News


కేంద్రానికి ఆదాయాల ‘మందగమనం’

Saturday 30th March 2019
Markets_main1553934321.png-24875

కేంద్రానికి ఆదాయాల ‘మందగమనం’
- లక్ష్యం 6.34 లక్షల కోట్లు
- ఫిబ్రవరి ముగింపుకే
 రూ.8.51 లక్షల కోట్లు
- ఆర్థిక సంవత్సరంలో మరో నెల

- లక్ష్యాన్ని దాటనివ్వమంటున్న కేం‍ద్రం న్యూఢిల్లీ:  ప్రభుత్వ ఆదాయాలు - వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- ద్రవ్యలోటు లెక్కలు ఆందోళన సృష్టిస్తున్నాయి. ఆదాయాలు తగ్గడం, వ్యయాలు పెరగడం దీనికి కారణం. శుక్రవారం విడుదలయిన కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ గణాంకాలను పరిశీలిస్తే...

- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్ - 2019 మార్చి) మధ్య  ద్రవ్యలోటు 6.24 లక్షల కోట్లుగా ఉండాలని సంబంధిత బడ్జెట్‌ నిర్దేశించింది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 3.3 శాతం.
- అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి పియూష్‌ గోయెల్‌ రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ, 2018-19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు అంచనాలను 6.24 లక్షల కోట్ల నుంచి రూ.6.34 లక్షల కోట్లకు (జీడీపీలో 3.4 శాతం) పెంచారు. చిన్న సన్నకారు రైతుల ఆదాయ పథకానికి ఫండింగ్‌ వల్ల ద్రవ్యలోటు లక్ష్యాన్ని పెంచాల్సి వచ్చిందని తన బడ్జెట్‌ ప్రసంగంలో గోయెల్‌ తెలిపారు. 
- అయితే ఫిబ్రవరి ముగిసే నాటికి (ఆర్థిక సంవత్సరం ఇంకా నెల ఉండగానే) ఈ లోటు రూ. 8.51 లక్షల కోట్లుగా నమోదయ్యింది. అంటే లక్ష్యం (రూ.6.34 లక్షల కోట్లు)లో 100 శాతం దాటిపోయి మరో 34.2 శాతం (134.2 శాతం) పెరిగిందన్నమాట. 
- అయితే కేంద్రం మాత్రం ద్రవ్యలోటును సవరిత అంచనాలను (రూ.6.34 లక్షల కోట్లు) ఎంతమాత్రం దాటనివ్వమని స్పష్టం చేస్తోంది. ఆర్థిక సంవత్సరం మరో నెల (మార్చి) కేంద్ర ఖజానాకు రానున్న ఆదాయం లోటును కట్టడి చేస్తుందన్న అభిప్రాయాన్ని ఆర్థికశాఖ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఆర్‌బీఐ నిధులపై ఆధారపడక తప్పదా?
ద్రవ్యలోటును ఎలా పూడ్చుకోవాలన్న అంశంపై సర్వత్రా ఇప్పుడు చర్చ నెలకొంది.  ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు ఆర్‌బీఐ వద్ద ఉన్న నిధుల్లో మెజారిటీ వాటాను పొందాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆర్‌బీఐ వద్ద జూన్‌ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్‌ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్‌ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఇందులో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో- డిసెంబర్‌ 10వ తేదీన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ప్రకటించారు.  ఈ నిధుల నిర్వహణను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అంతకుముందు నవంబర్‌ 19న జరిగిన ఆర్‌బీఐ బోర్డ్‌ సమావేశం నిర్ణయించింది.  ఇందుకు అనుగుణంగా జలాన్‌ నేతృత్వంలో కమిటీ కూడా ఏర్పాటయ్యింది. ఏప్రిల్‌లో ఈ కమిటీ తన నివేదికను సమర్పించే అవకాశం ఉంది. గతంలోనూ ఆర్‌బీఐ నిల్వలపై మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి. వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్‌ (2004), వైహెచ్‌ మాలేగామ్‌ (2013) ఈ కమిటీలకు నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12 శాతం వరకూ ఆర్‌బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, ఉఫా థోరట్‌ కమిటీ దీనిని 18 శాతంగా పేర్కొంది. ఆర్‌బీఐ థోరట్‌ కమిటీ సిఫారసును తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారుల మేరకు నడుచుకోవాలని నిర్ణయం తీసుకుంది. కాగా లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్‌ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం స్థూల రుణాల్లో 28 శాతం నిష్పత్తిలో ఆర్‌బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 14 శాతం నిధులు సరిపోతాయని ఆర్థిక మంత్రిత్వశాఖ భావిస్తున్నట్లు సమాచారం.You may be interested

కన్జూమర్‌ రంగంలో మందగమనం!

Saturday 30th March 2019

గతంలో వినిమయ రంగం 20- 25 శాతం వృద్ది సాధించేదని, క్రమంగా ఆ స్వర్ణయుగం కరిగిపోతోందని ప్రముఖ కన్జూమర్‌ ఎకనమిస్టు రమా బిజాపుర్కార్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా నెలకొన్న సందిగ్ధతతో సాధారణ ప్రజలు కొనుగోళ్లు జరిపే మూడ్‌లో లేరన్నారు. కానీ కొన్ని అంశాల్లో మాత్రం వినిమయం కనిపిస్తూనే ఉందని, ఇందుకు ఉదాహరణ బయటకు వెళ్లి భోజనాలు చేయడమని చెప్పారు. వినిమయం నిరంతర ప్రక్రియని, దీనికి ముగింపు ఉండదని చెప్పారు. తరతరానికి

క్యూ3లో క్యాడ్‌ 2.5 శాతం

Saturday 30th March 2019

ముంబై: దేశ కరెంట్‌ అకౌంట్‌ లోటు (సీఏడీ- క్యాడ్‌) అక్టోబర్‌-డిసెంబర్‌ కాలంలో (ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికం) ఇదే కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చిచూస్తే, 2.5 శాతంగా నమోదయ్యింది.   విలువలో క్యాడ్‌ పరిమాణం 16.9 బిలియన్‌ డాలర్లు. 2017- 2018 ఇదే త్రైమాసికంలో ఈ విలువ 13.7 బిలియన్‌ డాలర్లు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ మధ్య ఈ విలువ 19.1 బిలియన్‌ డాలర్లు (జీడీపీలో

Most from this category