News


ఆర్థిక మందగమనానికి ఆనవాలు!

Tuesday 16th July 2019
news_main1563259925.png-27094

  • జూన్‌లో ఎగుమతులు, దిగుమతుల క్షీణత
  •  9.71 శాతం క్షీణించిన ఎగుమతులు
  • ఎనిమిది నెలల తర్వాత మళ్లీ 
  • నిరాశాకర పరిస్థితి
  • దిగుమతులూ మైనస్‌లోనే
  • వృద్ధిలేకపోగా 9 శాతం క్షీణత
  • 15.28 బిలియన్‌ డాలర్ల వాణిజ్యలోటు

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని  జూన్‌ ఎగుమతి, దిగుమతి గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు విభాగాల్లోనూ వృద్ధి లేకపోగా (2018 జూన్‌తో పోల్చి) క్షీణత నమోదయ్యింది. సోమవారం వెలువడిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
-  ఎగుమతులు అసలు పెరక్కపోగా 9.71 శాతం క్షీణించాయి. ఎనిమిది నెలల తర్వాత (2018 సెప్టెంబర్‌లో - 2.15 శాతం క్షీణత తర్వాత) దిగుమతులు క్షీణతను నమోదుచేసుకున్నాయి. విలువ రూపంలో ఎగుమతులు 25.01 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 
- రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్‌ గూడ్స్‌, పెట్రోలియం ప్రొడక్టులు, ప్లాస్టిక్‌, హస్త కళల ఉత్పత్తులు, రెడీమేడ్‌ దుస్తులు, రసాయనాలు, తోలు, సముద్ర ఉత్పత్తులు, చమురు గింజలు ఇలా కీలక విభాగాల్లో ఎగుమతులు పడిపోయాయి. 
- వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం- నిర్వహణ అంశాల నేపథ్యంలో ఏప్రిల్‌ 17 నుంచి జూన్‌ 28 వరకూ ఓఎన్‌జీసీ మంగళూర్‌ పెట్రోకెమికల్‌ లిమిటెడ్‌ తాత్కాలికంగా తన ఉత్పత్తిని నిలిపివేసింది. ఇది పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపింది. జామ్‌నగర్‌ రిఫైనరీ పరిస్థితి కూడా జూన్‌లో దాదాపు ప్రతికూలంగానే ఉంది. అంతర్జాతీయంగా స్పీట్‌ ధరల పతనం ఇంజనీరింగ్‌ గూడ్స్‌పై ప్రభావం చూపింది. 
- ఇక దిగుమతులూ క్షీణతలోనే ఉన్నాయి. - 9 శాతం క్షీణత నమోదయ్యింది. విలువ రూపంలో 40.26 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. 
- దీనితో ఎగుమతి-దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం- వాణిజ్యలోటు 15.28 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది జూన్‌లో వాణిజ్యలోటు 16.6 బిలియన్‌ డాలర్లు.
- పసిడి దిగుమతులు 13 శాతం పెరిగి 2.7 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 
- చమురు దిగుమతులు 13.33 శాతం క్షీణించి 11 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  చమురు-యేతర దిగుమతులు 7.34 శాతం క్షీణించి 29.26 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 


పలు దేశాల్లోనూ ఇదే ధోరణి...
ఇటీవలి నెలల్లో పలు దేశాల ఎగుమతులు కూడా పడిపోవడం గమనార్హం. ఏప్రిల్‌కు సంబంధించి అంతర్జాతీయ వాణిజ్య సం‍స్థ వెలువరించిన గణాంకాల ప్రకారం జపాన్‌ (-5.88 శాతం), యూరోపియన్‌ యూనియన్‌ (-4.30 శాతం), చైనా (-2.75 శాతం), అమెరికా (-2.12 శాతం) ఎగుమతులు కూడా క్షీణతను నమోదుచేసుకున్నాయి. 

బేస్‌ ఎఫెక్టే...
2018 జూన్‌ నెలలో ఎగుమతులు (27.7 బిలియన్‌ డాలర్లు) భారీగా పెరిగాయి. అప్పటితో పోల్చితే ఇప్పుడు తక్కువ ఎగుమతులు జరిగాయి. బేస్‌ ఎఫెక్ట్‌ వల్ల ఎగుమతులు భారీగా పడిపోయినట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి కూడా భారత్‌ ఎగుమతులు భారీగా లేకపోవడానికి ఒక కారణం. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల 2019లో ప్రపంచ వాణిజ్యం (కేవలం 2.6 శాతం) బలహీనంగా ఉం‍టుందని గత నెల వెలువడిన గ్లోబల్‌ ఎకనమిక్‌ ప్రాస్పెక్ట్‌ నివేదిక కూడా పేర్కొన్న విషయం ఇక్కడ గమనార్హం. 
- అనూప్‌ వర్థమాన్‌, వాణిజ్య కార్యదర్శి

ఏప్రిల్‌-జూన్‌ మధ్యా క్షీణతే..
కాగా ఏప్రిల్‌- జూన్‌ మధ్యా ఎగుమతులు 1.69 శాతం క్షీణించి 81 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతులు 0.29 శాతం క్షీణించి 127 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. వెరిసి వాణిజ్యలోటు 45 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. 

సేవల ఎగుమతుల్లో 15.49 శాతం వృద్ధి...
కాగా రిజర్వ్‌ బ్యాం‍క్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం- మేనెల్లో సేవల ఎగుమతులు 15.49 శాతం పెరిగాయి. విలువ 18.68 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా సేవల దిగుమతులు 22.37 శాతం పెరిగి 12.49 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 

 



You may be interested

బజాజ్‌ కన్సూమర్‌ లాభం 9 శాతం అప్‌

Tuesday 16th July 2019

10 శాతం పెరిగిన ఆదాయం  న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీ బజాజ్‌ కన్సూమర్‌ కేర్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.57 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సంరలో ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం, రూ.52 కోట్లుతో పోల్చితే 9 శాతం వృద్ధి సాధించామని బజాజ్‌ కన్సూమర్‌ కేర్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.224 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.247 కోట్లకు పెరిగిందని

రెండేళ్ల కనిష్టానికి టోకు ధరలు

Tuesday 16th July 2019

  జూన్‌లో 2.02 శాతం అన్ని సూచీల్లో తగ్గిన స్పీడ్‌ న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల స్పీడ్‌) 2019 జూన్‌లో 2.02 శాతం పెరిగింది. అంటే 2018 ఇదే నెలతో పోల్చితే ఈ బాస్కెట్‌ మొత్తం ధర కేవలం 2.02 శాతమే పెరిగిందన్నమాట. గడచిన 23 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో టోకు ధరల పెరుగుదల రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. టోకున విద్యుత్‌, ఇంధన, తయారీ

Most from this category