News


28 శాతం పెరిగిన ఎఫ్‌డీఐలు

Friday 6th September 2019
news_main1567741516.png-28230

-ఈ క్యూ1లో 1,633 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు 
-సేవల రంగంలో అత్యధికం 
-ప్రభుత్వ గణాంకాలు వెల్లడి 

న్యూఢిల్లీ: భారత్‌కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో ఎఫ్‌డీఐలు 28 శాతం వృద్ధి చెందాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. మౌలిక రంగంలో జోరు ద్వారా వృద్ది జోష్‌నందుకోవడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కీలకం. ఎఫ్‌డీఐల జోరు పెంచడానికి ఇటీవలనే ప్రభుత్వం కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకుంది. సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ ట్రేడింగ్‌, కోల్‌ మైనింగ్‌, కాంట్రాక్ట్‌ మాన్యుఫాక్చరింగ్‌ రంగాల్లో ఎఫ్‌డీఐల నిబంధనలను సరళీకరించింది. ఇక ప్రభుత్వం వెల్లడించిన తాజా  గణాంకాల ప్రకారం..., 
-గత క్యూ1లో 1,275 కోట్ల డాలర్లుగా ఉన్న ఎఫ్‌డీఐలు ఈ క్యూ1లో 1,633 కోట్లకు పెరిగాయి. 
-సేవల రంగంలో అత్యధికంగా ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఈ క్యూ1లో ఈ రంగంలో 280 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. 
-సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ రంగంలో 224 కోట్ల డాలర్లు, ట్రేడింగ్‌ విభాగంలో 113 కోట్ల డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. 
-మన దేశానికి  సింగపూర్‌ నుంచి అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ఈ దేశం నుంచి ఈ క్యూ1లో మనకు 533 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. 
-మారిషస్‌ నుంచి 467 కోట్ల డాలర్లు, అమెరికా నుంచి 145 కోట్లు, నెదర్లాండ్స్‌ నుంచి 135 కోట్ల డాలర్ల చొప్పున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. 



You may be interested

ఆఫీసు సమయంలోనే ఆన్‌లైన్లో!!

Friday 6th September 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ఇంటర్నెట్లో విహరించడం సులువు అయింది. భారతీయుల్లో అత్యధికులు ఆఫీసు సమయంలోనే.. అంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఆన్‌లైన్‌ కంటెంట్‌ను ఎక్కువగా ఆస్వాదిస్తున్నారని కేపీఎంజీ, ఇరోస్‌ నౌ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. ఆన్‌లైన్‌ వీడియో ప్లాట్‌ఫామ్స్‌పై సగటున రోజుకు 70 నిముషాలకుపైగా సమయం వెచ్చిస్తున్నారట. హైదరాబాద్‌ సహా 16 నగరాల్లో చేపట్టిన ఈ సర్వేలో 1,458 మంది

కో వర్కింగ్‌... ఇపుడిదే కింగ్‌!!

Friday 6th September 2019

తక్కువ వ్యయానికే అద్దె కార్యాలయాలు వీటివైపే మొగ్గు చూపుతున్న కంపెనీలు సేల్స్‌ఫోర్స్‌, ఒరాకిల్‌ వంటి దిగ్గజాలదీ ఇదే దారి ఇప్పటికే ఈ రంగంలో 300కు పైగా కంపెనీలు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- తక్కువ బడ్జెట్లో కంపెనీని ఏర్పాటు చేశారా? అయినప్పటికీ అన్ని సౌకర్యాలతో ట్రెండీ ఆఫీస్‌ కావాలా? మీలాంటి వారికి కో-వర్కింగ్‌ స్పేస్‌ చక్కని పరిష్కారం. స్టార్టప్స్‌ మాత్రమే కాదు, పెద్ద కంపెనీల కార్యకలాపాలకూ ఇవి చక్కని వేదికలుగా నిలుస్తున్నాయి. ఉద్యోగుల్లో 46 శాతం మిలీనియల్స్‌

Most from this category