భయపెడుతున్న వాణిజ్యలోటు
By Sakshi

న్యూఢిల్లీ: ఎగుమతులు-దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం... వాణిజ్యలోటు భయపెడుతోంది. మే నెలలో ఏకంగా ఈ లోటు 15.36 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గడచిన ఆరు నెలల్లో ఇంత ఎక్కువ స్థాయి (2018 నవంబర్‌లో 16.67 బిలియన్ డాలర్లు) వాణిజ్యలోటు ఇదే తొలిసారి. ఎగుమతులు తక్కువగా ఉండడం దీనికి ప్రధాన కారణం. శుక్రవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం- మేలో దేశం ఎగుమతులు 3.93 శాతం (2018 ఇదే నెలతో పోల్చి) పెరిగాయి. విలువ రూపంలో 30 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతుల విలువ 4.31 శాతం పెరుగుదలతో 45.35 బిలియన్ డాలర్లుగా నమోదయ్యియి. దీనితో వాణిజ్యలోటు 15.36 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ఏప్రిల్- మే నెలల్లో.... భారత ఎగుమతి సంస్థల సమాఖ్య ప్రెసిడెంట్
2019-20 ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలనూ తీసుకుంటే, ఎగుమతులు 2.37 శాతం వృద్ధితో 56 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 4.39 శాతం పెరుగుదలతో 86.75 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి వాణిజ్యలోటు 30.69 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
అంతర్జాతీయ మందగమనం వల్లే...
అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు మందగమనంలో ఉండడం వల్లే భారత్ ఎగుమతులు ప్రతికూలంగా ఉన్నాయి. అమెరికాసహా పలు దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక వాణిజ్య విధానాలు కూడా దీనికి కారణం. దేశంలో లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఇంకా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వాణిజ్య యుద్ధ సమస్యల తీవ్రతా ఉంది. ఇవన్నీ ఎగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల సమస్య మున్ముందు సవాళ్లను సృష్టించే అవకాశం ఉంది.
You may be interested
పండుగ సీజనే కాపాడాలి
Saturday 15th June 20192025 నిబంధనలతో అనేక సమస్యలు గ్రామీణ సంక్షోభం కుంగదీస్తోంది విస్తరణపై పెట్టుబడులను పునఃసమీక్షిస్తాం ‘సాక్షి’తో ‘హోండా’ ఇండియా సీఈఓ మినోరు కాటో (న్యూఢిల్లీ నుంచి డి.శాయి ప్రమోద్) దేశీయ ఆటో రంగం రాబోయే పండుగ సీజన్‌పై కోటి ఆశలు పెట్టుకుందని, ఈ సీజన్లో విక్రయాలు ఊపందుకుంటాయని భావిస్తున్నామని హోండా మోటర్‌సైకిల్స్, స్కూటర్ ఇండియా సీఈఓ మినోరు కాటో చెప్పారు. ఈ ఏడాది కూడా రుతుపవనాలు ఫెయిలైతే ఆటో కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయన్నారు. గత సెప్టెంబర్ నుంచి
9న టీసీఎస్‌తో ఫలితాల బోణీ
Saturday 15th June 201912న ఇన్ఫోసిస్; 17న విప్రో న్యూఢిల్లీ: వచ్చే నెల నుంచి కంపెనీల ఫలితాల సీజన్ మొదలు కాబోతోంది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ (ఏప్రిల్-జూన్) ఫలితాలను వచ్చే నెల 12న వెల్లడించనున్నది. మరోవైపు అదే నెల 9న మరో ఐటీ దిగ్గజం టీసీఎస్ ఫలితాలతో ఐటీ కంపెనీల సీజన్ మొదలవుతుంది. విప్రో ఫలితాలు అదే నెల 17న వెలువడతాయి.