News


జీడీపీ వృద్ధి అవుట్‌లుక్‌ను తగ్గించిన ఫిచ్‌రేటింగ్స్‌

Monday 2nd March 2020
news_main1583145431.png-32225

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు జీడీపి వృద్ధి అవుట్‌లుక్‌ను 4.9శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రముఖ రేటింగ్‌ ఫిచ్‌ సోమవారం తెలిపింది. దేశీయంగా నెలకొన్న బలహీనమైన డిమాండ్‌ పాటు కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తితో సప్లై చైన్‌కు అంతరాయం కలగవచ్చనే అంచానలతో అవుట్‌లుక్‌ తగ్గించినట్లు రేటింగ్‌ సంస్థ తెలిపింది. అయితే వ్యవస్థలో రికవరీ కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరం(2020-21) జీడీపీ వృద్ధి 5.4శాతం ఉండవచ్చని పేర్కోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గతంలో భారత జీడీపీ వృద్ధిని 5.1శాతంగానూ, వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ 5.9శాతం గానూ అంచనావేసినట్లు ఫిచ్‌ రేటింగ్‌ తెలిపింది. 

ప్రభుత్వ వినియోగం మందగించడం, స్థూల స్థిర మూలధన నిర్మాణంలో బాగా సంకోచం, ఎగుమతులు క్షీణించడంతో రెండవ త్రైమాసికంలో 5.1 శాతంగా నమోదైన జీడీపీ మూడవ త్రైమాసికం నాటికి 4.7 శాతానికి తగ్గింది.

 
చైనాలో కొనసాగుతున్న కోవిడ్ -19 వ్యాప్తి నుండి ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ సప్లైలో అంతరాయం ఏర్పడింది. తద్వారా భారతదేశ ఎగుమతి ఉత్పాదక రంగంపై ఒత్తిడి పెరిగింది. ఈ కారణంగా మేము జీడీపీ అవుట్‌లుక్‌ను సవరిస్తున్నాం. ఇది విస్తృత సేవల రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఫిచ్ రేటింగ్‌ చెప్పుకొచ్చింది. జూన్ నుండి వైరస్ వ్యాప్తి తగ్గముఖం పట్టడంతో ఆర్థిక వ్యవస్థలో వచ్చే ఆర్థిక సంవత్సరపు స్వల్పంగా వృద్ధిని చూడచ్చని ఫిచ్‌ తెలిపింది. 



You may be interested

బంగారం బాండ్లలో ఇన్వెస్ట్‌మెంట్‌ అవకాశం

Tuesday 3rd March 2020

భారత ప్రభుత్వ సౌర్వభౌమ బంగారం బాండ్ల (ఎస్‌జీబీ) సిరీస్‌-10 ఇష్యూ ఈ నెల 2న ప్రారంభమైంది. ఈ ఏడాది తొలి ఇష్యూ ఇది. బంగారం ధరలు పెరుగుతుండడంతో గతేడాది చేపట్టిన ఇష్యూలకు మంచి స్పందన వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో, ప్రపంచ మాంద్యం భయాలతో ఇ‍న్వెస్టర్లు రిస్క్‌ తగ్గించుకునేందుకు బంగారంలో పెట్టుబడులు పెంచుకుంటున్నారు. కనుక బంగారం ధర కొత్త రికార్డులను సృష్టిస్తోంది. అయితే భౌతిక బంగారం

ఢిల్లీలో కరోనా- మార్కెట్‌ కుదేల్‌

Monday 2nd March 2020

తొలుత భారీ లాభాలు- తుదకు నష్టాలు చివరి సెషన్‌లో పతనబాట పట్టిన సెన్సెక్స్‌ దేశీయంగా తొలి కరోనా కేసు నమోదు  ఎన్‌ఎస్‌ఈలో ఐటీ రంగం​ఎదురీత దేశీయంగా ఢిల్లీ, తెలంగాణలలో రెండు కరోనా కేసులు నమోదైనట్లు వెలువడిన వార్తలు ఉన్నట్లుండి దేశీ స్టాక్‌ మార్కెట్లకు షాకిచ్చాయి. దీంతో ఏకంగా 750 పాయింట్ల హైజంప్‌తో ప్రారంభమైన సెన్సెక్స్‌ చివర్లో 400 పాయింట్లకుపైగా పతనమైంది. చివర్లో కోలుకున్నప్పటికీ మార్కెట్లు ప్రస్తావించదగ్గ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 153 పాయింట్లు క్షీణించి 38,144

Most from this category