News


ఈ ఏడాది వృద్ధి 5 శాతమే

Wednesday 13th November 2019
Markets_main1573613492.png-29538

  • రెండో క్వార్టర్‌లో 4.2 శాతానికి పడిపోవచ్చు
  • ఆర్థిక వృద్దిపై ఎస్‌బీఐ ఎకోరాప్‌ అంచనాలు

న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) 5 శాతానికి తగ్గిస్తున్నట్టు ఎస్‌బీఐ ఆర్థిక పరిశోధన విభాగం ఎస్‌బీఐ ఎకోరాప్‌ స్పష్టంచేసింది. వృద్ధి 6.1 శాతం మేర ఉంటుందని గతంలో వేసిన అంచనాలను సంస్థ సవరించింది. మరీ ముఖ్యంగా రెండో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్‌) జీడీపీ వృద్ధి 4.2 శాతానికి పడిపోవచ్చని పేర్కొనడాన్ని గమనించాలి. మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌) జీడీపీ వృద్ధి 5 శాతానికి క్షీణించిన విషయం తెలిసిందే. ఇది 2013 మార్చి తర్వాత అత్యంత కనిష్ట వృద్ధి రేటు. ఆటోమొబైల్‌ అమ్మకాలు తగ్గిపోవడం, విమాన ప్రయాణికుల్లో క్షీణత, ప్రధాన రంగాల్లో వృద్ధి ఫ్లాట్‌గా ఉండడం, నిర్మాణం, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు తగ్గిపోవడం వంటివి రెండో త్రైమాసికంలో వృద్ధిని తగ్గించనున్నట్లు ఎస్‌బీఐ ఎకోరాప్‌ పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మాత్రం వృద్ధి రేటు 6.2 శాతానికి పుంజుకుంటుందని అంచనా వేసింది. 
కీలక రేట్లలో భారీ కోత?
వృద్ధికి ఊతమిచ్చేందుకు గాను ఆర్‌బీఐ డిసెంబర్‌లో జరిగే పాలసీ సమీక్షలో భారీ రేట్ల కోత దిశగా అడుగు వేయవచ్చని ఎస్‌బీఐ ఎకోరాప్‌ తన నివేదికలో పేర్కొంది. వృద్ధి కోసం ఆర్‌బీఐ ఈ ఏడాది ఇప్పటి వరకు 1.35 శాతం మేర కీలక రేట్లను తగ్గించింది. అక్టోబర్‌ పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ ఎంపీసీ సైతం 2019-20 జీడీపీ వృద్ధి అంచనాలను 6.1 శాతానికి తగ్గించడం గమనార్హం. డిసెంబర్‌ 5న ఆర్‌బీఐ నిర్ణయం వెలువడుతుంది. భారత క్రెడిట్‌ అవుట్‌లుక్‌ను మూడీస్‌ నెగెటివ్‌కు మార్చడం పెద్ద ప్రభావమేదీ చూపదని, ఎందుకంటే రేటింగ్‌ నిర్ణయాలు ఆలస్యంగా వచ్చే సంకేతాలని ఎస్‌బీఐ ఎకోరాప్‌ పేర్కొంది. అందుకే ఈ విడత రేటింగ్‌ చర్యను మార్కెట్లు పట్టించుకోలేదని గుర్తు చేసింది. You may be interested

భారత్‌లో కష్టమే..

Wednesday 13th November 2019

మరిన్ని పెట్టుబడులు పెట్టేదిలేదు ప్రభుత్వ తోడ్పాటు లేకపోతే ఇక అంతే.. వోడాఫోన్‌ యూకే సీఈఓ నిక్‌రీడ్‌ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు తీర్పుతో వేల కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తే భారత్‌లో కార్యకలాపాలు కొనసాగించడం కష్టమేనని బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్‌ సీఈవో నిక్ రీడ్ వ్యాఖ్యానించారు. వొడాఫోన్‌- ఐడియా జాయింట్ వెంచర్‌ మరింత సంక్షోభంలో కూరుకుపోకుండా చూసేందుకు చెల్లింపుల విషయంలో ప్రభుత్వం తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కంపెనీ ఆర్థిక

పీఈ సంస్థల్లేని ఐపీవోలు అదుర్స్‌!

Wednesday 13th November 2019

ఐపీవోల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా..? లిస్టింగ్‌ లాభాలను ఆర్జిస్తున్నారా..?.. అవును అంటే మీరు తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం ఇది. ప్రైవేటు ఈక్విటీ సంస్థల మద్దతుతో వచ్చే ఐపీవోలతో పోలిస్తే పీఈ మద్దతులేని ఐపీవోలు లిస్టింగ్‌ రోజున అధిక లాభాలను ఇస్తున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే కంపెనీల ఫండమెంటల్స్‌ కూడా ఇక్కడ పనిచేయడం లేదు!   2018-19, అంతకుముందు రెండు ఆర్థిక సంవత్సరాల్లో గణాంకాలను పరిశీలించినట్టయితే.. పీఈ మద్దతుగల 39 కంపెనీలు లిస్టింగ్‌

Most from this category