STOCKS

News


మరో రేట్‌ కట్‌...విశ్లేషకుల అంచనా

Friday 4th October 2019
news_main1570183322.png-28721

 రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) శుక్రవారం ఎంపీసీ(మానిటరీ పాలసీ కమిటీ) సమావేశంలో మరోదపా 25 బేసిస్‌ పాయింట్లను తగ్గించి రెపోరేటును 5.15 శాతానికి పరిమితం చేసింది. ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయిన దేశ జీడీపీని తిరిగి పుంజుకునేలా చేసేందుకు ఈ చర్య ఉపకరిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ వృద్ధి అంచనాలను 6.1 శాతానికి తగ్గించింది.  దీనిని చేరుకునేందుకు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచి మరో 15 బేసిస్‌ పాయింట్ల వరకు రేట్లను తగ్గించవచ్చని అభిప్రాయపడుతున్నారు.  అంతేకాకుండా ఆర్‌బీఐ కూడా సరళ వైఖరిని అనుసరిస్తోందని, జీడీపీ వృద్ధికి సంబంధించి అవసరమైన నిర్ణయాలను తీసుకోడానికి సిద్ధంగా ఉంటామనే సంకేతాలనిచ్చిందని తెలిపారు. కాగా ఆర్‌బీఐ రేట్ల కోత చర్యపై మార్కెట్‌ విశ్లేషకుల వ్యాఖ్యానాలు:
మోతిలాల్‌ ఓస్వాల్‌,  మోతిలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, మేనేజింగ్‌ డైరక్టర్‌
ఆర్‌బీఐ 25 బేసిస్‌ పాయింట్లను తగ్గించి ప్రస్తుతం రెపో రేటును 5.15 శాతానికి తగ్గించింది. ఇది సరియైన స్థాయిగా అనిపిస్తోంది. కానీ అసలు సమస్య బ్యాంకులు ఈ రేట్లకోత ఫలితాలను వినియోగదారులకు బదిలీ చేయడంలోనే  ఉంది. ఈ బెంచ్‌మార్క్‌ రేట్లను వినియోగదారులకు బదిలీ చేయాలని ఆర్‌బీఐ, బ్యాంకింగ్‌ వ్యవస్థను కోరుతున్నప్పటికి ఈ వ్యవస్థ చాలా నెమ్మదిగా ప్రతిస్పందిస్తోంది. వీరు రిస్క్‌ తీసుకోడానికి సిద్ధపడడం లేదు. ఫలితాల సీజన్‌ ప్రారంభమవ్వడంతో ఈక్విటీ మార్కెట్లు ఫలితాలపై దృష్ఠి పెట్టనున్నాయి. ఫలితంగా కొంత పరిధిలో జాగ్రత్తతో ఈక్విటీ మార్కెట్లు ట్రేడయ్యే అవకాశం ఉంది. మధ్యస్థ కాలం నుంచి దీర్ఘకాలం వరకు ఈక్విటీ మార్కెట్‌లో మంచి అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నాం. 

నిలేష్‌ షా, కోటక్‌ ఏఎంసీ(అసెట్‌ మేనేజ్‌మెంట్‌), ఎండీ
ఇది మంచి చర్యని అనడంలో సందేహం లేదు. గతంలో చేసిన సమీక్ష కన్నా ప్రస్తుత సమీక్ష చాలా హెతుబద్ధంగా ఉంది. దేశ జీడీపీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.3 శాతం నుంచి 7 శాతం ప్లస్‌కు చేరుకోవాలంటే ప్రతి ఒక్కరి సహాయం అవసరం. వ్యవస్థలో లిక్విడిటీ పాజిటివ్‌గా ఉంది. ఇది ఈ ఏడాది జులై నుంచి పాజిటివ్‌గా మారుతోంది. ముఖ్యంగా రేట్ల కోత బదిలీ జరిగేలా మనం చూడాలి. ఈ బదిలీ జరగకుండా ఉండేలా అనేక మూలధన అడ్డంకులు వ్యవస్థలో ఉన్నాయి. బదిలీ జరిగితేనే లిక్విడిటీ, జీడీపీ వృద్ధిలో తోడ్పాటునందిస్తుంది. రుతుపవనాలు సాధారణ స్థాయిలోకి  రావడం, ఆయిల్‌ ధరలు తగ్గడం వంటి చర్యల వలన దేవుడు మనపై దయతో ఉన్నాడని తెలుస్తోంది. కానీ దీనికి అదనంగా రేట్ల కోతను బదిలీ చేసి కార్పోరేట్‌ లేదా రిటైల్‌ స్థాయిల నుంచి రుణ పంపిణీలను పెంచాలి. అప్పుడు జీడీపీ రెండవ త్రైమాసికం వృద్ధి రేటు 5.3 శాతం నుంచి నాలుగో త్రైమాసికానికి 7 శాతానికి పెరుగుతుంది. 

