News


మూడీస్‌ డౌన్‌గ్రేడ్‌ ప్రభావం వుండదు..ఆర్థిక శాఖ

Friday 8th November 2019
news_main1573195355.png-29446

దేశ ఆర్థిక వృద్ధి గతంలో కంటే బలహీనంగా ఉందని ఇండియా క్రెడిట్‌ రేటింగ్‌ అవుట్‌టుక్‌ను, అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ ‘స్థిరం’ నుంచి ‘ప్రతికూలం’ కు తగ్గించింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రతిస్పందించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రాధమిక అంశాలు బలంగా ఉన్నాయని, ప్రభుత్వం తాజాగా తీసుకున్న వరుస ఆర్థిక సంస్కరణలు పెట్టుబడులను పెంచుతాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇండియా ఇప్పటికి కూడా వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థలలో ముందుందని, మూడీస్‌, ఇండియా దృక్పథాన్ని ‘స్థిరం’ నుంచి ‘ప్రతికూలం’ రేటింగ్‌కు తగ్గించిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  ‘ఇండియాపై దీని ప్రభావం ఉండదు’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది. దేశ ఆర్థిక వృద్ధి రేటు 2019లో 6.1 శాతంగా, వచ్చే ఏడాది 7 శాతంగా ఉంటుందనే అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) అంచనాలను ఈ ప్రకటనలో కోట్‌ చేశారు. ‘ఇండియా వృద్ధి రేటు స్థిరంగా ఉంది. ఐఎంఎఫ్‌, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఇండియాపై సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తున్నాయి’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఆర్థిక, ఇతర రంగాలకు సంబంధించి సంస్కరణలు తీసుకొచ్చిందని పేర్కొంది. ‘అంతర్జాతీయ మందగమనానికి ప్రతిస్పందనగా కూడా ప్రభుత్వం పాలసీలను తీసుకొచ్చింది. ఈ చర్యలు ఇండియాపై సానుకూల దృక్పథం పెరగడానికి సహపడతాయి. ఫలితంగా ఇండియాకి మూలధన ప్రవాహం, ఉద్దీపన పెట్టుబడులు వస్తాయి’ అని ఈ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ‘దేశ ఆర్థిక వ్యవస్థ ప్రాథమికంగా బలంగా ఉంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండడంతో పాటు బాండ్‌ ఈల్డ్‌లు కూడా తక్కువగా ఉన్నాయి. సమీప కాలంలో కూడా ఇండియా బలమైన వృద్ధి అవకాశాలను అందిస్తుంది’ అని వివరించింది. 



You may be interested

డీమెర్జర్‌ ప్రకటన.. రేమండ్‌ 20 శాతం అప్‌

Friday 8th November 2019

దేశీయ టెక్స్‌టైల్‌ దిగ్గజం రేమండ్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 20 శాతం మేర దూసుకుపోయింది. కంపెనీకి చెందిన లైఫ్‌స్టైల్‌ వ్యాపారాన్ని విడదీసి ప్రత్యేక సంస్థగా లిస్టింగ్‌కు తీసుకువస్తామని రేమండ్‌ ప్రకటించింది. దీంతో ఇకపై రేమండ్‌ రెండు కంపెనీలుగా మారనుంది. కొత్తగా ఏర్పడే కంపెనీ సంస్థకు కీలకమైన బ్రాండెడ్‌ టెక్స్‌టైల్స్‌, అపెరల్‌ వ్యాపారాన్ని చూసుకుంటుంది. పాత కంపెనీ కొత్తగా ఆరంభిస్తున్న రియల్టీ ప్రాజెక్టులు, ల్యాండ్‌ బ్యాంక్‌, ఇంజనీరింగ్‌, ఎఫ్‌ఎంసీజీ వ్యాపారాలను చూసుకుంటుంది.

ఈ షేర్లపై ఎంఎస్‌సీఐ ప్రభావం

Friday 8th November 2019

మోర్గాన్‌స్టాన్లీ క్యాపిటల్‌ ఇంటర్నేషనల్‌(ఎంఎస్‌సీఐ) తాజాగా తన సూచీలను సమీక్షించింది. ఇందులో భాగంగా పలు భారతీయ కంపెనీల షేర్లను తన సూచీల్లో కలపడం, తీసివేయడం జరిపింది. ఈ ప్రభావం శుక్రవారం ట్రేడింగ్‌లో ఆయా కంపెనీల షేర్లపై కనిపిస్తోంది.  - కొత్తగా ఎంఎస్‌సీఐ ఇండియా ఇండెక్స్‌లో స్థానం సంపాదించిన డీఎల్‌ఎఫ్‌ షేరు ఉదయం ట్రేడింగ్‌లో దాదాపు 6 శాతం లాభపడింది.  - అదేవిధంగా హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ షేరు దాదాపు 4 శాతం పైన, ఇంద్రప్రస్థగ్యాస్‌ దాదాపు

Most from this category