News


ఎగుమతులు, హౌసింగ్‌ రంగాలకు ఆర్థిక మంత్రి ఉద్దీపన

Saturday 14th September 2019
news_main1568457223.png-28379

పడిపోయిన ఎగుమతుల్ని పునరుద్ధరించే క్రమంలో కొత్త స్కీమును ప్రవేశపెట్టడంతో పాటు, మధ్యాదాయ వర్గాల హౌసింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి ఆర్థికసాయం అందించేందుకు స్పెషల్‌ విండో ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. శనివారంనాడు న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఎగుమతులు, హౌసింగ్‌ రంగాలకు  పలు ఉద్దీపన చర్యల్ని మంత్రి వెల్లడించారు. ముఖ్యాంశాలు....

-ఎగుమతి ఉత్పత్తులపై సుంకం లేదా పన్నుల ఉపశమనం(ఆర్‌ఓడీటీఈపీ) అనే కొత్త పథకాన్ని ప్రారంభించనున్నాం. ఇది జనవరి 1, 2020 నుంచి మర్చండీస్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఇం​డియా స్కీమ్ (ఎంఈఐఎస్‌) ను భర్తీ చేయనుంది. ఈ కొత్త పథకం ద్వారా ప్రభుత్వ ఖజానా రూ. 50,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది.
-ఎగుమతి క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఈసీఐఎస్‌ పరిధిని పెంచనుంది.  ఎగుమతుల కోసం వర్కింగ్ క్యాపిటల్‌ రుణాలను ఇచ్చే బ్యాంకులకు అధిక బీమా సౌకర్యాన్ని ఈ కార్పొరేషన్‌ అందించనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి రూ. 1,700 కోట్లను ఖర్చు చేయనుంది.
-దుబాయ్‌లో జరిగే వార్షిక మెగా షాపింగ్ ఫెస్టివల్‌ వంటివి ఇండియాలో కూడా నిర్వహిస్తాం. ఈ తరహా ఫెస్టివల్స్‌తో పర్యాటకం, చిన్న, మధ్యతరహా సంస్థలకు, ఎగుమతి రంగానికి ఇది ప్రయోజనం చేకూర్చనుంది.
-సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంచడం ద్వారా 'ఎగుమతి చేసే సమయం' తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విమానాశ్రయాలు, ఓడరేవులలో  ఎగుమతులకు పట్టే సమయాన్ని తగ్గించడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తాం. ఈ ప్రణాళిక డిసెంబర్ 2019 నాటికి అమలులోకి వస్తుంది.  దీనిని పర్యవేక్షించడానికి ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్‌ను ఏర్పాటు చేయనున్నాం.
-ఎగుమతులకు ఇచ్చే రుణాన్ని ప్రాధాన్యత రంగాలకు ఇచ్చే రుణాలుగా బ్యాంకులు పరిగణిస్తాయి. అంతేకాకుండా ఎగుమతులకు రుణ లభ్యత ఉండేలా అదనంగా రూ. 36,000-68,000 కోట్లను విడుదల చేయనున్నాం.
-ఎక్సోఫోర్ట్‌ ఫైనాన్స్‌పై డేటాను ఆర్‌బీఐ క్రమం తప్పకుండా ప్రచురిస్తుంది. ప్రస్తుతం ఒక ఇంటర్ మినిస్టీరియల్ వర్కింగ్ గ్రూప్(ఐడబ్యూజీ) ఎక్స్‌పోర్ట్‌ ఫైనాన్స్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది.
-ఎన్‌పీఏయేతర, ఎన్‌సీఎల్‌టీయేతర ప్రాజెక్టులలో నిధుల కొరత కారణంగా ఆగిపోయిన మధ్యాదాయ వర్గాల హౌసింగ్ ప్రాజెక్టులు పూర్తికావడానికి కావలసిన చివరి నిధులను ప్రభుత్వం ప్రత్యేక విండో ద్వారా అందిస్తుంది. ఈ విండోను ప్రభుత్వం రూ .10,000 కోట్లతో ఏర్పాటు చేయనుంది. ఈ విండో మార్కెట్‌లో, బ్యాంకింగ్ లేదా హౌసింగ్ ఫైనాన్స్ నిపుణుల ద్వారా నడుస్తుంది. తక్కువ నిధులు అవసరమయ్యే మధ్యాదాయ వర్గాల ప్రాజెక్టులు, పూర్తయ్యే దశలో ఉన్న ప్రాజెక్టులను వీరు గుర్తిస్తారు. ఫలితంగా గృహాల కోసం ఇన్వెస్ట్‌చేసి, ఆ ఇళ్లు పూర్తికావడం కోసం ఎక్కువకాలం వేచిచూస్తున్న కొనుగోలుదార్లకు ఇది చేయూతనివ్వనుంది. ఇబ్బందుల్లో ఉన్న హౌసింగ్ ప్రాజెక్టులు ఇప్పుడు ఉపశమనం పొందవచ్చు.

-అందుబాటు గృహాల ప్రాజెక్టులకు విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీలు) లభ్యత కోసం మార్గదర్శకాలను సరళీకరిస్తాం.You may be interested

సావరిన్‌ గోల్డ్‌ బాండ్లా..!? గోల్డ్‌ ఈటీఎఫ్‌ లా..?

Saturday 14th September 2019

మార్కెట్లో నెలకొన్న అనిశ్చితితో ఇన్వెస్టర్లు పసిడి పెట్టుబడుల వైపు పరుగులు తీస్తున్నారు. సాధారణంగా భౌతిక పసిడి ప్రత్యామ్నాయంగా సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు, గోల్డ్‌ ఎక్చ్సేంజీ ట్రేడెడ్‌ ఫండ్లు, గోల్డ్‌ ఫండ్లలో పెట్టవచ్చు. అయితే వీటిలో పెట్టుబడులకు కొన్ని ప్రయోజనాలతో పాటు మరికొన్ని పరిమితులున్నాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌, గోల్డ్‌ ఇండెక్స్‌ ఫండ్ల కంటే సావరిన్‌ గోల్డ్‌ బాండ్లలో పెట్టుబడులు ఉత్తమమని  ఫైనాన్షియల్‌ అడ్వైజరీస్‌ ఫౌండర్‌ సురేష్‌ సదాగోపన్‌ అభిప్రాయపడుతున్నారు. ‘‘ప్రసుత్త కాలంలో

బ్యాంకింగ్‌ షేర్లలో ఎఫ్‌పీఐల అమ్మకాలు

Saturday 14th September 2019

కేంద్ర ఆర్థిక మంత్రి, ఈ ఏడాది బడ్జెట్‌లో కంపెనీల షేర్ల బై బ్యాక్‌పై పన్నును, సూపర్‌రిచ్‌లపై అదనపు ట్యాక్స్‌ను విధించడంతో అగష్టు నెలలో బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌  షేర్ల నుంచి ఎఫ్‌పీఐ(విదేశి సంస్థాగత ఇన్వెస్టర్లు) నిధుల ఔట్‌ఫ్లో భారీగా జరిగిందని, ఇది గత ఏడున్నరేళ్లలో అధ్వాన్న పరిస్థితి అని ఎన్‌ఎస్‌డీఎల్‌(నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ) డేటా పేర్కొంది.  అగష్టు 2019లో ఎఫ్‌పీఐలు బ్యాంకింగ్‌ షేర్ల నుంచి 124 కోట్ల డాలర్ల సంపదను ఉపసంహరించుకోగా,

Most from this category