News


రికార్డు స్థాయికి ఫారెక్స్‌ నిల్వలు

Saturday 12th October 2019
news_main1570871174.png-28845

రిజర్వుబ్యాంక్‌ వద్దనున్న ఫారెక్స్‌ నిల్వలు(విదేశీ మారక ద్రవ్య నిల్వలు) అక్టోబర్‌ 4తో ముగిసిన వారంలో రికార్డుస్థాయికి చేరుకున్నాయి. తాజాగా ముగిసిన వారంలో విదేశీ మారక నిలవ్లు 4.24 బిలియన్‌ డాలర్లు పెరిగి 437.83 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) ఓ నివేదికలో పేర్కొం‍ది. ఈ వారానికి ముందు వారంలో ఈ నిల్వలు 5.02 బిలియన్‌ డాలర్లు పెరిగి 433.59 బిలియన్‌ డాలర్లకు చేరుకోవడం గమనార్హం. విదేశీ కరెన్సీ(ఎఫ్‌సీఏ) నిల్వలు పెరగడంతో ఫారెక్స్‌ నిల్వలు గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయని ఆర్‌బీఐ తెలిపింది. కాగా అక్టోబర్‌ 4తో ముగిసిన వారంలో ఎఫ్‌సీఏ 3.99 బిలియన్‌ డాలర్లు పెరిగి 405.61 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ఫారెక్స్‌ నిల్వలను యుఎస్‌ డాలర్ల మారకంలో తెలుపుతున్నప్పటికి, పౌండ్‌, యూరో, యెన్‌ వంటి ఇతర ప్రధాన కరెన్సీ నిల్వలు కూడా ఉంటాయి. బంగారం నిల్వలు, అక్టోబర్‌ 4తో ముగిసిన వారంలో  232 మిలియన్‌ డాలర్ల మేర పెరిగి 27.17 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు ఆర్‌బీఐ నివేదిక తెలుపుతోంది. విదేశీ మారకంగా ఉపయోగించే ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు(స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌) ఇదే వారంలో 10 లక్షల డాలర్లు పెరిగి 1.43 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అదే విధంగా ఐఎంఎఫ్‌ వద్ద దేశీయ రిజర్వ్‌లు 90 లక్షల డాలర్లు పెరిగి 3.61 బిలియన్ డాలర్లకు పెరిగాయని ఆర్‌బీఐ డేటా పేర్కొంది.



You may be interested

T2T, A, B, Z స్టాకులంటే ఏంటి?

Saturday 12th October 2019

లిస్టెడ్‌ స్టాకుల్లో అనేక వర్గీకరణలుంటాయి. ఇన్వెస్టర్లకు స్టాకుల గురించి అవగాహన పెంచేందుకు ఎక్చేంజ్‌లు ఇలా వర్గీకరణ చేస్తాయి. ఆయా ట్రేడింగ్‌ లక్షణాల ఆధారంగా షేర్లను ఎక్చేంజ్‌లు వర్గీకరిస్తాయి. ఒక షేరు ఏ తరగతిలో ఉందో తెలుసుకోవడం ద్వారా దాని స్వరూప స్వభావాలు అర్ధం చేసుకోవచ్చు. రెండు ప్రధాన ఎక్చేంజ్‌ల్లో ఈ వర్గీకరణ ఇంచుమించు ఒకేలా ఉంటుంది. ముందుగా బీఎస్‌ఈలో వివిధ గ్రూపుల గురించి తెలుసుకుందాం.. బీఎస్‌ఈలో స్టాకులను A, B, S,

నిఫ్టీలో ర్యాలీ సంకేతాలు!

Saturday 12th October 2019

దేశీయ మార్కెట్లు ఈ వారం వివిధ విభాగాల్లో ట్రెండ్‌ రివర్సల్‌ చూశాయి. ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలు క్రమంగా ఫలితాలు చూపుతున్నట్లు కనిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ చర్యలకు ఆర్‌బీఐ రేట్‌కట్‌ మూడ్‌ తోడవడంతో సెంటిమెంట్‌ క్రమంగా పాజిటివ్‌ దిశగా మరలుతోంది. ఇది సిప్‌ నిధుల ప్రవాహం పెరగడంలో వెల్లడవుతోంది. ఆగస్టులో రూ. 8200 కోట్ల నిధులు సిప్‌ రూపంలో ఈక్విటీల్లోకి వచ్చాయి. మరోవైపు ఎఫ్‌పీఐల పెట్టుబడుల ఉపసంహరణ వేగం

Most from this category