అనాఘ్‌ దీయోధార్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, ఆర్థికవేత్త
ఆర్‌బీఐ తక్కువ మొత్తంలోనైనా(15 బేసిస్‌ పాయింట్లు) మరోదపా రేట్ల కోతను చేస్తుందని అంచనావేస్తున్నాం. దీంతో ఆర్థికసంవత్సరం 2020లో రెపోరేటు 5 శాతానికి చేరుకుంటుంది. కానీ ప్రభుత్వం కార్పోరేట్‌ టాక్స్‌ తగ్గించడం వంటి ఆర్థిక చర్యలను ప్రకటించడంతో పాటు ఈ ఏడాది ద్వితియార్ధంలో వృద్ధి, ద్రవ్యోల్బణం పుంజుకునే అవకాశం ఉండడంతో ఆర్‌బీఐ ఇంకోసారి రేట్లను తగ్గించడానికి తక్కువ అవకాశం ఉంది. 

లక్ష్మీ అయ్యర్‌, కోటక్‌ మహింద్రా ఏఎంసీ, సీఐఓ(డెట్‌) అండ్‌ హెడ్‌ ప్రోడెక్ట్స్‌
ఆర్‌బీఐ ఎంపీసీలో 25 బేసిస్‌ పాయింట్ల రేట్లకోతను చేయడానికి మెజార్టీ సభ్యులు ఓటు వేశారు. అంతేకాకుండా దేశ వృద్ధిలో సహాయపడేవిధంగా నిర్ణయాలుంటాయనే ఒక సరళవైఖరిని కూడా ఎంపీసీ ప్రకటించింది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీ లభ్యత పెరగడం బాండ్‌ ఈల్డ్‌లకు కొంత మద్ధతుగా ఉంటుంది. ముఖ్యంగా స్వల్పకాలంలో ముగిసే ఈల్డ్‌కర్వ్‌లకు ఇది అనుకూలం. ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాలు, సమీపకాలంలో బాండ్‌ ఈల్డ్‌ల కదలికలను నిర్దారిస్తాయి.You may be interested

నష్టాల మార్కెట్లో ఐటీ షేర్ల ర్యాలీ..!

Friday 4th October 2019

ఆర్‌బీఐ జీడీపీ అంచనాల్ని 6.1 శాతానికి తగ్గించడంతో మార్క్‌ట్‌లో విపరీతమైన అమ్మకాలు జరుగుతున్పటికీ.., ఐటీ షేర్లకు మాత్రం కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేడు 15,328.40 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ఒడిదుడుకుల ట్రేడింగ్‌ ఐటీ షేర్లకు డిమాండ్‌ను పెంచింది. ఫలితంగా డాలర్ల రూపంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ షేర్లకు లాభాల బాట పట్టాయి. ఐటీ

జీడీపీ కట్‌తో మార్కెట్‌ క్రాష్‌

Friday 4th October 2019

2వారాల కనిష్టాన్ని తాకిన నిఫ్టీ ఆర్‌బీఐ తాజా పాలసీలో వడ్డీ రేట్లు తగ్గించినప్పటికీ, జీడీపీ అంచనాల్ని సైతం భారీగా 6.1 శాతానికి తగ్గించడంతో శుక్రవారం మధ్యాహ్నం మార్కెట్‌ నిలువునా పతనమయ్యింది. స్టాక్‌ సూచీలు రెండు వారాల కనిష్టస్థాయికి తగ్గాయి. సెప్టెంబర్‌ మూడోవారంలో కార్పొరేట్‌ పన్నును తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం జరిగిన ర్యాలీ తర్వాత...సూచీలు ఇంత దిగువస్థాయికి తగ్గడం ఇదే ప్రధమం.  నేడు జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో

Most from this category