనల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు కానీ, దేశీయంగా ఉన్న పర్యాటక ప్రదేశాలను ఎంచుకోవడం లేదు. ‘బి ఇండియన్ బై ఇండియన్(భారతీయులుగా భారత్‌లోనే కొనుగోలు)’ అని ఏ రోజు అయితే భారతీయులు అర్థం చేసుకుంటారో అప్పుడే చాలా వరకు సమస్యలు తీరిపోతాయి’’ అని కోటక్ మహీంద్రా అస్సెట్ మేనేజ్మెంట్ ఎండీ నీలేష్ షా గుర్తు చేశారు. వ్యాపార నిర్వహణ పరంగా భారత ఆర్థిక వ్యవస్థ పరిణామ క్రమంలో ఉందన్నారు అవెండస్ క్యాపిటల్ సహ సీఈవో వైభవ్ సంఘ్వి. ‘‘ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరణ చెందేందుకు ప్రజలకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. సరఫరా వైపు పని చేయడం కాదు. డిమాండ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది’’ అని ఆయన సూచించారు. కార్మిక శక్తి, జీడీపీ మధ్య అసమతుల్యత ఉందన్నారు యాక్సిస్ క్యాపిటల్ జేఎండీ సలీల్ పితాలే. ఎక్కువ మందికి ఉపాధినిచ్చే వ్యవసాయానికి జీడీపీలో తక్కువ చోటు ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. ‘‘సేవలు, పరిశ్రమలు మరింతగా దేశీయంగా చొచ్చుకుపోయేలా చూడాలి. గ్రామీణులకు మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించాల్సిన అవసరం ఉంది’’ అని పితాలే సూచించారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం కష్టమైనదే అయినా, ఇది నీది నాది అని భావిస్తే సాధ్యమేనని పరిశ్రమ నుంచి అభిప్రాయం వ్యక్తమైంది.
You may be interested
ఆర్బీఐ సమీక్ష, అంతర్జాతీయ అంశాలే దిక్సూచీ..!
Monday 2nd December 2019గురువారం ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలు వెల్లడి అమెరికా–చైనాల వాణిజ్య ఒప్పందంపై మార్కెట్ దృష్టి ఈనెల 6న వియన్నాలో ఒపెక్ సమావేశం శుక్రవారం వెల్లడైన జీడీపీ డేటా ప్రభావం.. ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కేవలం 4.5 శాతం వృద్ధి రేటుకే పరిమితమైంది. గడచిన ఆరేళ్లలో వృద్ధి వేగం ఇంతటి తక్కువ స్థాయిని నమోదుచేయడం ఇదే తొలిసారి కాగా, శుక్రవారం మార్కెట్ ముగిసిన తరువాత
డిజిటల్ వేగానికి ‘క్రెడిట్ కార్డు’ జోరు
Monday 2nd December 2019క్రెడిట్ కార్డుల వినియోగం దేశంలో మంచి జోరు మీదున్నది. ఈ ఏడాది మే నాటికి వినియోగంలో ఉన్న కార్డులు 4.89 కోట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలానికి ఈ సంఖ్య 3.86 కోట్లుగానే ఉంది. 27 శాతం వృద్ధి కొత్త వ్యాపార అవకాశాలకు ఊతమిచ్చినట్టుగా చెల్లింపుల పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొంటున్నారు. దేశీయంగా క్రెడిట్ కార్డుల వ్యాపారంలో రెండో అతిపెద్ద సంస్థ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ ఐపీవోకు వచ్చేందుకు గత