News


కొత్త సంస్కరణల్లేవు.. అయినా రేటింగ్‌ యథాతధం..

Wednesday 5th February 2020
news_main1580896358.png-31533

బడ్జెట్‌పై ఫిచ్‌ రేటింగ్స్‌
నూతన నిర్మాణాత్మక సంస్కరణలు తాజా బడ్జెట్లో పెద్దగా లేవని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజన్సీ ఫిచ్‌ రేటింగ్స్‌ అభిప్రాయపడింది. అయితే ఈ కారణంతో భారత వృద్ధి అంచనాలను మార్చడం లేదని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ 5.6 శాతం వృద్ధి సాధిస్తుందని తెలిపింది. 2024-25 నాటికి జీడీపీలో ప్రభుత్వ వ్యయం వాటా 60 శాతానికి పరిమితం చేయాలన్న ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట లక్ష్యం నెరవేరకపోవచ్చని అభిప్రాయపడింది. 2021-11 నాటికి జీడీపీలో ప్రభుత్వ వ్యయం 70 శాతముంటుందని తెలిపింది. ఈ రేంజ్‌లో ప్రభుత్వ రుణాలుండడం బీబీబీ రేటింగ్‌ ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే బలహీనతను చూపుతోందని తెలిపింది. బడ్జెట్లో అంశాలు తమ అంచనాలకు అనుగుణంగనే ఉన్నాయని, అందువల్ల దేశ రేటింగ్‌ను యథాతధంగా ఉంచుతున్నామని తెలిపింది. బడ్జెట్లో విత్తలోటు అంచనాలను పెంచడం తాజా పరిస్థితికి తగ్గట్లే ఉందని ఫిచ్‌ పేర్కొంది. 
బడ్జెట్లో పేర్కొన్నట్లు వచ్చే ఏడాది నామినల్‌ జీడీపీ వృద్ది 10 శాతం ఉంటుందన్న అంచనా, రెవెన్యూలో 9.2 శాతం వృద్ధి ఉంటుందన్న అంచనాలు నమ్మశక్యంగానే ఉన్నాయని తెలిపింది. అయితే డౌన్‌సైడ్‌ రిస్కులు కొనసాగుతాయని, కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, ఐటీ తగ్గింపులతో ఆదాయాలపై నెగిటివ్‌ ప్రభావం ఉండొచ్చని తెలిపింది. పన్నుకోతలు మిడ్‌టర్మ్‌కు పాజిటివ్‌ ప్రభావం చూపవచ్చని, కానీ వెనువెంటనే మాత్రం నెగిటివ్‌ భారం మోపుతాయని వ్యాఖ్యానించింది. గతేడాది ప్రభుత్వం కొన్ని నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకువచ్చిందని, అందువల్ల ఈ ఏడాది బడ్జెట్లో పెద్దగా సంస్కరణల మాట లేదని తెలిపింది. బడ్జెట్లో విత్త సంస్థలపై ప్రభావం చూపే పలు చర్యలు ప్రకటించారని, కానీ ఇవన్నీ విత్త రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పాక్షిక పరిష్కారమే చూపుతాయని తెలిపింది. పన్ను కోతలతో వచ్చే లోటు భర్తీకి డిజిన్వెస్ట్‌మెంట్‌పై ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుందని, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం చేరుకోవాలంటే విక్రయ లక్ష్యాల్లో కోతలు తగవని సూచించింది. అనుకున్న రీతిలో డిజిన్వెస్ట్‌మెంట్‌ సాగకపోయినా, వ్యయాలు పెరిగినా జీడీపీలో లోటు వచ్చే ఏడాది 5.4 శాతం వరకు ఎగబాకవచ్చని అంచనా వేసింది. You may be interested

ఎస్‌ఆర్‌ఎఫ్‌ జూమ్‌- జీ.. కుదేల్‌

Wednesday 5th February 2020

పెట్టుబడి ప్రణాళికలకు బోర్డు అనుమతించినట్లు వెల్లడించడంతో విభిన్న కెమికల్స్‌ తయారీ కంపెనీ ఎస్‌ఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. కాగా.. మరోపక్క కంపెనీ ఖాతా పుస్తకాలను ప్రభుత్వం తనిఖీ చేయనున్న వార్తలతో మీడియా రంగ దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఎస్‌ఆర్‌ఎఫ్‌ భారీ లాభాలతో కళకళలాడుతుంటే.. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కౌంటర్‌ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. ఎస్‌ఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌ ఆగ్రో కెమికల్స్‌ విభాగంలో వినియోగించగల ఇంటర్మీడియెట్స్‌ తయారీకి

దీర్ఘకాలానికి 15 స్టాక్‌ రికమండేషన్స్‌

Wednesday 5th February 2020

జాబితాలో ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాలు కన్జూమర్‌ ఫైనాన్స్‌, ఫుట్‌వేర్‌, హెల్త్‌కేర్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పెంచే అంచనాలను బడ్జెట్‌ మిస్‌ అయినప్పటికీ షేర్లలో దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రస్తుత సమయాన్ని వినియోగించుకోవచ్చునని పలువురు మా‍ర్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. పలువురు ఆర్థికవేత్తల ఆశలను బడ్జెట్‌ అందుకోనప్పటికీ మార్కెట్ల ట్రెండ్‌ను దెబ్బతీయలేదని అభిప్రాయపడ్డారు. వెరసి మార్కెట్లు ఇకపైనా మరింత లాభపడే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో దీర్ఘకాలిక ధృక్పథంతో షేర్ల కొనుగోలును చేపట్టవచ్చని సూచిస్తున్నారు. అయితే ఫండమెంటల్స్‌

Most from this category