News


2018-19లో వృద్ధి 6.1 శాతమే!

Saturday 1st February 2020
news_main1580527366.png-31385

  • తొలి 6.8 శాతం గణాంకాల సవరణ

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేవలం 6.1 శాతమేనని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) శుక్రవారం పేర్కొంది. ఈ మేరకు తొలి 6.8 శాతం గణాంకాలను దిగువముఖంగా సవరించినట్లు వివరించింది. మైనింగ్‌, తయారీ, వ్యవసాయ రంగాల క్షీణత దీనికి ప్రధాన కారణమని ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది. విలువ రూపంలో చూస్తే, జీడీపీ రూ.131.75 లక్షల కోట్ల (2017-18) నుంచి రూ.139.81 లక్షల కోట్లకు చేరినట్లు వివరించింది. ‍కాగా తలసరి ఆదాయం 2017-18లో రూ.1,15,293 ఉంటే, ఇది 2018-19లో రూ.1,26,521కు ఎగసింది. 



You may be interested

మౌలిక రంగం కొంచెం రికవరీ...

Saturday 1st February 2020

డిసెంబర్‌లో 1.3 శాతం వృద్ధి న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం గ్రూప్‌ డిసెంబర్‌ నెలలో కొంచెం రికవరీ అయ్యింది. 1.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అంతక్రితం నాలుగు నెలల్లో గ్రూప్‌లో అసలు వృద్ధి నమోదుకాకపోగా, క్షీణ ఫలితాలు నమోదయ్యాయి. తాజా సమీక్షా నెల డిసెంబర్‌లో బొగ్గు, ఎరువులు, రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తి మెరుగుపడ్డం మొత్తం ఫలితంపై కొంత సానుకూల ప్రభావం చూపింది. స్టీల్‌, సిమెంట్‌ రంగాలు కూడా సానుకూలతలోనే ఉన్నాయి.

అదుపుతప్పిన 2019-20 ద్రవ్యలోటు

Saturday 1st February 2020

బడ్జెట్‌ అంచనాల్లో 132 శాతానికి అప్‌ న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు- వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు అదుపు తప్పింది. 2019-20 బడ్జెట్‌ అంచనాల్లో 132.4 శాతంగా నమోదయ్యింది. శుక్రవారం ఈ గణాంకాలు వెల్లడయ్యాయి. వివరాల్లోకి వెళితే... 2020 మార్చి నాటికి ద్రవ్యలోటు రూ. 7,03,760 కోట్లు ఉండాలన్నది 2019-20 బడ్జెట్‌ లక్ష్యం. ఇది 2019-20 జీడీపీ అంచనాల్లో 3.3 శాతం. అయితే 2019 డిసెంబర్‌ ముగిసే నాటికే రూ.9,31,725 కోట్లుగా

Most from this category