News


ద్రవ్యలోటు లక్ష్యం తగ్గింపు

Saturday 6th July 2019
news_main1562397566.png-26858

  •  జీడీపీలో 3.3 శాతం వద్ద కట్టడి

2019-20 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ద్రవ్యలోటు (ప్రభుత్వానికి వచ్చే ఆదాయం-చేసే వ్యయాల మధ్య నికర వ్యత్యాసం) 3.3 శాతం వద్ద కట్టడి చేయాలని బడ్జెట్‌ నిర్దేశించింది. ఫిబ్రవరి 1న సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌లో ఈ లోటును 3.4 శాతంగా అంచనావేయడం జరిగింది. ఈ లోటు కట్టడి లక్ష్యంగా అంతర్జాతీయ మార్కెట్‌ ద్వారా కేంద్ర రుణ సమీకరణలకూ బడ్జెట్‌లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 

మార్కెట్‌ నుంచి రూ.4.48 లక్షల కోట్ల రుణం
2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.4.48 లక్షల కోట్లు మార్కెట్‌ నుంచి సమీకరించుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2018-18లో ఈ మొత్తం 4.22 లక్షల కోట్లు. స్థూలంగా రుణ సమీకరణ గణాంకాలను చూస్తే, ఈ మొత్తాన్ని బడ్జెట్‌ రూ.5.71 లక్షల కోట్ల నుంచి రూ.7.1 లక్షల కోట్లకు పెంచింది. తన మొత్తం రుణాల్లో కొంత భాగాన్ని విదేశీ మార్కెట్ల ద్వారా విదేశీ కరెన్సీలో సమకూర్చుకోవాలని బడ్జెట్‌ నిర్దేశించింది. దీనిపై త్వరలో ఒక బ్లూప్రింట్‌ను విడుదల చేస్తామని ఫైనాన్స్‌ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ తెలిపారు. ఎంత మొత్తాన్ని విదేశీ మార్కెట్‌ నుంచి సమీకరించాలన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. ఇప్పటివరకూ ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టడానికి విదేశాలకు అనుమతి ఉంది. విదేశీ మార్కెట్లో మాత్రం బాండ్ల జారీ జరగలేదు. 



You may be interested

బడ్జెట్‌పై మోదం.. ఖేదం

Saturday 6th July 2019

2019–20 ఆర్థిక సంవత్సరానికి కేంద్రబడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దాదాపు అన్ని రంగాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌తో ఏ రంగాలు ఉత్తేజ పడతాయో, ఏవి డీలా పడతాయో చూద్దాం.. సానుకూల ప్రభావం గ్రామీణ భారతం: గ్రామాలను అనుసంధానించే రోడ్ల నిర్మాణ వ్యయాలను పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని గృహాల నిర్మాణం, పశుదాణా ఉత్పత్తి చేసే చిన్న వ్యాపారులకు మద్దతు లాంటి చర్యలు గ్రామీణ భారతంతో సంబంధమున్న కంపెనీలకు

జీరో బడ్జెట్‌... ఖర్చు లేని సాగు

Saturday 6th July 2019

ఈ దిశగా ‘సాగా’లన్న ఆర్థిక మంత్రి సుభాష్‌ పాలేకర్‌ పద్ధతిపై ప్రత్యేక ప్రస్తావన జీరో బడ్జెట్‌ వ్యవసాయం దిశగా దేశం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు పూర్వ పద్ధతుల వైపు మళ్లాల్సి ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. బడ్జెట్‌ ప్రసంగంలో దేశ వ్యవసాయ స్థితిగతులను ప్రస్తావిస్తూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఐక్య రాజ్య సమితికి చెందిన ఆహార –

Most from this category