News


నిర్మలా ఏం చెబుతారో...

Tuesday 31st December 2019
news_main1577776463.png-30558

సంవత్సరం చివరి రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత స్థితిలో ఆర్థిక మంత్రి ఏవిషయమై ఈ సమావేశం నిర్వహిస్తున్నారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తంమీద ఆర్థిక వ్యవస్థలో పునరుజ్జీవానికి సంబంధించిన చర్యలనే మంత్రి ప్రకటించే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా రూ. 100 లక్షల కోట్ల జాతీయ ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల వివరాలకు సంబంధించిన చర్యలను నిర్మల ప్రకటించవచ్చని అంచనాలున్నాయి. 2024కు ఎకానమీని 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలన్న ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా తాజా చర్యలుండొచ్చు. ఇన్‌ఫ్రా కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. తాజా సమావేశంలో ఈ టాస్క్‌ఫోర్స్‌ నివేదిక వివరాలు, 2021-25 కాలంలో తీసుకునే చర్యలు.. తదితరాల ప్రకటన ఉండవచ్చు. అదేవిధంగా దేశమంతా వర్తించేలా ఒక సింగిల్‌ విండో క్లియరెన్స్‌ వ్యవస్థ తీసుకురావాలని డీపీఐఐటీ ఆలోచిస్తోంది. దీన్ని నాలుగు దశల్లో అమలు చేయాలని భావిస్తోంది. ఇది అమలైతే దేశవ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల అనుమతులు ఆన్‌లైన్‌లో పొందవచ్చు. ఈ వ్యవస్థ గురించిన వివరాలు కూడా ఈ రోజు ప్రకటనలో ఉండే అవకాశం ఉందని ఊహాగానాలున్నాయి. 



You may be interested

మిడ్‌క్యాప్‌ ఎన్‌బీఎఫ్‌సీలవైపు చూపు

Tuesday 31st December 2019

ఇప్పటికే ఎన్‌బీఎఫ్‌సీ విభాగంలో భారీ కరెక్షన్‌ ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ తదితరాలు ఆకర్షణీయం హేమంగ్‌ జాని, సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌, షేర్‌ఖాన్‌ 2019 ముగింపు దశకు చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే ఏడాది(2020) వెలుగులో నిలవగల కౌంటర్లవైపు మార్కెట్‌ దృష్టి పెట్టనున్నట్లు బ్రోకింగ్‌ సంస్థ షేర్‌ఖాన్‌, సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ హేమంగ్‌ జాని చెబుతున్నారు. ఇటీవల వృద్ధి బాటలో సాగుతున్న స్టాక్స్‌కు ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇచ్చే వీలున్నట్లు తెలియజేశారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా పలు

3నెలల గరిష్టానికి పసిడి

Tuesday 31st December 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర ఈ ఏడాది చివరి రోజైన డిసెంబర్‌ 31న 3నెలల గరిష్టాన్ని అం‍దుకుంది. సంవత్సరాంతపు కొనుగోళ్ల పాటు డాలర్‌ బలహీనత పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్ల మద్దతునిచ్చాయి. ఆసియాలో మంగళవారం ఔన్స్‌ పసిడి ధర 9డాలర్లు బలపడి 1,527డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అప్‌ట్రెండ్‌లో 1,535డాలర్ల వద్ద కీలక నిరోధ స్థాయి ఉంది. మొదటి దశ వాణిజ్య ఒప్పంద పత్రాలపై ట్రంప్‌, జింగ్‌ పింగ్‌లు వచ్చే నెల

Most from this category