News


త్వరలో ఫైనాన్షియల్‌ ఈటీఎఫ్‌?

Thursday 27th June 2019
news_main1561631009.png-26631

ఆర్థిక రంగానికి ప్రత్యేకించిన ఎక్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. మార్కెట్లో లిస్టయిన పీఎస్‌యూ బ్యాంకులు, బీమా కంపెనీలు, ప్రభుత్వ రంగ విత్తసంస్థల షేర్లతో కొత్త ఈటీఎఫ్‌ను రూపొందించనున్నారు. ఈ ఫండ్‌ సృష్టించేందుకు కావలిసిన సలహాదారు నియామకానికి తాజాగా డీఐపీఏఎం నోటిఫికేషన్‌ జారీ చేసింది. సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌, భారత్‌ 22 ఈటీఎఫ్‌లు బాగా విజయవంతమయ్యాయని డీఐపీఏఎం అధికారి వ్యాఖ్యానించారు. గతేడాదిలో పీఎస్‌బీలు బలోపేతం చెందినందున విత్త రంగానికి ప్రత్యేకమైన ఈటీఎఫ్‌ను తీసుకువచ్చేందుకు అవకాశం ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరం భారత్‌ 22 ఈటీఎఫ్‌తో ప్రభుత్వం దాదాపు రూ.19వేల కోట్లను, సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌తో రూ. 26,350 కోట్లను సమీకరించింది. గత ఐదేళ్లలో పీఎస్‌బీలకు ప్రభుత్వాలు దాదాపు 3.19 లక్షల కోట్ల రూపాయల రీక్యాప్‌ సాయం అందించాయి. ప్రస్తుతం పీఎస్‌బీల మొండిపద్దులు బాగా దిగివచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత నాలుగేళ్లలో పీఎస్‌బీల రుణరికవరీ బాగా స్పీడందుకుంది. గత నాలుగేళ్లలో పీసీఆర్‌ 46 నుంచి 74 శాతానికి మెరుగుపడింది. ఇవన్నీ బ్యాంకింగ్‌ రంగంలో పురోగమనాన్ని సూచిస్తున్నాయి. అందువల్ల ఈ పరిస్థితుల్లో ఫైనాన్షియల్‌ ఈటీఎఫ్‌ తీసుకువస్తే బాగా క్లిక్‌ అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్లో దీని గురించి ప్రస్తావన ఉండే అవకాశాలున్నట్లు తెలిసింది. 



You may be interested

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్‌

Thursday 27th June 2019

11850 దిగువన ముగిసిన నిఫ్టీ జూన్‌ డెరివేట్‌ కాంటాక్టుల ముగింపు రోజున మార్కెట్‌ దాదాపు ఫ్లాట్‌గా ముగించింది. సెన్సెక్స్‌ 5పాయింట్ల నష్టంతో 39,586 వద్ద, నిఫ్టీ 3 పాయింట్లు కోల్పోయి 11,844.10 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఐటీ, మెటల్‌, మీడియా, ఎఫ్‌ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. అటో, రియల్టీ, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రైవేట్‌ రంగ షేర్ల బ్యాంక్‌ షేర్ల ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన

ఎఫ్‌అండ్‌ఓ నుంచి నిష్క్రమించే స్టాకులను ఏం చేద్దాం?

Thursday 27th June 2019

జూన్‌ సీరిస్‌తో 34 స్టాకులు ఎఫ్‌అండ్‌ఓ నుంచి వైదొలగుతున్నాయి. ఈ స్టాకులను ఫ్యూచర్స్‌ విభాగం నుంచి తొలగిస్తున్నట్లు ఏప్రిల్‌లోనే ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. ఇలా ఎఫ్‌అండ్‌ఓ నుంచి నిష్క్రమిస్తున్న స్టాకుల్లో ఆర్‌పవర్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, జైన్‌ ఇరిగేషన్‌, పీసీ జువెల్స్‌, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, సీజీ పవర్‌, సియట్‌, అజంతా ఫార్మా, ఐడీఎఫ్‌సీ, కావేరీ సీడ్స్‌, సౌత్‌ ఇండియా బ్యాంక్‌, గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ తదితరాలున్నాయి. మార్కెట్‌ క్యాప్‌ పరంగా దేశీయ కంపెనీల్లో టాప్‌500

Most from this category